ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఓ మహిళ తన భర్తను ప్రియుడి సహకారంతో హత్య చేసింది. శవాన్ని ఇంట్లోనే పాతిపెట్టింది. పోలీసుల విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించింది.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. ప్రియుడితో సహాయంతో ఓ మహిళ తన భర్తను చంపింది. ఆ తర్వాత శవాన్ని ఇంట్లోనే పాతిపెట్టింది. ఈ సంఘటన గుంటూరు జిల్లాలోని చెరుకుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
చిరంజీవి అనే వ్యక్తిని భార్య హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. రూ.11 లక్షల కోసం ఆమె ఆ పనికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. చిరంజీవి అదృశ్యం కావడంతో విచారణ చేపట్టిన పోలీసులు అనుమానం వచ్చి భార్యను విచారించారు.
ఆ విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించింది. కరోనా వైరస్ కారణంగా చిరంజీవి శవాన్ని తవ్వి తీయడంలో ఆలస్యం కావచ్చునని భావిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో ఇటీవల అటువంటి సంఘటనే జరిగింది. ఓ మహిళ తన భర్తను రోకలిబండతో కొట్టి హత్య చేసింది. తల్లి సహకారంతో ఆమె ఆ పనిచేసింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరం పంచాయతీ నక్కలపల్లి గ్రామంలో ఆ ఘటన చోటు చేసుకుంది. భార్య తన భర్త మర్మాంగాలపై కొట్టి చంపింది.