ఒత్తిడి నుంచి థైరాయిడ్ వరకు.. పీరియడ్స్ లేట్ కావడానికి కారణాలు ఇవే..!

Published : Mar 06, 2023, 12:54 PM IST
 ఒత్తిడి నుంచి థైరాయిడ్ వరకు.. పీరియడ్స్ లేట్ కావడానికి కారణాలు ఇవే..!

సారాంశం

ఒత్తిడి నుంచి హార్మోన్ల అసమతుల్యత వరకు పీరియడ్స్ లేట్ కావడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ మీకు పీరియడ్స్ లేట్ అయితే వెంటనే చికిత్స తీసుకుని సమస్య ఏంటో తెలుసుకోవాలని నిపుణులు సలహానిస్తున్నారు. 

పీరియడ్స్ లేట్ అయ్యేసరికి ఆడవాళ్లు ఆందోళన పడిపోతుంటారు. పీరియడ్స్ లేట్ అయితే ముందుగా గుర్తొచ్చేది ప్రెగ్నెన్సీనే. అయితే నెలసరి లేట్ కావడానికి గర్భం ఒక్కటే కారణం కాదు. దీనికి ఎన్నో ఇతర కారణాలుంటాయి.  ఒత్తిడి, బరువు హెచ్చు తగ్గులు, పాలిసిస్టిక్ ఓవర్ సిండ్రోమ్ వంటివి ఎన్నో కారణాలు ఉన్నాయి. అవేంటంటే.. 

ఒత్తిడి: పీరియడ్స్ లేట్ గా కావడానికి ప్రధాన కారణాల్లో ఒత్తిడి ఒకటి. మీరు ఒత్తిడికి గురైనప్పుడు మీ శరీరం ఎక్కువ స్థాయిలో కార్టిసాల్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మీ పునరుత్పత్తి వ్యవస్థ పనితీరుకు ఆటంకం కలిగించే హార్మోన్.

బరువు హెచ్చుతగ్గులు: వేగంగా బరువు పెరగడం లేదా ఫాస్ట్ గా బరువు తగ్గడం మీ శరీరంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది కూడా పీరియడ్స్ ను ఆలస్యం చేస్తుంది.

థైరాయిడ్ సమస్యలు: హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం వంటి థైరాయిడ్ రుగ్మతలు కూడా మీ రుతుచక్రాన్ని ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పిసిఒఎస్):  పిసిఒఎస్ అనేది హార్మోన్ల రుగ్మత. ఇది క్రమరహిత నెలసరి , అండోత్సర్గము ఆలస్యం కావడానికి దారితీస్తుంది.

జనన నియంత్రణ మాత్రలు: ప్రస్తుత కాలంలో జనన నియంత్రణ మాత్రల వాడకం ఎక్కువ అయ్యింది. అయితే ఇవి మీ రుతుచక్రాన్ని మార్చుతాయి. ఇది మీ పీరియడ్స్ ఆలస్యం కావడానికి దారితీస్తుంది.

అధిక వ్యాయామం: తీవ్రమైన వ్యాయామాలు లేదా కఠినమైన శారీరక శ్రమ మీ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. అలాగే మీ నెలసరిని లేట్ చేస్తుంది. 

పేలవమైన ఆహారం: శరీరానికి అవసరమైన పోషకాలు లేని ఆహారాన్ని తింటే మీ రుతుచక్రం ప్రభావితం అవుతుంది. ఇది పీరియడ్స్ ఆలస్యం కావడానికి దారితీస్తుంది.

పెరిమెనోపాజ్: పెరిమెనోపాజ్ అనేది రుతువిరతికి దారితీసే పరివర్తన దశ. ఈ దశలో మీ పీరియడ్స్ సక్రమంగా కావు. లేదా ఆలస్యం కావొచ్చు.

మందులు: యాంటిసైకోటిక్స్, యాంటి డిప్రెసెంట్స్ వంటి కొన్ని రకాల మందులు మీ రుతుచక్రానికి ఆటంకం కలిగిస్తాయి.

అనారోగ్యం: డయాబెటిస్, పిసిఒఎస్, థైరాయిడ్ రుగ్మతలు వంటి అనారోగ్య సమస్యలు మీ రుతుచక్రాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి పీరియడ్స్ ఆలస్యం కావడానికి కూడా దారితీస్తాయి.

PREV
click me!

Recommended Stories

Health Tips: ఒంటరిగా ఉండటం ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? నిపుణుల మాట ఇదే!
కడుపుబ్బరంతో నరకం చూస్తున్నారా? ఇలా చేస్తే వెంట‌నే రిజ‌ల్ట్