మలేరియా లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

By telugu news teamFirst Published Jun 18, 2020, 2:28 PM IST
Highlights

 ఆ వారం పది రోజుల సమయంలో ప్లాస్మోడియం సూక్ష్మ జీవులు తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి. తర్వాత ఎర్ర రక్త కణాలను నాశనం చేస్తాయి

దోమల వల్ల వ్యాపించే జబ్బుల్లో మలేరియా కూడా ఒకటి. మన దేశంలో మలేరియా కేసుల సంఖ్య కాస్త తక్కువగా ఉన్నప్పటికీ... ఎజెన్సీ ప్రాంతాల్లో దీనిబారిన పడేవారు ఎక్కువగానే ఉన్నారు. ప్రపంచంలోని సగం జనాభా ఇప్పటికీ మలేరియా ముప్పును ఎదురుకుంటోంది. ఏటా 4లక్షల మందికిపైగా ఈ ఈ జబ్బు బారిన పడుతున్నట్లో ఓ సర్వేలో వెల్లడయ్యింది. 

కేవలం దోమ కాటు కారణంగానే మలేరియా వ్యాపిస్తుంది. ఆడ అనాఫిలిస్ దోమ కుట్టినప్పుడు దాని శరరీంలోని ప్లాస్మోడియం సూక్ష్మజీవులు మన దేహంలోకి ప్రవేశిస్తాయి. మనిషి శరీరంలోకి చేరాక రక్తం నుంచి కాలేయానికి చేరతాయి. అక్కడ వాటి సంఖ్య వృద్ధి చెందుతుంది. సాధారణంగా ప్లాస్మోడియం శరీరంలోకి చేరిన వారం, పది రోజుల వరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఆ వారం పది రోజుల సమయంలో ప్లాస్మోడియం సూక్ష్మ జీవులు తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి. తర్వాత ఎర్ర రక్త కణాలను నాశనం చేస్తాయి.

మలేరియా లక్షణాలు...
 చలి జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, ఛాతిలో నొప్పిగా ఉండటం, దగ్గు, చెమటలు పట్టడబం, వాంతులు, విరేచనాలు, నీరసంగా ఉండటం, ఆయాసం లాంటివి రావడం మొదలైనవి మలేరియా లక్షణాలుగా గుర్తించాలి. దోమ కాటుకు గురైన వారం నుంచి 18 రోజలు వ్యవధిలో మలేరియా లక్షణాలు బయటపడతాయి.  లక్షణాలు ముందుగానే గుర్తుపడితే రక్త పరీక్ష చేయించుకోవాలి. దాని ద్వారా మలేరియా ఉంది లేనీదీ తేలిపోతుంది. 

చికిత్స..
 లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. వారు సూచించిన  చికిత్స తీసుకుంటే... త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.

ముందు జాగ్రత్త చర్యలు...

మలేరియా వచ్చిన తర్వాత చికిత్స కన్నా కూడా... రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. దోమతెరలను ఉపయోగించాలి. ఆ దోమ తెరలను కూడా శుభ్రంగా ఉతికినవే వాడాలి. కిటీకీలు, తలుపులకు నెట్‌లు బిగించొచ్చు. మస్కిటో రిపెల్లెంట్స్ క్రీములు, స్ప్రేలు వాడటం ఉపకరిస్తుంది. ఘాటైన వాసనలను వెదజల్లే మొక్కలు, పుష్పాలను దోమలు ఇష్టపడవు. కాబట్టి బంతి రోస్‌మేరీ, పుదీనా మొక్కలను ఇంటి పరిసరాల్లో పెంచడం వల్ల దోమలు రాకుండా ఉంటాయి. 

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఎక్కువగా ద్రవాహారం తీసుకోవడం ముఖ్యం. తద్వారా రోగనిరోధక వ్యవస్థ బలోపేతమై, రోగాల బారిన పడకుండా ఉంటాం. వీధుల్లో అమ్మే అపరిశుభ్ర ఆహారం తీసుకోవడం మానేయాలి. 

click me!