కర్నూల్ కు హైకోర్టు... ఈ నిర్ణయం అప్పటిదే: వైసిపి ఎమ్మెల్యే

By Arun Kumar PFirst Published Dec 18, 2019, 9:44 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ కు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న జగన్ నిర్ఱయాన్ని వైసిపి ఎమ్మెల్యేలు స్వాగతిస్తున్నారు. వెనుకబడిని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు న్యాయం చేయడానికే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. 

తాడేపల్లి:  చంద్రబాబు హయాంలో భూఅక్రమాలపై సమగ్రవిచారణ జరగాలని వైసిపి ఎమ్మెల్యే  సీదిరి అప్పల్రాజు డిమాండ్ చేశారు. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. అయితే దీనిపై ప్రశ్నిస్తే విచిత్రంగా టిడిపి నాయకులు మీకు దమ్ముంటే మా తప్పులను నిరూపించండి అంటూ మాట్లాడుతున్నారని అన్నారు. తప్పును సమర్దించడం ద్వారా వారు మరో తప్పు చేస్తున్నారని అప్పల్రాజు అన్నారు. 

గత ఐదేళ్లలో చంద్రబాబు రాజధానిని ఏమాత్రం అభివృధ్ది చేయలేదన్నారు.కేవలం వ్యాపారం చేశాడని ఆరోపించారు. ఎక్కడ వారి వ్యాపారం దెబ్బతింటుందేమోని వారు భయపడిపోతున్నారని... అందువల్లే  జగన్ ప్రకటన తర్వాత అందరూ గొంతు చించుకుని గగ్గోలు పెడుతున్నారని అన్నారు. 

చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాను తానే అభివృద్ది చేశానని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారని... ఆయన ముఖ్యమంత్రిగా పదవిలో వున్నంతకాలం విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్  చేశారు.

అయితే తాము దివంగత నేత వైఎస్  రాజశేఖర్ రెడ్డి  హయాంలో తమ ప్రాంతాల అభివృద్ది జరిగిందని గట్టిగా చెప్పగలమన్నారు. ఏం అభివృధ్ది కార్యక్రమాలు జరిగాయో చెప్పగలమన్నారు. రాష్ర్టంలోని అన్ని ప్రాంతాలను అభివృధ్ది చేయాలనేదే ముఖ్యమంత్రి జగన్  లక్ష్యమన్నారు. 

video: ఎన్నార్సీపై వైసిపి ప్రభుత్వ విధానమిదే: అంజాద్ బాషా

 బిసి,  ఎస్సి, ఎస్టి, మైనారిటిలకు పదవులు ఇవ్వడం, గౌరవించడం అనేది జగన్ చేసి చూపారన్నారు.  రాజధాని నిర్మాణంలో సైతం వారి మాటలను పరిగణనలోనికి తీసుకున్నట్లు అర్దమవుతుందన్నారు. చంద్రబాబు రూపొందించిన ఎకనమిక్ సర్వేలో సైతం విజయనగరం శ్రీకాకుళం  జిల్లాలు చివరి ర్యాంకులలో ఉన్నాయని గుర్తు చేశారు. 

జగన్ మూడు రాజధానులను ప్రతిపాదించారన్నారు. ఎక్స్‌పర్ట్ కమిటి త్వరలో రిపోర్ట్ వస్తుందని... కమిటి రిపోర్ట్ వచ్చాక అందరికి నచ్చేలా నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెట్టాలన్న జగన్ నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజలకు వరప్రదాయనిగా ఉంటుందన్నారు.

 కర్నూలు ఎంఎల్ఏ  హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ... రాజధాని అభివృద్దిలో వికేంద్రీకరణ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. సమైక్యాంధ్ర కావాలని కోరుకుంటున్నపుడే కర్నూలు నగరంలో 365 రోజులు ధర్నాలు, నిరసనలు, దీక్షలలో లక్షలాది మంది విద్యార్దులు పాల్గొన్నారన్నారు.

 హైద్రాబాద్ మన నుంచి విడిపోతుందనే బాధలో అలా పాల్గొన్నారని... ఏపి, తెలంగాణా కలసి ఉండాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు త్యాగం చేసి ఒప్పుకున్నారని గుర్తుచేశారు.  శ్రీబాగ్ ఒప్పదం ప్రకారం హై కోర్ట్ ను కర్నూలు లో ఏర్పాటు చేయాలన్నారు. చంద్రబాబును ఎన్ని సార్లు కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరిన పట్టించుకోలేదని.. కానీ రాయలసీమ ప్రజా ఆకాంక్షను జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని కొనియాడారు. ప్రజలు కోరుకున్నదే జగన్ చేశారన్నారు.

నాలుగు వేల ఎకరాల భూమిని టీడీపీ ఇన్ సైడర్ ట్రేడింగ్ తో కొన్నారని  ఆరోపించారు. సీఎం జగన్ మూడు రాజధానులు చేయడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రజా ఆకాంక్షకు వ్యతిరేకంగా వ్యవహరించారని... అభివృద్ధి అనేది వికేంద్రీకరణ ద్వారా జరుగుతుందని పేర్కొన్నారు. 

read more జానీ వాకర్ రెడ్డి కూడా జగన్ ను విమర్శించేవాడే: వైసిపి ఎమ్మెల్యే సెటైర్లు

రాయలసీమ వాళ్ళను రౌడీలతో చంద్రబాబు పోల్చుతున్నారని...పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. కర్నూలు ను స్మార్ట్ సిటీ చేస్తామని చెప్పి మోసం చేశాడని...జిల్లా కు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చేలేదని హఫీజ్ మండిపడ్డారు. 


 

click me!