టీడీపీ కార్యాలయమూ అక్రమమే...కూల్చేయాల్సిందే: హైకోర్టును ఆశ్రయించిన ఆర్కే

By Arun Kumar P  |  First Published Dec 6, 2019, 5:12 PM IST

ప్రారంభోత్సవానికి సిద్దమైన ఆంధ్ర ప్రదేశ్ తెలుగు దేశం కార్యాలయాన్ని కూల్చివేయాలంటూ వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.  


అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మించిన టిడిపి కార్యాలయాన్ని నిర్మించిన స్థలాన్ని ఆ పార్టీ అక్రమమార్గంలో పొందిందని వైఎస్సార్సిపి  ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. అందువల్ల ప్రారంభోత్సవానికి సిద్దమైన ఆ భవనాన్ని వెంటనే కూల్చివేసేలా చూడాలంటూ ఎమ్మెల్యే ఏపి హైకోర్టులో  పిల్ దాఖలు చేశారు. 

తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం కేటాయించిన 3.65 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని పిల్ లో ఆర్కే పేర్కొన్నారు. ఆ భూమిని ఏకంగా 
99 సంవత్సరాలు పాటు నిబంధనలకు విరుద్ధంగా లీజుకు ఇచ్చారని ఆరోపించారు.  సీఆర్డీఏ యాక్ట్ 2104లోని నిబంధనలకు విరుద్ధంగా 2017లో జారీ చేసిన జీవో నంబర్ 228ని రద్దు చేయాలని హై కోర్టును ఆర్కే కోరారు. 

Latest Videos

undefined

ఇలా నిబంధనలను తుంగలో తొక్కి గత ప్రభుత్వం స్వప్రయోజనాల కోసమే అక్రమంగా భూకేటాయింపులు జరిపారని... అదేక్రమంలో టిడిపి కార్యాలయ స్థలాన్ని పొందినట్లు రామకృష్ణ ఆరోపించారు. అలా అక్రమ స్థలంలో నిర్మించిన కార్యాలయాన్ని కూల్చేయాలని తాను హైకోర్టును అభ్యర్ధించినట్లు... అందులో భాగంగానే ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలుచేసినట్లు ఎమ్మెల్యే ఆర్కే వెల్లడించారు.

read  more  విషాదం... మూడు నెలల గర్భిణి దారుణ హత్య, భర్తే హంతకుడా...?

టిడిపి కార్యాలయ నిర్మాణం పూర్తవడంతో ప్రారంభోత్సవానికి సిద్దమయ్యింది. ఇటీవలే టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కుటుంబ సమేతంగా అక్కడ పూజలు కూడా నిర్వహించారు. ఇలాంటి సమయంలో ఆర్కే హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఏం తీర్పునిస్తుందోనని అందరిలో ఉత్కంఠ పెరిగిపోయింది. 

గతంలో విశాఖపట్నం టిడిపి కార్యాలయానికి కూడా గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జివిఎంసి) అధికారులు కూల్చివేత నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.  నిబంధనలు ఉల్లంఘించి ఈ కార్యాలయాన్ని నిర్మించారంటూ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. భూమికి సంబంధించిన లింకు డాక్యుమెంట్లు యాజమాన్య పత్రాలను సమర్పించకపోవడంతోనే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

READ MORE  DishaCaseAccusedEncounter:ఈ ఎన్‌కౌంటర్ సమర్థనీయమే: సిపిఐ నారాయణ

జగన్ సీఎంగా అధికారాన్ని చేపట్టగానే రాష్ట్రంలోని అక్రమ కట్టడాలపై  ముఖ్యంగా టిడిపికి సంబంధించిన వాటిపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే  కృష్ణా నది కరకట్ట పై మాజీ సీఎం చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ప్రజావేదిక ను కూల్చేశారు. ఆ తర్వాత చంద్రబాబు కుంటుంబంతో సహా నివాసముంటున్న లింగమనేని భవనాన్నికూల్చడానికి కూడా విశ్వప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పటివరకు అది సాధ్యపడలేదు. తాజాగా  వైసిపి ఎమ్మెల్యే ఆర్కే టిడిపి కార్యాలయంపై హైకోర్టును ఆశ్రయించారు.  

click me!