ఏపికి శాసనమండలి అవసరమా...?: అంబటి రాంబాబు వ్యాఖ్యలు

By Arun Kumar P  |  First Published Jan 23, 2020, 4:40 PM IST

ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిలో బుధవారం చోటుచేసుకున్న పరిణామాలపై వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బిల్లులను వ్యతిరేకిస్తూ మండలి తీసుకున్న నిర్ణయాన్ని అంబటి తప్పుబట్టారు.  


అమరావతి: బుధవారం ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిలో జరిగిన పరిణామాలు ప్రజాస్వామానికి చాలా ప్రమాదకరమని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడనికి రెండు సభలు దోహద పడాలన్నారు. లేదంటే ప్రభుత్వం ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే సవరణలు చేయాలి కానీ రాజ్యాంగ స్ఫూర్తిని వదిలి ప్రభుత్వ బిల్లులను అడ్డుకోవడం మంచిది కాదన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని టీడీపీ అడ్డుకోవాలని చూస్తోందని... ఇందులో భాగంగానే నిన్న మండలిలో రాజధానికి సంబంధించిన బిల్లును అడ్డుకున్నారని అన్నారు. 

చాలా రాష్ట్రాల్లో అసలు శాసనమండలి లేదని అంబటి గుర్తుచేశారు. మండలిలో మెజార్టీ ఉంటే బిల్లు తిరిగి పంపేయవచ్చు. అలా కాకుండా టిడిపి సభ్యులు బిల్లును అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి నిరోధక శక్తిగా టీడీపీ మారిందన్నారు.  రాష్ట్ర అభివృద్దిని అడ్డుకునే శాసన మండలి అవసరమా అనే చర్చ ఇప్పటికే ప్రజల్లో మొదలయ్యిందన్నారు. 

Latest Videos

నిన్న శాసన మండలిలో జరిగిన పరిణామాలపై ప్రజలు ఆలోచించాలన్నారు. సభలో దుష్ట సాంప్రదాయానికి టీడీపీ తెరలేపిందన్నారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పానని చెప్పే చంద్రబాబు గ్యాలరీలో చైర్మన్ కు ఎదురుగా ఎందుకు కూర్చున్నారని ప్రశ్నించారు. ఆయన తీరును ప్రజాస్వామ్యవాదులు ఖండించాలన్నారు.

మరోసారి అమరావతి జేఏసీ నేతలను చంద్రబాబు మోసం చేస్తున్నారని అన్నారు. శాసన మండలి అంటే పెద్దల సభ అని దాన్ని పిల్లల సభలా ఎందుకు మార్చుతున్నారంటూ టిడిపి ఎమ్మెల్సీలను విమర్శించారు. చంద్రబాబు ప్రభావంతోనే చైర్మన్ వికేంద్రికరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారన్నారు.

read more  విజయసాయి రెడ్డికి కౌన్సిల్ ఏం పని...? బెయిల్ పై బయటుండగా...: టిడిపి ఎమ్మెల్సీలు

ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బిల్లులను తాత్కాలికంగా మాత్రమే అడ్డుకోగలరు కానీ శాశ్వతంగా అడ్డుకోలేరన్నారు. శాసన మండలి ప్రజా స్వామ్యానికి ఆరో వేలు లాంటిదని... లేకున్నా ఏమీ కాదన్నారు. బిల్లును అడ్డుకోవడం ద్వారా వైజాగ్ రాజధాని వెళ్లకుండా ఆపగలరా...? బిల్లును సెలెక్ట్ కమిటీ పంపడం ద్వారా ఎంతకాలం బిల్లును అడ్డుకోగలరు..?అంటూ అంబటి  ప్రశ్నించారు. 

మండలి చైర్మన్ షరీఫ్ స్వయంగా తాను తప్పు చేసినట్లు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. ఒకవేళ మండలిలో కూడా మెజారిటీ సాధించాలంటే వైసిపికి చాలా సులువైన పని అని... ఊ అంటే టీడీపీ ఎమ్మెల్సీలు వైస్సార్సీపీలోకి క్యూ కడతారని అన్నారు. కానీ అది తమ విదానం కాదన్నారు.

read more 

కేంద్రం రాజధాని విషయంలో జోక్యం చేసుకోదంటూ పవన్ కళ్యాణ్, చంద్రబాబులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మానుకోవాలన్నారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ చెసిన వారిపై విచారణ జరుగుతుందని...ఆధారాలు కూడా తమ దగ్గర ఉన్నాయన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని...టీడీపీ వాళ్ళు చేసిన తప్పులు అన్ని బైట పడతాయని అంబటి అన్నారు. 

click me!