ఇటీవల రాజధాని రైతులతో కలిసి సీఎం జగన్ ను కలిసిన తనపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు.
అమరావతి: ఏపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తన నియోజకవర్గ పరిధిలోని రైతులను కలిపించి స్వయంగా వారే సమస్యలను ఆయనకు తెలిపేలా చేశానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఇలా రైతుల సమస్యలను తీర్చడానికి తాను ప్రయత్నిస్తే ప్రతిపక్షాలు బురద జల్లడానికి ప్రయత్నించడం మంచిపద్దతి కాదన్నారు. రైతులు తమ సమస్యల గురించి ప్రత్యక్షంగా సీఎంకు తెలియజేసే అవకాశం కల్పించడమే తప్పా..? అని మండిపడ్డారు.
రాజధాని రైతులకు కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే న్యాయం చేయగలరని... తప్పకుండా న్యాయం జరుగుతుందని రైతులకు కూడా నమ్మకం కలిగిందన్నారు. అసలు విషయం తెలుసుకోకుండా చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదని ఆర్కే హెచ్చరించారు.
undefined
రాజధాని అంశం రాష్ర్ట పరిధిలోనిది అని మాజీ సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు కూడా తెలుసన్నారు. కానీ రైతులకు తప్పుడు సమాచారం అందించి రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి మాజీ సీఎంగా కాకుండా గ్రామస్దాయి నేతగా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు రోజురోజుకు దిగజారి మాట్లాడుతున్నారని... ఆయన వ్యవహారశైలిని అమరావతి రైతులు ఎవరూ సహకరించలేకపోతున్నారని పేర్కొన్నారు. అమరావతి కోసం రైతులెవ్వరూ స్వచ్చందంగా తమ భూములను ఇవ్వలేదని... పూలింగ్ ద్వారా బలవంతపు భూసేకరణకు దిగారన్నారు. భూములు లాక్కున్న రైతులకు చంద్రబాబు ఏం చేశారని ఆర్కే ప్రశ్నించారు.
read more
రైతులను పెయిడ్ ఆర్డిస్ట్ లని అనడం సరికాదని అన్నారు. రాజధాని నిర్మాణానికి లక్షా ఆరువేల ఎకరాలు అవసరమా అని నిలదీశారు. ఐదేళ్లుగా కౌలు పెంచమని రైతులు అడిగినా, రైతుకూలీల పెన్షన్ పెంచమన్నా చంద్రబాబు స్పందించలేదని అయితే ఎవరూ అడగకపోయినా జగన్ కౌలు 15 ఏళ్లకు,పెన్షన్ లు ఐదువేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
నేషనల్ హైవేను ఆనుకుని జయభేరి అపార్ట్ మెంట్స్ కట్టారని...ఈస్ట్ ఫేస్ లో రైతులు తమ భూముల్లో భవనాలు కడితే జయభేరీ అపార్ట్ మెంట్స్ అమ్ముడుపోవని చంద్రబాబు భావించలేదా అని నిలదీశారు. స్దానికంగా 600 ఎకరాలను లాక్కుని రైతులకు అన్యాయం చేయలేదా అని మండిపడ్డారు. రాజధాని కోసం 8648 చదరపు కిలోమీటర్ల ఎకరాలు అవసరమా అని ఆర్కే ప్రశ్నించారు.
రాజధాని రైతులకు అండగా తాము ఉంటామన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించి అందరి జాతకాలు బయటపడతాయని హెచ్చరించారు. సిఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు తన పవర్ ను ఉపయోగించినా మంగళగిరిలో వార్డును గెలిపించుకోలేకపోయారన్నారు. అక్రమ నిర్మాణంలో ఉన్న చంద్రబాబు ఎప్పుడైనా మంగళగిరి వచ్చారాఅని నిలదీశారు. రైతు మిత్ర అని చెప్పుకునే చంద్రబాబు మంగళగిరిలో ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు.
రైతులకోసం పనిచేసేవారైతే మీరు ముందు సమస్యల గురించి అక్కడి ఎంఎల్ఏను, ఎంపీను, మంత్రిని కలవాలని....తర్వాత సిఎంని కలవాల్సి వుంటుందన్నారు. అక్కడకి సమస్యలు తీరకపోతే ఎవరి నిర్ణయం వారు తీసుకోవచ్చన్నారు.
read more
అధికారులను, పోలీసులను కూడా చంద్రబాబు బెదిరిస్తున్నారని ఆర్కే ఆరోపించారు. ఉండవల్లి గ్రామంలో పేదలు అనేకమంది నివసిస్తున్నారని...వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడయినా ఫాగింగ్ చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నివాసం ప్రాంతంలో మాత్రం ఫాగింగ్ కింద ఐదులక్షలు ఖర్చుపెట్టించారని ఆరోపించారు. ఆయన ఇంటివద్ద ఎల్ఇడి బల్బులు పెట్టించేందుకు పంచాయితీ నుంచి 50 లక్షల నిధులు డ్రా చేయించారని అన్నారు.
చంద్రబాబు మంగళగిరినుంచి పోటీచేస్తే ఆయన కూడా ఓడిపోయి ఉండేవారన్నారు. లోకేష్ నామినేషన్లు సరిగాలేకపోయినా అధికారులపై ఒత్తిడి తెచ్చి ఓకే చేయించుకున్నారని... గుంటూరు లోక్ సభ పరిధిలో వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్దులను ఓడించేందుకు కలెక్టర్ పై ఒత్తిడి తెచ్చారని తెలిపారు. గత డిజిపి ఠాగూర్ ను కూడా చంద్రబాబు సొంత ప్రయోజనాలకు వాడుకున్నారని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు.