పవన్ కల్యాణ్ డిల్లీ పర్యటన... చంద్రబాబు కోసమేనా...?: ఎమ్మెల్యే గోపిరెడ్డి

By Arun Kumar PFirst Published Jan 13, 2020, 3:49 PM IST
Highlights

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ న్యూడిల్లీ పర్యటనపై వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.  

తాడేపల్లి: గత అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతిని వెంటిలేటర్ మీద ఉన్న తెలుగుదేశం పార్టీని బ్రతికించుకోవడం కోసమే  ఆ పార్టీ అధినేత చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నరని వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. కేవలం టిడిపి పార్టీ కోసమే చంద్రబాబు జోలె పడుతున్నారే తప్ప రాజధాని ప్రజలకోసం కాదని గోపిరెడ్డి ఆరోపించారు.

గత ఐదేళ్లపాటు టిడిపి ప్రభుత్వమే అధికారంలో వుందని... అప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎందుకు జోలె పట్టలేదని ప్నశ్నించారు. అప్పుడు కూడా నిధుల కొరత వుంది కదా ఎందుకలా విరాళాలు సేకరించలేరని ప్రశ్నించారు. లక్ష కోట్ల రాజధానికి చంద్రబాబు కేవలం ఐదు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అన్నారు. 

ఏపి డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఉత్తరాది ప్రాంతానికి చెందినవాడంటూ చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నాడని...మరి ఆయన హయాంలో ఉత్తరాదికి చెందిన అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేదా అని ప్రశ్నించారు. కావాలనే చంద్రబాబు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. 

రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు చంద్రబాబు, టిడిపి నాయకుల ఉచ్చులో పడొద్దని సూచించారు. రాజధాని రైతులు తమ సమస్యలను నేరుగా హైపవర్ కమిటీ ముందు వినిపించాలని  సూచించారు.

రాజధానిపై క్లారిటీవచ్చేది ఎప్పుడంటే: మంత్రి మోపిదేవి

రాజధానికి దూరం అనేది సమస్య కానేకాదని సమగ్ర అభివృద్ధే ముఖ్యమన్నారు. రోడ్డు, సముద్రం, ఎయిర్ ఇలా అన్నిరకాల కనెక్టివిటీ విశాఖపట్నంకు ఉన్నాయన్నారు. సౌత్ లో ఉన్న నాలుగు రాష్ట్రాలు రాజధానులు ప్రజలకు దూరంగానే ఉన్నాయని గోపిరెడ్డి తెలిపారు.

రాజధాని ప్రాంత రైతులను రెచ్చగొట్టడానికే చంద్రబాబు చందాలు వసూలు చేస్తున్నాడని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఆయన ప్రస్తుతం చేపడుతున్న యాత్రలకు ప్రజల నుంచి స్పందన లేదన్నారు. రాజధాని జిల్లాలలో కూడా ఆయన పర్యటనకు ప్రజల నుండి మద్దతు కరువైందన్నారు. 

రాజధానిపైనా తాము ఏదయినా మాట్లాడితే వాటిని టీడీపీ నేతలు వక్రీకరిస్తున్నారని అన్నారు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతమని చంద్రబాబు మాట్లాడుతున్నాడని...  అంత గౌరవమే వుంటే ఆ ప్రాంతంలో కనీసం ఒక పర్మినెంట్ బిల్డింగ్ అయినా కట్టాడా అని నిలదీశారు. 

కేబినెట్ భేటీ, అసెంబ్లీ సమావేశాలు వాయిదా... హైపవర్ కమిటీ ఆలోచన ఇదే

జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఎందుకు వెళ్లాడో తెలియదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వేరువేరు కాదు ఇద్దరూ ఒక్కటేనని..వారి మాట కూడా ఒక్కటేనని అన్నారు. బిజెపి నాయకులు కూడా రాజధానిపై తలో మాట మాట్లాడుతున్నారని.... అసలు వరి మాటలు నమ్మాలో అర్థంకావడం లేదన్నారు.

రాజధాని అమరావతిగా పెట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు అసలు అఖిలపక్ష సమావేశం పెట్టాడా అని ప్రశ్నించారు.అమరావతి పెట్టేటప్పుడు కనీసం ఒక్క రాజకీయ పార్టీ అభిప్రాయమయినా తీసుకున్నాడా.... అలాంటిది ఇప్పుడు రాజధానిపై అన్నిపార్టీలు కలిసి రావాలని చంద్రబాబు ఎలా కోరతాడని ఎమ్మెల్యే గోపిరెడ్డి నిలదీశారు. 
 

click me!