రాజధానిపై పూర్తి హక్కు రాష్ట్రానిదే...సెక్షన్-6 ప్రకారం..: టిడిపి ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు

By Arun Kumar P  |  First Published Feb 5, 2020, 8:18 PM IST

కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా రాష్ట్రాల రాజధానుల ఏర్పాటు వుండదని... కానీ ఏపి విభజన చట్టం వల్లే నవ్యాంధ్ర రాజధానిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిందని టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు  తెలిపారు. 


గుంటూరు: ఫెడరల్‌ వ్యవస్థలో కేంద్రం పాత్ర ఏమిటనేది రాజకీయ నేతలు తెలుసుకోవాలన్నారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు. రాష్ట్రం విడిపోయినప్పుడు రీఆర్గనైజేషన్‌ యాక్ట్‌లోని సెక్షన్‌-6 ప్రకారం కేంద్రమే రాజధానిని నిర్మించుకునే హక్కుని రాష్ట్రానికి ఇచ్చిందని తెలిపారు.

రాజధాని అంశం ముగిసిపోయిందని చెబుతున్న బీజేపీ ఎంపీ జీవీఎల్‌ ప్రత్యేక హోదాపై వైసీపీ నేతల వాదనకు ఏం సమాధానం చెబుతారన్నారు. రాజధాని అంశం రాజకీయంగా సమసిపోయిందో లేక శివరామకృష్ణన్‌ కమిటీ రిపోర్ట్‌ ప్రకారం ముగిసిందో స్పష్టంగా చెప్పాలన్నారు. 

Latest Videos

undefined

read more  

స్వాతంత్య్రం వచ్చాక ఏరాష్ట్రం కూడా కేంద్ర ప్రమేయం లేకుండా ఇప్పటివరకు సొంతంగా రాజధానిని నిర్ణయించుకోలేదని... ఆర్టికల్‌ 370 ప్రకారం లడఖ్‌ రాజధానులు నిర్ణయించారని... అదేవిధంగా శివరామకృష్ణన్‌ కమిటీ నిర్ణయం ప్రకారం రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ణయించడం జరిగిందన్నారు.  

  ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ వున్న నిర్ణయాలు మార్చడం అంతతేలిక కాదని... సెక్షన్‌-6 ప్రకారం రాజధానిగా అమరావతిని నిర్ణయించాక దాన్ని మార్చే అధికారం ఉండదన్నారు. శివరామకృష్ణన్‌ కమిటీ చాలా స్పష్టంగా విజయవాడ-గుంటూరు మధ్యన భూమి ఉంటే రాజధాని ఏర్పాటుచేసుకోవచ్చని చెప్పిందన్నారని అశోక్ బాబు గుర్తుచేశారు.

 Video: చంద్రబాబుకు మంగళహారతులు పట్టిన అమరావతి

బీజేపీనేతలు కూడా రైతుల్లో అవమానాలు, అనుమానాలు రేకెత్తించకుండా రాజధానిగా అమరావతే కొనసాగేలా సహకరించాలన్నారు. ఎలా చూసుకున్నా రాజధాని అమరావతి నుండి తరలిపోయే ప్రసక్తేలేదని అశోక్ బాబు తెలిపారు. 


 

click me!