ఇసుక కొరతపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ ప్లాన్... సీఎం జగన్ ఆదేశాలతో కదలిక

By Arun Kumar P  |  First Published Oct 24, 2019, 11:14 AM IST

రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతపై ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌ ఉన్నతాధికారులతో సచివాలయంలో కీలక భేటీ నిర్వహించారు. రాష్ట్రంలో ఇసుక లభ్యత, డిమాండ్‌పై అధికారుల నుంచి సీఎం వివరాలు తెలుసుకుని...కొరతను తగ్గించేందుకు సీరియస్ యాక్షన్ ప్లాన్ రెడీ చేయించారు.  


అమరావతి: ఇసుక లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులతో  జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం కీలక నిర్ణయాలు  తీసుకున్నారు.  

రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతపై ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌ ఉన్నతాధికారులతో సచివాలయంలో కీలక భేటీ నిర్వహించారు. రాష్ట్రంలో ఇసుక లభ్యత, డిమాండ్‌పై అధికారుల నుంచి సీఎం వివరాలు తెలుసుకున్నారు. 

Latest Videos

నదుల్లో ప్రవాహాలు తగ్గకపోవడం వల్లే ఇసుకకు కొరత ఏర్పడిందని అధికారులు సీఎం కు తెలియజేశారు. 55 రోజలు నుంచి గోదావరి, 71 రోజుల నుంచి కృష్ణానది పొంగి ప్రవహిస్తున్నాయని తెలియజేశారు. 

మరోవైపు తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 400–500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని దీంతో వంశధార, పెన్నా నదుల్లో కూడా వరద ఉదృతి  పెరిగిందన్నారు. ఇప్పటికీ భారీవర్షాలు కురుస్తూనే ఉన్నాయని తెలిపారు. ఫలితంగా ఇసుక లభ్యత ఉండే ప్రాంతాలనుంచి తవ్వకాలు చేయలేకపోతుని  అధికారులు వివరించారు.

Read more #Huzurnagar result: చెల్లని ఉత్తమ్ స్లోగన్, సైదిరెడ్డి బంధువుల "స్థానిక" బలం...

ఇసుక రీచ్‌ల వద్దకు వాహనాలుకూడా వెళ్లలేని పరిస్థితి ఉందని అధికారులు నివేదించారు. 200కుపైగా రీచ్‌లను గుర్తిస్తే ప్రస్తుతం 69 చోట్లనుంచే ఎంతోకొంత వెలికి తీయగలుగుతున్నామన్నారు. 

అయితే ప్రధాన నదుల్లో ప్రవాహాలు తగ్గకుంటే.. ఎక్కడ సాధ్యమవుతుందో, ఆయా ప్రాంతాలను గుర్తించాలని ముఖ్యమంత్రి అధికారులు సూచించారు. గ్రామ సెక్రటేరియట్‌ల ద్వారా ఈ తవ్వకాలు జరిగితే అవినీతికి ఆస్కారం లేకుండా ఉంటుందన్నారు.. ఈ విషయంలో గ్రామసచివాలయాలను సమర్థవంతంగా వాడుకోవాలని ఆదేశించారు.

 మూడు నెలలకాలానికి ఎలాంటి విధానాలు అనుసరించాలన్న దానిపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. అవినీతి లేకుండా, పర్యావరణానికి నష్టం రాకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.  


ముఖ్యమంత్రి ఆదేశాలపై 3 నెలల కాలానికి అధికారులు తాజాగా మార్గదర్శకాలు జారీ చేశారు.ఇసుక తవ్వకాలు, రవాణాపై  వెలువడిన తాజా మార్గదర్శకాలిలా ఉన్నాయి. ఇసుక లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం పలు సూచనలు ఇచ్చింది. ప్రధాన నదుల్లో ప్రవాహాలు తగ్గకపోవడంతో అందుబాటులో వాగులూ, వంకలూ, ఇతరత్రా చిన్న నదుల్లో ఇసుక లభ్యతను గుర్తించనున్నారు. గ్రామాల వారీగా గుర్తించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. గ్రామ సచివాలయంలో చెల్లింపు చేసి ఆ ఇసుకను పొందే అవకాశం కల్పించారు.

గుర్తించిన రీచ్‌ల్లో పర్యవేక్షణ భాద్యతలను గ్రామ సచివాలయం గ్రామ వాలంటీర్లకు అప్పగించనుంది. రవాణాచేస్తున్న వాహనాలు, తరలిస్తున్న పరిమాణాన్ని వాలంటీర్లు  రికార్డు చేయనున్నారు. ఏపీ వాల్టా చట్టానికి అనుగుణంగా తవ్వకాలు జరిగేలా సమన్వయపరచనున్న ఏపీఎండీసీని ఆదేశించారు.

రవాణాచేస్తున్న వాహనానికి గ్రామ సెక్రటేరియట్‌ ఇన్‌ఛార్జి ఎస్‌–3 ఫాంను జారీచేయనున్నారు. వారికి కేవలం డూప్లికేట్‌ రశీదు మాత్రమే ఇవ్వనున్నారు. ఈ ఫాంను వాడినా, వాడకున్నా కాలపరిమితి 48 గంటలే వుండనుంది. ఒకవేళ వాడకపోయినా డబ్బు తిరిగి చెల్లించరు.అంతేకాదు.. తిరిగి వాడుకునేందుకూ వీలుకాదు. 

ఇసుకను రవాణాచేస్తున్న ట్రాక్టర్లకు 20 కి.మీ వరకే అనుమతివ్వనున్నారు. ఇసుక తరలింపు, నిల్వలో అక్రమాల నిరోధానికి తారుమారుచేయలేని సెక్యూరిటీ ఫీచర్లతో ఎస్‌–3 ఫాంలను రూపొందించారు.  

ఏపీఎండీసీ వాణిజ్య అవసరాలకు కాకుండా స్థానిక అవసరాలకు ఈ ఇసుకను వినియోగించాలని షరతు  విధించారు. వినియోగదారులు తమ వ్యక్తిగత అవసరాలకు మించి ఇసుకను నిల్వచేయడానికి వీల్లేదని ఆదేశించారు. అలాంటి నిల్వచేసే వ్యక్తులపై తగిన చర్యలు గ్రామ సచివాలయమే తీసుకుంటుందన్నారు.

ఏపీ వాల్టా చట్టం ప్రకారం ఇసుక తవ్వకాల్లో ఎలాంటి యంత్రాలను వినియోగించరాదన్నారు. కేవలం మానవ వనరులను మాత్రమే వినియోగించాలని సూచించారు. సరఫరా చేస్తున్న ఇసుకకు సంబంధించి వినియోగాన్ని గ్రామ సచివాలయమే పరిశీలించనుంది. ఇసుక లభ్యత కోసం తీసుకున్న పై తాజా నిర్ణయాలు 3 నెలల కాలంవరకే అమలవుతాయని పేర్కొన్నారు.

 

click me!