రాజధాని మార్పు నిర్ణయం ప్రజల కోసం కాదు... కేవలం వారికోసమే..: తులసిరెడ్డి

By Arun Kumar P  |  First Published Feb 6, 2020, 5:14 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి తరలించాలన్న ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం వెనుక రాష్ట్ర ప్రయోజనాల కాకుండా వేరే విషయాలు దాగున్నాయని కాంగ్రెస్ నాయకులుు  తులసిరెడ్డి మండిపడ్డారు. 


అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి తరలించడం వెనుక పెద్ద  కుట్ర దాగివుందని ఏపిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపించారు. 
రాజధాని మారుస్తున్నది రాష్ట్రం కోసమో, ప్రజల కోసమో కాదని కేవలం రియల్ ఎస్టేట్ కోసమేనని అన్నారు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేకే రాజధానిని అమరావతి నుంచి మారుస్తున్నామంటూ సీఎం జగన్ సరికొత్త వాదనను ముందుకు తెచ్చారని తులసిరెడ్డి మండిపడ్డారు. 

అమరావతిలో ఇప్పుడున్న సచివాలయానికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల కోసం చాలా భవనాల నిర్మాణం కూడా పూర్తయ్యిందన్నారు. ఇలాంటి సమయంలో రాజధాని మార్చడంవల్ల రాష్ట్రప్రభుత్వంపై మరింత ఆర్థిక భారం  పడుతుందన్నారు. కాబట్టి రాజధాని  మార్పు నిర్ణయంపై మరోసారి పునరాలోచించాలని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి సూచించారు.

Latest Videos

undefined

read more  ప్రభుత్వంలో విలీనం...సంతోషం కంటే సమస్యలే ఎక్కువ: ఆర్టీసీ యూనియన్ ఆవేదన

అనేక రాష్ట్రాల సచివాలయాల కంటే ఆంధ్రప్రదేశ్ సచివాలయ భవనం బ్రహ్మాడంగా, అందంగా, ఆకర్షణగా ఉందన్నారు. అమరావతిలో అయిదు వేల కోట్లు ఖర్చు పెడితే మొత్తం భవనాలు పూర్తి అవుతాయని పేర్కొన్నారు. డబ్బు లేక రాజధానిని మారుస్తున్నాం అనడం ఏ మాత్రం అర్థంపర్థం లేని వాదన అని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. 


 

click me!