ఎండాకాలంలో కుండలో నీళ్లు తాగితే..!

Published : Apr 24, 2023, 12:58 PM IST
 ఎండాకాలంలో కుండలో నీళ్లు తాగితే..!

సారాంశం

ఒకప్పుడు మన దేశంలో దాదాపు ప్రతి ఇంట్లో మట్టికుండలు ఉండేవి. ఇప్పుడు చూద్దామన్నా కనిపించడం లేదు. ఎందుకంటే కుండల ప్లేస్ లో ఫ్రిజ్ లు వచ్చాయి. కానీ కుండ చేసే మేలు ఫ్రిజ్ కొంచెం కూడా చేయదు తెలుసా? 

మనం ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం ఎంత ముఖ్యమో నీరు అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఫుడ్ లేకుండా నైనా వారాల పాటు బతకొచ్చు కానీ నీళ్లు తాగకుండా రెండు రోజులు బతకడం కూడా కష్టమే. మన  శరీరంలో నీరే ఎక్కువ భాగం ఉంటుంది. కాలాలతో సంబంధం లేకుండా రోజుకు 10 గ్లాసుల నీటిని తాగాలని చెప్తుంటారు. ముఖ్యంగా ఎండాకాలంలో. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు, శరీరం నిర్జలీకరణం బారిన పడ్డప్పుడు నీటిని పుష్కలంగా తాగాలి. అయితే చాలా మంది ఎండాకాలంలో ఫ్రిజ్ నిండా వాటర్ బాటిల్స్ నింపుతారు. వాటినే తాగుతారు. కానీ ఫ్రిజ్ వాటర్ అంత మంచివి కావు. కుండనీళ్లే మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అసలు ఎండకాలంలో కుండలో నీటిని తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

నేచురల్ కూలింగ్

మట్టి కుండలో నీళ్లను పోస్తే అవి సహజంగా చల్లబడుతాయి. మట్టి కుండకు పైన ఉన్న చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వీటి ద్వారా వాటర్ వేగంగా ఆవిరైపోతుంది. బాష్పీభవన ప్రక్రియలో కుండలోని నీరు వేడిని కోల్పోతుంది. అలాగే నీరు త్వరగా చల్లబడతాయి.

దగ్గు, జలుబును నివారిస్తుంది

రిఫ్రిజిరేటర్ కూడా నీటిని వేగంగా కూల్ చేస్తుంది. కానీ ఈ వాటర్ ను తాగడం వల్ల దురద, గొంతు చికాకు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అయితే మట్టి కుండలో నీళ్లను మరీ అంత చల్లగా చేయదు. ఇది గొంతుకు ఓదార్పునిస్తుంది. దగ్గు వచ్చేలా చేయదు. 

ఆల్కలీన్

మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ భాగం శరీరంలో ఆమ్లంగా మారి కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తుంది. అయితే బంకమట్టిలోని ఆల్కలీన్ కూర్పు తగిన పీహెచ్ సమతుల్యతను నిర్వహించడానికి సహాయపడుతుంది. దీంతో ఎసిడిటీ, కడుపునకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. 

జీర్ణక్రియకు సహాయపడుతుంది

ప్రతిరోజూ మట్టి కుండ నీటిని తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో ఎలాంటి రసాయనాలు ఉండవు. నీటిలోని ఖనిజాలు జీర్ణక్రియకు కూడా సహాయపడతాయి. 

వడదెబ్బను నివారిస్తుంది

ఎండాకాలంలో వడదెబ్బ ఒక సాధారణ సమస్య. మట్టి కుండలోని నీటిని తాగడం వల్ల వడదెబ్బ కొట్టే అవకాశం తగ్గుతుంది. ఎందుకంటే మట్టి కుండ నీటిలోని విలువైన ఖనిజాలు,  పోషకాలను సంరక్షిస్తుంది. అలాగే వేగవంతమైన ఆర్ద్రీకరణను ప్రోత్సహిస్తుంది.

తాగడానికి సురక్షితం

మట్టి కుండలను నీటిని సేంద్రీయంగా శుభ్రపరచడానికి, చల్లబరచడానికి ఉపయోగించొచ్చు. నీటి పోరస్ మైక్రోటెక్చర్ కారణంగా ఈ నీళ్లు తాగడానికి సురక్షితం.ఇది కాలుష్య కారకాలను బయటకు పంపుతుంది. 

PREV
click me!

Recommended Stories

Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం