
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కాలంతో పాటు ఉరుకులు పరుగులు పెడుతూ కనీసం తినడానికి కూడా సరైన సమయం కేటాయించలేకపోతున్నారు. ఇలా సరైన పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను తినడం పూర్తిగా మానేసి ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ అంటూ వారికి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటారు. అయితే ఇలా అధికంగా ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ వారికి ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు ఆర్డర్ చేసుకొని తినడం ప్రస్తుతం ఆనవాయితీగా మారింది.
అయితే ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఆహార పదార్థాలను తినడం పూర్తిగా ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు.ఆహార పదార్థాలను మనం సరైన సమయంలో తినటం వల్ల మన శరీరానికి తీసుకున్న ఆహారంలోని పోషక విలువల సక్రమంగా అందుతూ ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటామని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సరైన సమయాలకు చేయాలి. ఇక చాలామంది మధ్యాహ్నం భోజనాన్ని ఏ మూడు గంటలకు లేదా నాలుగు గంటలకు చేస్తూ ఉంటారు. ఇక సాయంత్రం ఐదు తర్వాత పూర్తిగా ఆహార పదార్థాలను తినడం తగ్గించేసేయాలి.కానీ చాలామంది సాయంత్ర సమయంలోనే ఎక్కువగా ఇలాంటి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఆసక్తి చూపుతుంటారు అయితే ఇది పూర్తిగా ఆరోగ్యానికి ప్రమాదకరం.
సాయంత్రం ఐదు తర్వాత చాలా తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.ఇలా సాయంత్రం తర్వాత అధికంగా ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆ ప్రభావం మన జీర్ణ వ్యవస్థ పై పడుతుంది.ఇలా జీర్ణక్రియ సక్రమంగా జరగకపోవడంతో అజీర్తి వంటి సమస్యలు ఏర్పడటమే కాకుండా మలబద్ధక సమస్యతో కూడా బాధపడాల్సి ఉంటుంది. అందుకే మనం మనకు నచ్చిన ఆహార పదార్థాలను ఏదైనా తినాలి అనుకుంటే సాయంత్రం ఐదు గంటలలోపే ఎక్కువగా ఫుడ్ తీసుకున్న పర్లేదు కానీ ఐదు గంటల తర్వాత చాలా తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.