ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయవాడలోని తన నివాసంలో భేటీ అయ్యారు.
విజయవాడ: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్థిశాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో క్యాంప్ కార్యాలయంలో బుధవారం ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు రాజ్ గంగూలీ, సమిక్ సుందర్ దాస్ లు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ప్రపంచబ్యాంక్ నిధులతో ఆంధ్రప్రదేశ్ లో సెర్ఫ్ ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలనకు అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు ప్రశంసించారు.
ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ సమ్మిళిత అభివృద్ధి పథకం (ఏపీఆర్‌ఐజిపి) కింద చేపడుతున్న పనులపై సెర్ఫ్ సిఇఓ రాజాబాబు ఇచ్చిన నివేదిక పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీఆర్‌ఐజీపి పథకంను మరో అయిదేళ్ళపాటు రాష్ట్రంలో కొనసాగించేందుకు ప్రపంచబ్యాంక్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చర్చించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా అమలు అవుతున్న 168 రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు ఆఫీస్, ఇన్ పుట్ షాప్ లను ఏర్పాటు చేసి, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతష్టాత్మకంగా చేయబోయే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలతో అనుసంధానం చేయాలనే ప్రతిపాదనలపై సమీక్షించారు. నేషనల్ లెవెల్ ఎఫ్పిఓ వర్క్ షాప్ లను ఏర్పాటు చేసి ఈ ప్రగతిని దేశ వ్యాప్తంగా తెలియ జేయాలని ఈ భేటీలో నిర్ణయించారు.