కళ్లు ఎర్రబడ్డాయా..? ఇది కూడా కరోనా వైరస్ సంకేతమే!

By telugu news teamFirst Published Jun 20, 2020, 7:55 AM IST
Highlights

తాజాగా మరో లక్షణం కూడా దీని జాబితాలో చేరింది. కళ్లు ఎర్రబారడం కూడా కరోనా వైరస్ సోకిందనడానికి సంకేతమేనని కెనడాలోని అల్బెర్టా విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ కార్లోన్ సోలర్టె తెలిపారు.
 

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచంలో ఇప్పటికే కొన్ని లక్షల మంది అవస్థలు పడుతున్నారు. మూడు లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఇప్పటి వరకు ఈ వైరస్ లక్షణాలు గా జలుబు, జ్వరం, గొంతు నొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు లాంటివిగా వైద్యులు సూచించారు.

ఈ లక్షణాలు కనపడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. అయితే.. తాజాగా మరో లక్షణం కూడా దీని జాబితాలో చేరింది. కళ్లు ఎర్రబారడం కూడా కరోనా వైరస్ సోకిందనడానికి సంకేతమేనని కెనడాలోని అల్బెర్టా విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ కార్లోన్ సోలర్టె తెలిపారు.

ఇటీవల కంటి సమస్యతో ఓ మహిళ తమ వద్దకు వచ్చిందని.. తొలుత అది కంటిలో ఏదో సమస్య అని భావించామని చెప్పారు. అయితే.. తర్వాత తమ పరిశోధనలో ఆమెకు కరోనా సోకినట్లు తేలిందని చెప్పారు. కరోనా రోగుల్లో 10-15శాతం మందికి సెంకడరీ లక్షణంగా కండ్ల కలక, కళ్లు ఎర్రబడటం లాంటివి జరుగుతున్నాయన్నారు. ఈ సమస్యలతో వచ్చేవారికి కంటి డాక్టర్లు కోవిడ్ పరీక్షకు సిఫారసు చేయడం మంచిదని సూచిస్తున్నారు.

click me!