బుధవారం శాసనమండలిలో జరిగిన పరిణామాలపై మాట్లాడుతూ వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు.
అమరావతి: పెద్దల సభ అన్నది మంచి సలహాలు సూచనలు ఇవ్వాలని భావించి ఏర్పాటుచేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. కానీ ఏపిలో మాత్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టడం, రూల్స్ కు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. ఇది హేయమైన చర్య అని చెవిరెడ్డి తెలిపారు.
చట్టాలు అమలుకు మండలి సభ్యులు అడ్డుతగలటం సబబు కాదన్నారు. ముఖ్యమంత్రి కంటే అతీత అధికారులు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఇక్కడ అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో మండలి గ్యాలరీలో కుర్చోని చైర్మన్ ను తప్పుదోవ పట్టించటం సమంజసమా అని నిలదీశారు.
undefined
read more వారి దశాబ్దాల ఎదురుచూపులు ఈ ఒక్క నిర్ణయంతో పూర్తి: వైఎస్ జగన్
ప్రభుత్వ నిర్ణయాలు వ్యతిరేకిస్తూ శాసనమండలి చట్టవ్యతిరేక నిర్ణయం తీసుకోవడం దేనికి సంకేతో చెప్పాలన్నారు. తప్పు చేయని వారితో సైతం తప్పు చేయించటం కోసం చంద్రబాబు అనుభవం వినియోగిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. తాత్కాలిక ఆనందం కోసం ఇలా చేయడం సమంజసం కాదన్నారు.
చంద్రబాబు మెరుగైన సూచనలు, సలహాలు ఇవ్వాలని... అంతే కాని ఇలా ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుతగలడం మంచిది కాదన్నారు. సభను తప్పుదోవ పట్టిస్తూ ఇలాంటి రాజకీయాలు చేసిన వ్యక్తి మీరు కాదా అంటూ చంద్రబాబును ఉద్దేశించి చేవిరెడ్డి విమర్శించారు.
read more ఎమ్మెల్సీగా మంత్రి పదవి... మండలి రద్దు చర్చపై మోపిదేవి ఏమన్నారంటే