ప్రభుత్వంలో విలీనం...సంతోషం కంటే సమస్యలే ఎక్కువ: ఆర్టీసీ యూనియన్ ఆవేదన

Arun Kumar P   | Asianet News
Published : Feb 06, 2020, 04:27 PM ISTUpdated : Feb 06, 2020, 04:35 PM IST
ప్రభుత్వంలో విలీనం...సంతోషం కంటే సమస్యలే ఎక్కువ: ఆర్టీసీ యూనియన్ ఆవేదన

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీసి సంస్థను ముఖ్యమంత్రి జగన్ సర్కారులో విలీనం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగులంగా సంతోషంగా వున్నారని అనుకుంటుండగానే ఓ యూనియన్ నాయకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసి)ని ప్రభుత్వంలో విలీనం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసి ఉద్యోగులు కూడా ప్రభుత్వోద్యుగులుగా మారిపోయారు. అయితే ఆర్టీసి ప్రభుత్వంలో విలీనమయితే  ఉద్యోగులకు మరింత లబ్ది చేకూరి వారు సంతోషంగా వుంటారని అందరూ భావించారు. అయితే ప్రస్తుతం తమ పరిస్థితి అందరూ అనుకున్నట్లు లేదని ఏపి ఆర్టీసీ ఉద్యోగ సంఘం నాయకులు దామోదర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రభుత్వంలో  సంస్థ విలీనం అయ్యాక ఉద్యోగుల్లో సంతోషం కంటే సమస్యలే ఎక్కువగా ఉన్నాయన్నారు. అందువల్లే తమ సమస్యలను ముఖ్యమంత్రి జగన్, రవాణా మంత్రి పేర్ని నాని దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. అలాగే ఏపీ జేఎసి లో 95వ సంఘంగా ఆర్టీసీ ఉద్యోగుల సంఘం ఫిబ్రవరి 8వ తేదీన అధికారికంగా చేరుతుందన్నారు. తమ సమస్యలపై ఈ సంఘం ద్వారా పోరాటం చేస్తామని దామోదర్ తెలిపారు. 

read more  వీఆర్ వివాదం... వర్ల రామయ్యపై పోలీస్ అధికారుల సంఘం ఫైర్

ఏపీ జేఎసి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ఫిబ్రవరి 8వ తేదీన ఏపీ జేఎసి తృతీయ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను విజయవాడలో నిర్వహిస్తున్నామన్నారు.  సమావేశాలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించామని తెలిపారు. 8వ తేదీన ఉదయం 9.30 గంటలకు ఉద్యోగులతో తుమ్మలపల్లి నుండి లెనిన్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. 

13 జిల్లాల చైర్మన్లు, కార్యదర్శులు, ఉద్యోగులు సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. జెఎసి ముఖ్యోద్దేశమే శాఖాపరమైన సంఘాల బలోపేతమని... అదే లక్ష్యంగా ఎపి జెఎసి ఏర్పాటు చేసామన్నారు. సమావేశంలో ప్రధానంగా ఉద్యోగుల పని ఒత్తిడి, రాజధాని తరలింపు ద్వారా ఉద్యోగుల ఇబ్బందులు, రావాల్సిన రాయితీలపై చర్చిస్తామన్నారు. 

read more  రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనడం ముమ్మాటికీ తప్పే...: ఆళ్ల రామకృష్ణారెడ్డి

సిపియస్ రద్దు, ఉధ్యోగుల సమస్యలు, ఆర్టీసి, విశ్రాంత, మహిళ ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తామన్నారు. అన్ని సమస్యలపై సమావేశంలో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలని కోరతామని బొప్పరాజు వెల్లడించారు. 


 

PREV
click me!

Recommended Stories

రైల్వేకోడూరు: అభ్యర్ధిని మార్చిన జనసేన, భాస్కరరావు స్థానంలో శ్రీధర్
ఆటోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం: డ్రైవర్ల సమస్యలపై జనసేనాని ఆరా