ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను దుర్వినియోగం చేస్తూ పనులు చేసిన కాంట్రాక్టర్ల కు బిల్లులు చెల్లించకుండా వేధిస్తోందని టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు.
అమరావతి: న్యాయవ్యవస్థపై ఈ ప్రభుత్వ ఏ మాత్రం గౌరవం ఉన్నా ఉపాధి నిధులను వెంటనే విడుదల చేయాలి శాసనమండలి సభ్యులు, రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు.
విజయవాడలోని హోటల్ తిలోత్తమలో బుధవారం రాష్ట్ర ఉపాధిహామీ మండలి సభ్యులు ఉపాధి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. పేదల ఉపాధికి, గ్రామీణాభివృద్ధికి ఉపయోగపడిన నరేగా పథకాన్ని గత 7 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. కేంద్రం నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేయకుండా నిధులు నవరత్నాలకు మళ్ళించారని రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు.
ఉపాధి హామి పథకం ప్రాథమిక లక్ష్యాన్నే ఈ రాష్ట్ర ప్ఱభుత్వం దెబ్బతీస్తోందని మండిపడ్డారు. పనులు చేసినవారికి బిల్లులు ఇవ్వడం లేదని బాధపడ్డారు. 2018-19 సంవత్సరానికి రాష్ట్రంలో నరేగా పనులకు కేంద్రం నిధులు విడుదల చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ మూడు జీవోలు ఇచ్చారని గుర్తు చేశారు. 05.08.2019న రూ.836,00,68,000, 08.07.2019న రూ.641,39,52,000 మరియు 09.04.2019న రూ.367,65,41,000 మొత్తంగా రూ.1,845 కోట్లు విడుదల చేసిందన్నారు.
read more వివేకా హత్యకేసుతో జనంలోకి... జగన్ పాత్రపై అనుమానం..: బుద్దా వెంకన్న
రాష్ట్రం తన వాటా రూ. 615 కోట్లతో కలిపి మొత్తం రూ. 2460 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు.ఈ నిధులను స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ ఫండ్‌కు 3 రోజుల్లోపు విడుదల చేయాలని స్పష్టంగా ఆదేశించింది. లేనిపక్షంలో భవిష్యత్తులో ఇచ్చే నిధులను ఆపేస్తామని, నిధుల జాప్యమైన కాలానికి 12% వడ్డీతో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని హెచ్చరించిందన్నారు.
ఎన్‌ఆర్‌ఈజీయస్ చట్టం దేశవ్యాప్తంగా, పకడ్బందీగా, కట్టుదిట్టంగా అమలవుతోందన్నారు. నరేగా కింద చేసిన పనులకు ప్రాధాన్యతా క్రమంలో, ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరపాలని... పాత బకాయిలను ప్రథమ ప్రాధాన్యత కింద చెల్లించాలన్నారు. ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు.
గాడి తప్పిన పాలనతో పంచాయితీల్లో అన్నీ అభివృద్ధి పనులు అగిపోయి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో మెటీరియల్ కాంపోనెంట్ కింద సిమెంట్ రోడ్లు, గ్రామ పంచాయితీ కార్యాలయాలు, అంగన్ వాడీ భవనాలు, డ్రైనేజీ నిర్మాణం, సంపద తయారీ కేంద్రాలు స్మశాన వాటికలు మొదలగు అభివృద్ధి పనులను మాజీ సంర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు మరియు చిన్న చిన్న కాంట్రాక్టర్లు అప్పులు చేసి తమ ఆస్థులను తాకట్టు పెట్టి ఈ పనులను చేశారని అన్నారు.
read more జగన్ పాలన మరో ఏడాదే... ఆ తర్వాత జైలుకే...: దేవినేని ఉమ సంచలనం
నరేగా నిధులలో అవకతవకలు జరిగాయని చెబుతున్న ప్రభుత్వం కొన్ని ప్రాంతాలలో మాత్రం ఎలా బిల్లుల చెల్లించారు. అక్కడ అవకతవకలు జరగలేదని ప్రభుత్వం ఒప్పుకుంటుందా? అని ప్రశ్నించారు. 2018-19 సంవత్సరంలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత పారదర్శకంగా నరేగాను అమలుచేశారని అవార్డు ఇచ్చి ప్రశంసించారని గుర్తుచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి నిధులు విడుదలైనప్పటికీ కూడా కేవలం కక్షకట్టి బిల్లులు చెల్లించకపోవడం వలన ఈ పనులు చేసిన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కొంత మంది తమ ఆస్థులను అమ్ముకుని అప్పులు కట్టుకుంటున్నారని అన్నారు. ఈ విషయాలపై చాలాకాలంగా న్యాయ పోరాటం చేస్తున్న మనకు న్యాయం ఇంకా బ్రతికే ఉంది అన్నట్లు హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరీ, జస్టిస్ ఎం. సీతారామమూర్తిలతో కూడిన ధర్మాసనం కేంధ్రం విడుదల చేసిన రూ. 1845 ముందు పనిచేసిన వారికి నెల రోజుల వ్యవధిలో చెల్లించాలని తీర్పు చెప్పడం జరిగిందన్నారు.
ప్రాధాన్యత క్రమంలో నిధులు విడుదల చేయకపోవడం పైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు వివరణ కోరడం న్యాయపరంగా మనం సాధించిన గొప్ప విజయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజక వర్గానికి రూ.15 కోట్ల డ్రైనేజ్, ఇళ్ల స్థలాల చదును వంటి అభివృద్ధి పనుల చేపట్టడానికి నిధులు కేటాయించారు. ఈ పనులకు కేంద్రం విడుదల చేసిన నిధులను ప్రస్థుత పనులు చేస్తున్న వారికి కేటాయించడం నరేగా చట్టానికి విరుద్ధమన్నారు.