యనమలపై విమర్శలా... ఖబర్దార్: టిడిపి ఎమ్మెల్సీ శ్రీనివాసులు

By Arun Kumar P  |  First Published Dec 6, 2019, 9:48 PM IST

వైసిపి నాయకులు బిసి నాయకుడు అయినందువల్లే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారని టిడిపి ఎమ్మెల్సీ శ్రీనివాసులు పేర్కొన్నారు. అలా విమర్శలు చేస్తున్న మంత్రులపై ఆయన ఫైర్ అయ్యారు.  


గుంటూరు: ఆరు నెలల పాలనలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని టిడిపి ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు ఆరోపించారు. రాష్ట్రానికి అతి ముఖ్యమైన రాజధాని అమరావతి నిర్మాణాన్ని నిలిపివేయడం ద్వారా భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతోందని.. దీన్ని ప్రజలు గుర్తించారని అన్నారు.

అధికారంలోకి వచ్చిరాగానే ప్రజావేదిక కూల్చివేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.9కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఇక ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, పంచాయతీ భవనాలు, శ్మశానాలకు పార్టీ రంగులు వేయడం ద్వారా రూ.1300కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. 

Latest Videos

undefined

ముఖ్యమంత్రి జగన్ నివాసంలోని సౌకర్యాలకు రూ.15కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని  ఆరోపించారు. ఇలా ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుకోవడం తప్ప ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని టీడీపీ ఎమ్మెల్సీ మండిపడ్డారు. 

ప్రసార మాధ్యమాల్లోనే జగన్ ది గొప్ప పాలన... పబ్లిక్ లో కాదు: టిడిపి ఎమ్మెల్యే

శుక్రవారం ఆయన మంగళగిరిలోని జాతీయ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీసీ నాయకుడైన యనమల రామకృష్ణుడి గురించి రాష్ట్ర మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం మానకుంటే బీసీనేతలుగా సహించేది లేదని హెచ్చరించారు. 

యువతకు ప్రభుత్వ ఉద్యోగాలిస్తామన్న వైసీపీ అధికారంలోకి వచ్చాక తమ పార్టీ కార్యకర్తలకు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఉద్యోగాలిచ్చి ప్రజాధనాన్ని దోచిపెడుతోందన్నారు. పోలవరం రీటెండర్ల పేరుతో రూ.7,500కోట్లు ఆదాచేశామంటున్న పాలకులు అంతకురెట్టింపు సొమ్ముని ఇతరమార్గాల్లో కాంట్రాక్టు సంస్థకు దోచిపెట్టారన్నారు. 

అన్నాక్యాంటీన్ల రద్దుతో 3లక్షల మంది పొట్టగొట్టిన జగన్‌ ప్రభుత్వం... ఇసుకపాలసీ పేరుతో 35లక్షలమంది భవననిర్మాణ కార్మికులను రోడ్డుపాలు చేసిందన్నారు. రాజధాని నిలిపేసి పరిశ్రమలను పక్కరాష్ట్రాలకు తరలిపోయేలా చేసిన ఘనత ఈప్రభుత్వానికే దక్కిందన్నారు. 

video:దిశ నిందితుల ఎన్‌కౌంటర్ మరువక ముందే... గుంటూరు దారుణం

వరల్డ్‌బ్యాంక్‌, ఏడీబీ, ఇతర ప్రైవేట్‌బ్యాంకులు ప్రభుత్వానికి రుణమివ్వకుండా వెనకడుగు వేశాయన్నారు. అసెంబ్లీ  15రోజులపాటు నిర్వహిస్తేనే రాష్ట్రప్రభుత్వం ప్రజలకు ఏంచేసిందో, భవిష్యత్‌లో ఏంచేయబోతోందో ప్రజలకు అర్థమవుతోందని శ్రీనివాసులు పేర్కొన్నారు.


  
 

click me!