ఉపాధిహామీ బకాయిల కోసం ఛలో అమరావతి...: ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

By Arun Kumar P  |  First Published Oct 26, 2019, 5:23 PM IST

టిడిపి ఎమ్మెల్సీ విబి రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛలో అమరావతికి పిలుపునిచ్చారు. నవంబర్ భారీ సంఖ్యలో ఎంపిపి, ఎంపిటీసి, సర్పంచ్ లతో రాజధానిలో నిరసన  తెలపనున్నట్లు ప్రకటించారు. 


విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భారీమొత్తంలో బకాయిపడిన ఉపాధిహామీ నిధులను వెంటనే చెల్లించాలని పంచాయతీరాజ్ ఛాంబర్ల జాతీయాధ్యక్షుడు, టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ నిధుల చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడితీసుకువచ్చేందుకు ఉద్యమబాట పట్టనున్నామంటూ ఛలో అమరావతికి పిలుపునిచ్చారు. 

రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.2500 కోట్ల ఉపాధి హామీ నిధులు బకాయిపడిందని రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. ఈ నిధుల విడుదల కోసం ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా కనికరించడం లేదని... అందువల్లే నిరసన బాట పట్టినట్లు తెలిపారు. 

Latest Videos

undefined

read more  చెక్ పవర్ సర్పంచ్‌లకే ఉండాలి: టీఆర్ఎస్‌పై ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ ఫైర్

ఉపాధిహామీ బకాయిల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో రాష్ట్ర సర్పంచుల సంఘం, ఎంపీటీసీల సంఘం, ఎంపీపీల సంఘం, జడ్పీటీసీల సంఘాలతో రాజేంద్రప్రసాద్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో చర్చించిన అంశాలను ఆయన వివరించారు. 

తమకు రావాల్సిన బకాయిల కోసం ఉద్యమ ప్రణాళిక రూపొందించిట్లు రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ నెల 28నుంచి నవంబర్ 3వరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గ కేంద్రాలలో సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ధర్నాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.

అలాగే వచ్చేనెల అంటే నవంబర్ 4 నుంచి 20వరకు 13 జిల్లాల్లోనూ కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక చివరగా నవంబర్ నెలాఖరున ఛలో అమరావతిని చేపట్టనున్నట్లు ప్రకటించారు.

read more రాజ్యాంగబద్దం కాదు...అయినా అగ్రిగోల్డ్ బాధితులకు సాయం...: అప్పిరెడ్డి

రాజకీయాలకి అతీతంగా చేపడుతున్న ఈ నిరసన కార్యక్రమంలో అన్ని పార్టీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, ప్రజలు పాల్గొనాలని ఆయన కోరారు. ఉపాధి హామీ నిధులు విడుదల చేసేవరకు ఈ ఆందోళనా కార్యక్రమాలు కొనసాగుతాయని... ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని బాబు రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. 
 

click me!