ఎన్నారై ఆస్పత్రి భవనంపై నుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్య

By telugu team  |  First Published Aug 14, 2020, 12:54 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఓ కరోనా రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొద్ది రోజులుగా అతను కోరనా వైరస్ వ్యాధికి చికిత్స పొందుతున్నాడు.


గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంో చినకాకానిలో గల ఎన్నారై ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఓ కరోనా రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. భవనం మూడో అంతస్థు పైనుంచి దూకి అతను మరణించాడు. 

గుంటూరులోని మారుతీనగర్ కు చెందిన నాగమురళి (66) కరోనా సోకడంతో ఆస్పత్రిలో గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నాడు. మూడో అంతస్థు నుంచి దూకడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వైద్య  సిబ్బంది ఎమర్జెన్సీ కేర్ యూనిట్ కు తరలించి చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ అతను మృత్యువాత పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Latest Videos

undefined

కాగా, తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డిలో గల పంచుమర్తి హనుమాన్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. వారంలోపల భార్యాభర్తలు ఇరువురు కరోనా వైరస్ తో మరణించారు. రాజేష్ అనే వ్యక్తి ఈ నెల 7వ తేదీన హోం క్వారంటైన్ లో ఉంటూ బాత్రూంలో జారిపడి మరణించాడు. 

రాజేష్ భార్య స్రవంతి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది. రాజేష్ తల్లీకూతుళ్లకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాజేష్ అంత్యక్రియలకు హాజరైన ఆరుగురికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దాంతో అంత్యక్రియలకు హాజరైన 70 మందిలో భయాందోళనలు చోటు చేసుకున్నాయి

ఇదిలావుంటే, తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే నిన్నటి కన్నా ఈ రోజు తక్కువ కేసులు నమోదయ్యాయి. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 1921 కోవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 88,396కు చేరుకుంది. 

కాగా, తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 9 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 674కు చేరుకుంది. హైదరాబాదులో ఈ రోజు కూడా తక్కువగానే కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాలో ఎప్పటిలాగే కేసులు నమోద్యయాయి.

జిల్లాలవారీగా గత 24 గంటల్లో తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు

ఆదిలాబాద్ 28 
భద్రాద్రి కొత్తగూడెం 34
జిహెచ్ఎంసి 356
జగిత్యాల 40
జనగామ 38
జయశంకర్ భూపాలపల్లి 21
జోగులాంబ గద్వాల 51
కామారెడ్డి 44
కరీంనగర్ 73
ఖమ్మం 71
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 17
మహబూబ్ నగర్ 48
మహబూబాబాద్ 38 
మంచిర్యాల 18
మెదక్ 39
మేడ్చెల్ మల్కాజిగిరి 168 
ములుగు 12
నాగర్ కర్నూలు 26
నల్లగొండ 73
నారాయణపేట 6
నిర్మల్ 37
నిజామాబాద్ 63
పెద్దపల్లి 54
రాజన్న సిరిసిల్ల 33
రంగారెడ్డి 134
సంగారెడ్డి  90 
సిద్ధిపేట 63
సూర్యాపేట 47
వికారాబాద్ 14
వనపర్తి 41
వరంగల్ రూరల్ 54
వరంగల్ అర్బన్ 74
యాదాద్రి భువనగిరి 16
మొత్తం 1921

click me!