ఏపీలో మద్యం ధరలు భారీగా పెరగడంతో ప్రమాదకరమైన శానిటైజర్ తాగడం అలవాటు చేసుకున్న ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు.
చిలకలూరిపేట: ఏపీలో మద్యం ధరలు భారీగా పెరగడంతో ప్రమాదకరమైన శానిటైజర్ తాగడం అలవాటు చేసుకున్న ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. ఈ దుర్ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో చోటుచేసుకుంది.
చిలకలూరిపేటకు చెందిన పచ్చల బాలాస్వామి (37) పెయింటింగ్ పనులు చేసేవాడు. రోజూ పనులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో మద్యాన్ని సేవించేవాడు. ఇలా అతడు మద్యానికి బానిసయ్యాడు.
undefined
అయితే కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. లాక్ డౌన్ తర్వాత ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను భారీగా పెంచింది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంతో పాటు మిగతా రంగాలు కుదేలవడంతో ిందులో ఉపాధి పొందే కూలీలు పనులు దొరక్క ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇలా బాలస్వామి కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.
ఈ క్రమంలోనే ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న అతడు మద్యం కొనుగోలు చేయడానికి డబ్బులు లేక ప్రమాదకరమైన శానిటైజర్ తాగేవాడని స్థానికులు తెలిపారు. అది అతడి ప్రాణాలనే బలితీసుకుంది.
బాలస్వామి మరణంపై కేసు నమోదు చేసుకున్న చిలకలూరిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ తరలించారు. పోస్టుమార్టం రిపోర్టుతో అతడి మృతిపై క్లారిటీ రానుంది.
read more ఒకే కుటుంబానికి చెందిన నలుగురు.. లాడ్జిలో శవాలుగా మారి..
మరోవైపు ఇదే గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం మరో ఇద్దరిని బలితీసుకుంది. నరసరావుపేట మండలం శాంతినగర్ వద్ద ఆటో బైకు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మాచవరం నుంచినరసరావుపేట వైపు బైక్ మీద ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులిద్దరు మృతి చెందారు.
మృతి చెందిన వ్యక్తులుఅక్కేనా కనకయ్య (45), శ్రీను (35) గా గుర్తించారు. వీరు మాచవరం గ్రామస్తులు గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న నకరికల్లు పోలీసులు.