చలికాలంలో దగ్గు, జలుబు సమస్యలు రావడం చాలా సహజం. అయితే కొన్ని ఆయుర్వేద కాషాయాలు ఈ సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటంటే..
పురాతన వైద్య విధానమైన ఆయుర్వేదం ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. అందుకే నేటికీ ఎంతో మంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి ఆయుర్వేద చిట్కాలనే పాటిస్తుంటారు. కాగా కొన్ని ఆయుర్వేద కషాయాలు దగ్గు, జలుబు లక్షణాలను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. ఈ కషాయాలు మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడం నుంచి గొంతునొప్పిని తగ్గించడం వరక ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇంతకీ ఆ కాషాయాలేంటి? వాటిని ఎలా తయారుచేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
తులసి కాషాయం
undefined
తలసిలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. దీన్ని ఉపయోగించి మనం ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు. తులసి కాషాయంతో దగ్గు, జలుబు లక్షణాలను తగ్గించకోవచ్చు. ఈ కాషాయాన్ని తయారుచేయడానికి గుప్పెడు తాజా తులసి ఆకులను తీసుకుని నీటిలో మరిగించండి. దీనిలో చిటికెడు నల్ల మిరియాలు, అల్లాన్ని కూడా వేయండి. ఇది బాగా మరిగిన తర్వాత వడకట్టి తాగండి. ఇది శ్వాసకోశ సమస్యను తగ్గిస్తుంది. శ్వాస సులువుగా తీసుకోగలుగుతారు. మంటను కూడా తగ్గిస్తుంది.
అల్లం, పసుపు కషాయం
అల్లం, పసుపులో శోథ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో తయారుచేసిన కాషాయం జలుబు లక్షణాలను ఇట్టే తగ్గిస్తుంది. దీన్ని తయారుచేయడానికి తరిగిన అల్లం, ఒక టీస్పూన్ పసుపును నీటిలో వేసి మరిగించండి. ఇది మరిగిన తర్వాత కిందికి దించుకుని రుచి కోసం కొంచెం తేనె, నిమ్మరసాన్ని పిండి తాగండి. ఈ కాషాయాన్ని తాగితే గొంతు చికాకును తగ్గుతుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.
దాల్చినచెక్క, లవంగం కాషాయం
దాల్చినచెక్క, లవంగాల్లో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కాషాయాన్ని తయారుచేయడానికి కొన్ని దాల్చిన చెక్క కర్రలను, లవంగాలను తీసుకుని నీటిలో వేసి మరిగించండి. కిందికి దించిన తర్వాత కొద్దిగా తేనె కలుపుకుని తాగండి. ఈ కషాయం కఫాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే చలికాలంలో మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది.
అజ్వైన్, నల్ల మిరియాలు
అజ్వైన్, నల్ల మిరియాలు శ్వాసకోశ ఆరోగ్యానికి మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ కాషాయాన్ని తయారుచేయడానికి అజ్వైన్ గింజలు, నల్ల మిరియాలను గ్రైండ్ చేసి నీటిలో వేసి మరిగించండి. దీన్ని వడకట్టి తాగితే నాసికా రద్దీ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది మీరు శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది. అలాగే ఇది శ్లేష్మాన్ని బయటకు పంపడానికి కూడా సహాయపడుతుంది.