మందు ఎక్కువగా తాగితే కోపం పెరుగుతుంది.. ఏకాగ్రత తగ్గుతుంది.. ఇలా కాకూడదంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి

Published : Mar 16, 2023, 10:19 AM IST
మందు ఎక్కువగా తాగితే కోపం పెరుగుతుంది.. ఏకాగ్రత తగ్గుతుంది.. ఇలా కాకూడదంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి

సారాంశం

మందును ఎక్కువగా తాగితే కాలెయం మాత్రమే కాదు మీ మెదడు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందుకే ఆల్కహాల్ ను ఎక్కువగా తాగకూడదని నిపుణులు చెప్తారు.   

ఏదైనా సరే.. అతి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దాని ప్రతికూల ప్రభావాలు మీపై తప్పకుండా కనిపిస్తాయి. తినడమైనా కావొచ్చు.. తాగడమైనా కావొచ్చు. అసలు విషయానికొస్తే ఆల్కహాల్ ను ఎక్కువగా తాగేవారు చాలా మందే ఉన్నారు. లిమిట్ లో మందును తాగడం అంత ప్రమాదకరమేమీ కాదు కానీ.. మోతాదుకు మించి ఎక్కువగా తాగితే మాత్రం ఎన్నో అనారోగ్య  సమస్యలు వస్తాయి. గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు, రోగనిరోధక శక్తి బలహీనపడటం, ఎముకల బలహీనతో పాటుగా మందు ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. అయినప్పటికీ ఆల్కహాల్ ను మానేయడం అంత సులువు కాదు. కానీ కొన్ని సులభమైన మార్గాల్లో మీరు శరీరాన్ని నిర్విషీకరణ చేయొచ్చు. 

మద్యం ఎక్కువగా తాగే వారిలో కనిపించే లక్షణాలు 

ఆహారం తినాలని అనిపించకపోవడం.
సులువుగా నిర్ణయాలను తీసుకోకపోవడం
మానసికంగా అలసిపోయినట్టు అనిపించడం
కోపంగా ఉండటం. ఎప్పుడూ కోపగించుకోవడం

పరిశోధన ఏం చెబుతోందంటే..

క్యాంబ్రిస్ ఆర్గనైజేషన్ అధ్యయనం ప్రకారం.. మందు మత్తు దిగడానికి 6 నుంచి 24 గంటలు పడుతుంది. ఇందులో రోగి మళ్లీ మద్యం సేవించే ప్రమాదం ఉంది. ఇది 36 నుంచి 72 గంటల సమయం ఉంటుంది. ఇది రోగికి మతిమరుపు,  మూర్ఛ వచ్చే ప్రమాదం ఉన్నప్పుడు. శరీరాన్ని నిర్విషీకరణ ఎలా చేయొచ్చు ఇప్పుడు తెలుసుకుందాం.. 

నీటిని ఎక్కువ తాగాలి

ఆల్కహాల్ మత్తును వదిలించుకోవడానికి నీళ్లను ఎక్కువగా తాగాలి. నిజానికి ఆల్కహాల్ వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. దీనివల్ల శరీరంలోని నీరంతా బయటకు పోతుంది. ఇది మిమ్మల్ని డీహైడ్రేషన్ బారిన పడేస్తుంది. మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచడానికి నీటిని ఎక్కువగా తాగాలి. దీనివల్ల శరీరంలో ఉండే టాక్సిన్స్ నీటి నుంచి ఆటోమేటిక్ గా బయటకు పోతాయి. 

యోగా భంగిమలు 

అతిగా మద్యం సేవించడం వల్ల  మానసికంగా బలహీనులవుతారు. దీనివల్ల వారి జ్ఞాపకశక్తి కూడా బలహీనపడటం ప్రారంభమవుతుంది. విషయాలపై దృష్టి పెట్టడంలో ఇబ్బంది ఉంటుంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఈ సమస్యలను ఎదుర్కోవటానికి ధ్యానం చేయడం చేయండి. ధ్యానం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇది ఆల్కహాల్ ను మానేయడానికి సహాయపడుతుంది. రోజూ 45 నిమిషాలు యోగా చేయడం వల్ల మద్యపానం నుంచి బయటపడొచ్చు.

ఆరోగ్యకరమైన ఆహారం 

ఆల్కహాల్ వ్యసనం నుంచి బయటపడటానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి. ఇందుకోసం ఫ్రూట్ సలాడ్ తీసుకోండి. ఇది చాలా ఆరోగ్యకరమైనది. దీనిలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు రోజులో ఎక్కువ సార్లు తక్కువ మొత్తంలో భోజనాన్ని తినండి. వేయించిన విత్తనాలు, మఖానాలను స్నాక్స్ గా తీసుకోవచ్చు. సీజనల్ పండ్లు, కూరగాయలతో పాటు లీన్ ప్రోటీన్, గింజలను తినండి.

మద్యం తాగే వ్యక్తులకు దూరంగా ఉండండి

మందు అలవాటును మానాలనుకుంటే ముందుగా మీరు చేయాల్సిన పని మందుకు తాగే వ్యక్తులకు దూరంగా ఉండటం. ఇలాంటి వారితో ఉంటే మీకు కూడా తాగాలన్న కోరికలు పెరుగుతాయి. 

పుష్కలంగా నిద్ర పోండి

రాత్రి పూట టైం కి నిద్రపోండి. రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోతే శరీరానికి, మనసుకు మంచి అనుభూతి కలుగుతుంది. దీంతో మీ శరీరంలోని టాక్సిన్స్ సులభంగా బయటకు పోతాయి. మందు తాగే అలవాటు కూడా పోతుంది. 

PREV
click me!

Recommended Stories

Weight Loss Tips : నోరు కట్టుకుని, కడుపు మాడ్చుకోవాల్సిన పనిలేదు.. ఆడుతూ పాడుతూ హాయిగా బరువు తగ్గండి
ఉదయమా లేక రాత్రా..? చల్లని బీర్ తాగడానికి మంచి సమయం ఏది?