ఇవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి, గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి తెలుసా?

Published : May 02, 2023, 01:02 PM IST
ఇవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి, గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి తెలుసా?

సారాంశం

మన శరీరంలో గుండె చాలా ముఖ్యమైన అవయవం. ఇది పనిచేయడం మానేస్తే మనం చనిపోయినట్టే. ఇది కొట్టుకున్నంత కాలమే మనం బతికుండేది. అందుకే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.   

ప్రస్తుత కాలంలో ఎన్నో ప్రమాదకరమైన రోగాలు సైతం కామన్ వ్యాధులుగా మారిపోయాయి. ముఖ్యంగా గుండెపోటు. ప్రస్తుతం చిన్న చిన్న పిల్లలు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. ఉన్నపాటుగా గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు వదులుతున్న వార్తలను నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం గుండెపోటు, కరోనరీ ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వెసెల్ డిసీజ్ వంటి ఎన్నో సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు.  అయితే గుండె ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కొన్ని ఆహారాలను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందుకోసం వేటిని తినాలంటే..?

ఆకు కూరలు

ఆకు కూరల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి ఎన్నో రోగాలను తగ్గిస్తాయి. అందుకే వీటిని  ఆరోగ్యకరమైన ఆహారంగా భావిస్తారు. పాలకూర, బచ్చలికూర, కాలే వంటి ఆకుకూరలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటే మీ శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి.

పండ్లు

సాధారణంగా పండ్లు మన గుండెకు ఎంతో మేలు చేస్తాయి. అందుకే గుండె ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లను ఎక్కువగా తినాలని చెబుతుంటారు. స్ట్రాబెర్రీలను, బ్లూబెర్రీలను, కోరిందకాయలు, బ్లాక్ బెర్రీలను రోజూ తింటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ఎందుకంటే వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఆంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణన ఒత్తిడి, మంటను తగ్గించడానికి సహాయపడతాయి. ఈ బెర్రీలతో పాటుగా అవొకాడో కూడా గుండెకు ఎంతో మేలు చేస్తుంది. అవొకాడోల్లో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఈ కొవ్వు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీంతో గుండెపోటు ముప్పు తప్పుతుంది. 

బీన్స్

బీన్స్ కూడా గుండెకు ఎంతో మేలు చేస్తుంది. బీన్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. బీన్స్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. 

బాదం

రోజూ గుప్పెడు బాదం పప్పులను తింటే మీ మొత్తం ఆరోగ్యం బాగుంటుంది. బాదలో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బాదంలో మోనోశాచురేటెడ్ కొవ్వులు, పైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులను నయం చేయడానికి సహాయపడతాయి. బాదం పప్పులను తింటే కూడా శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 

చియా విత్తనాలు, అవిసె గింజలు వంటి నట్స్ లో కూడా ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇవి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలకు మంచి వనరు. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే వీటిని మీ డైట్ లో చేర్చుకోవాలని డాక్టర్లు చెబుతుంటారు. 

PREV
click me!

Recommended Stories

Health: చాయ్‌తో వీటిని క‌లిపి తింటున్నారా.? తీవ్ర స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు
Mineral Water: మినరల్ వాటర్‌ను వేడిచేసి తాగడం మంచిదా? కాదా? తాగితే ఏమవుతుంది?