ఇసుక పాలసీ అమలు... జిల్లా కలెక్టర్లకు సీఎం హెచ్చరిక

By Arun Kumar P  |  First Published Feb 5, 2020, 9:20 PM IST

ఇసుక పాలసీని ఖచ్చితంగా అమలుచేయాలని... ఈ విషయంలో ఎలాంటి  తప్పులు జరిగినా సహించేది లేదని కలెక్టర్లకు జగన్ ఆదేశించారు.


అమరావతి: ఇసుక మైనింగ్‌లో అవినీతికి, అక్రమాలకు తావులేని విధానాన్ని అమలు చేస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం దేశంలోనే రోల్‌మోడల్‌గా నిల్చిందన్నారు. ఈ విషయంలో ఒక్క చిన్న తప్పు కూడా జరగడానికి వీల్లేదని...చిన్న అవినీతి చోటుచేసుకున్నా మొత్తం వ్యవస్ధకే చెడ్డపేరు వస్తుందన్నారు. 

అక్రమాలు జరక్కుండా పటిష్టంగా పనిచేయాలి... ఆలసత్వం వహిస్తే సహించేది లేదని సీఎం హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఇసుక మైనింగ్‌ పాలసీ దేశంలోనే రోల్‌మోడల్‌గా నిల్చిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. 

Latest Videos

undefined

read more  

ఇసుక పాలసీ అమలుపై ఆయన జిల్లా కలెక్టర్లకు తన కార్యదర్శి ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలు తీసుకుంటూనే అవినీతికి తావులేని పారదర్శకమైన, అక్రమ తవ్వకాలకు అడ్డుకట్టువేసే విధంగా ఇసుక పాలసీని అమలు చేస్తున్నామన్నారు. 

అయినప్పటికీ  ''ఎ డర్టీ ఫిష్‌ స్పాయిల్స్‌ ద హోల్‌ పాండ్‌'' అన్న తరహాలో ఇసుక అక్రమాలకు సంబంధించి ఒక్క కేసు నమోదైనా అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందన్నారు. అలా జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లకు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశామన్నారు. 

అవినీతి రహిత, పారదర్శకమైన ఇసుక పాలసీని అమలుచేయాలని, ఎక్కడా అక్రమాలు అన్నవి జరక్కుండా పటిష్టమైన వ్యవస్ధ ఉండాలన్నారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 

read more  రాజధానిపై పూర్తి హక్కు రాష్ట్రానిదే...సెక్షన్-6 ప్రకారం..: టిడిపి ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు

ఇందుకోసం కలెక్టర్లందరూ అన్ని వైపుల నుంచి సమగ్రమైన సమాచారం తెప్పించుకొని, అక్రమాలకు తావులేకుండా చూడాలన్నారు. రానున్న స్పందన సమావేశం నాటికి దీనిపై పక్కా సమాచారంతో సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

click me!