
చాలా మందికి సీజన్ మారినప్పుడల్లా జలుబు చేస్తుంది. దగ్గు వస్తుంది. వీటిని మందులతో సులువుగా తగ్గించుకోవచ్చు కానీ.. ప్రస్తుతం చాలా మంది ఇంటి నివారణలే ఫాలో అవుతున్నారు. చాలా మటుకు ఎన్నో అనారోగ్య సమస్యలను మనం తినే ఫుడ్ ద్వారే తగ్గించుకోవచ్చు తెలుసా.. అందులో మొలకలు ఒకటి. అవును మొలకలు మన రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి రక్తహీనతను పోగొట్టడం వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
మొలకల్లో ఫైబర్ కంటెంట్, అవసరమైన అమైనో ఆమ్లాలు, విటమిన్ డి, విటమిన్ ఎ, విటమిస్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో ఇనుము, మెగ్నీషియం, ఫోలేట్, కాల్షియం లు కూడా ఉంటాయి. అసలు మొలకను తింటే మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మొలకల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు చాలా అవసరమైన విటమిన్. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది.
మొలకెత్తిన గింజలు మన శరీరానికి మంచి పోషక శోషణను అందిస్తాయి. ఎందుకంటే ధాన్యాలను నానబెట్టినప్పుడు టానిన్, ఫైటిక్ యాసిడ్ కంటెంట్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
మొలకల్లో ఐరన్, జింక్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ ఖనిజాలు శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను నియంత్రించడానికి సహాయపడతాయి. అలాగే ఈ ఎర్ర రక్త కణాలు రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనను ప్రభావితం చేస్తాయి.
మొలకెత్తే ప్రక్రియ మొలకల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ను కూడా పెంచుతుంది. ఇది వ్యాధులు, బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా మీ శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుంది.
మొలకలు ఆరోగ్య ప్రయోజనాలు
మొలకలు రోగనిరోధక శక్తికి చాలా మంచివి. కానీ ఇవి ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. మొలకలు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ల జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. నిపుణుల ప్రకారం.. మొలకెత్తిన విత్తనాలు పిండి పదార్థాలను ముందుగా జీర్ణం చేయడానికి ఎంజైమ్ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది గట్ ఆరోగ్యానికి సహాయపడుతుంది. పేగు వాయువును కూడా తగ్గిస్తుంది.
మొలకెత్తడం వల్ల వాటిలో ఉండే పోకాలు ఏం మారవు. కానీ మన ఆరోగ్యానికి ప్రయోజనకరమైన సమ్మేళనాలను విడుదల చేయడానికి సహాయపడుతుంది. మొక్కల ఆహారాలలో ఇనుము, జింక్, మెగ్నీషియం వంటి ఖనిజాలను బంధించే ఫైటేట్లు ఉంటాయి. ఇది ఆ ఖనిజాలను శరీరం గ్రహించకుండా నిరోధిస్తుంది. ఫైటేట్లను విచ్ఛిన్నం చేయడానికి మనలో ఎంజైమ్లు ఉండవు. కానీ మొలకెత్తే ప్రక్రియ మొక్కలో ఎంజైమ్లను విడుదల చేయడానికి సహాయపడుతుంది. ఇది ఖనిజాలను మన శరీరం గ్రహించడానికి సహాయపడుతుంది.