విజయవాడకు చెందిన పద్మావతి అనే మహిళ న్యాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు. తన కుమారుదడిని హత్య చేసిన వారిని శిక్షించాలని నిరసన తెలిపారు. సెప్టెంబర్ 21వ తేదీన నా కొడుకు మనోజ్ హత్యకు గురయ్యాడు. నా కొడుకును హత్య చేసిన వారిని శిక్షించాలని ఆమె వివరణ ఇచ్చారు.
రాజ్ భవన్ వద్ద సీఎం కు ఒక మహిళ ప్లకార్డు చూపించారు. విజయవాడకు చెందిన పద్మావతి అనే మహిళ న్యాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు. తన కుమారుదడిని హత్య చేసిన వారిని శిక్షించాలని నిరసన తెలిపారు. సెప్టెంబర్ 21వ తేదీన నా కొడుకు మనోజ్ హత్యకు గురయ్యాడు.
నా కొడుకును హత్య చేసిన వారిని శిక్షించాలని ఆమె వివరణ ఇచ్చారు. సీఎం కాన్వాయ్ లో వెళ్తూన్నపుడు ప్లకార్డు చూపించడంతో వెంటనే స్పందించిన సీఎం జగన్ వివరాలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. పద్మావతి మాట్లాడుతూ.. నాకొడుకును హత్య చేసి వారి స్నేహితులు చంపేశారు. గొంతుకోసి తలకాయపై మోది నా కొడుకును హత్య చేశారు.
5లక్షలు ఇచ్చి హత్య చేస్తే కేసును పక్కదారి పట్టించారు. రాచకొండ సాయి కృష్ణతో పాటు కనకదుర్గ మరో ఇద్దరు నా కొడుకును హత్య చేశారు. హత్య చేసిన వారి గురించి మేము సమాచారం ఇచ్చిన పోలీసులు స్పందించలేదు. స్పందనలో కూడా పిర్యాదు చేసిన పోలీసులు స్పబధించలేదు. కేసు నమోదు చేయమంటే స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారని ఆమె వివరణ ఇచ్చారు.
read also:ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం: గుంటూరులో ప్రయాణీకుల అగచాట్లు
గుంటూరు: గుంటూరు జిల్లాలో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ కు సోమవారం నాడు తృటిలో ప్రమాదం తప్పింది. దీంతో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలును గుంటూరు రైల్వేస్టేషన్‌లో అధికారులు నిలిపివేశారు.
భువనేశ్వర్ నుండి బెంగుళూరుకు వెళ్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ వెళ్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ఏసీ కోచ్ చక్రం బోల్డ్ ఊడిపోవడంతో రైలును గుంటూరు రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు.ఏసీకోచ్ ను రైలు నుండి విడదీసి మరో బోగిని అమర్చారు రైల్వే సిబ్బంది.ఈ విషయాన్ని గమనించకపోతే పెద్ద ప్రమాదం జరిగేదని రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు.
also read:కేరళ ఎక్స్ ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం: ప్రయాణికులుసేఫ్
గుంటూరు రైల్వేస్టేషన్‌లోనే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలును అధికారులు మూడు గంటలపాటు నిలిపివేశారు. దీంతో ప్రయాణీకులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లా ఏర్పేడు సమీపంలో కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.
కేరళ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ నుండి త్రివేండ్రం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంబవించలేదు. రేణిగుంట జంక్షన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
తరచూ ప్రమాదాలు జరగడంతో ప్రయాణీకులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వారం రోజుల క్రితం హంద్రీ ఎక్స్‌ప్రెస్ రైలును కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలోనే ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి.ఈ ప్రమాదానికి ఎంఎంటీఎస్ రైలు డ్రైవర్ చంద్రశేఖర్ కారణంగా రైల్వే ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన లోకో పైలట్ చంద్రశేఖర్ ఈ నెల 16వ తేదీ రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.రేపు చంద్రశేఖర్ అంత్యక్రియలు పశ్చిమగోదావరి జిల్లాలోని ఆయన స్వగ్రామంలో జరుగుతాయి.