రాజధాని మార్పు, మండలి రద్దు అంటూ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ జగన్ పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు.
గుంటూరు: అత్యంత కీలకమైన రాష్ట్ర రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ ఏకపక్షంగా వ్యవహరించారని... జీఎన్ రావుతో అనుకూలంగా రిపోర్ట్ ఇప్పించారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జీఎన్‌రావు కమిటీకి చైర్మన్ జీఎన్ రావు కాదు అజయ్ కల్లామ్ అని అన్నారు. అసెంబ్లీలో జగన్ చెప్పిందే నివేదికలో ఉందన్నారు. ప్రతికూల అంశాలను హైపవర్ కమిటీ ఎందుకు దాచిపెట్టింది? అని ప్రశ్నించారు.
undefined
జిఎన్ రావు కమిటీ రిపోర్టులను పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టలేదని కోర్టు ప్రశ్నించిన తర్వాత బయటపెట్టారని అన్నారు. విశాఖ సముద్ర తీరంలో ఉందని... రాజధాని 50 కిలోమీటర్ల తర్వాత పెట్టుకోమని తాను చెప్పినట్లు జీఎన్ రావు వెల్లడించారని... ఇది జగన్ నిర్ణయమేనని అన్నారు.
మోసపూరిత ఆర్ధిక సంస్థలపై ఉక్కుపాదం... అధికారులకు ఏపి సిఎస్ ఆదేశం
హుద్‌హుద్ సమయంలో కనీసం జగన్ పరామర్శకు వెళ్లలేదని గుర్తుచేశారు. తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు కూడా జగన్ పట్టించుకోలేదన్నారు. ఇలా గతంలో ఉత్తరాంధ్రను ఏనాడు పట్టించుకోని జగన్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ కోసమే విశాఖను రాజధాని అంటున్నారని మండిపడ్డారు.
మరో సంవత్సరం తిరగకముందే జగన్ జైలుకెళ్తారని... జైలుకు వెళ్లేవారికి అధికారులు సహకరించొద్దని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం నిర్వాకం వల్ల 26 మంది రైతులు చనిపోయారని ఆరోపించారు.
బోస్టన్ కమిటీ కూడా తప్పుడు రిపోర్టులు ఇచ్చిందని అన్నారు. వీరి తప్పుడు రిపోర్టుల వల్ల రైతుల గుండెలు ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు మొట్టికాయలు వేసిందని జీఎన్‌రావు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టారని తెలిపారు. జీఎన్ రావుకు అమరావతి వచ్చే తీరిక లేదా అని ఉమ నిలదీశారు.
read more రివర్స్ టెండరింగ్... రూ. 30.91 కోట్లు ఆదా..: మంత్రి బొత్స
రాష్ట్రపతి ఆమోదంతో శివరామకృష్ణ కమిటీ ఏర్పడిందన్నారు. ఇష్టారాజ్యంగా మండలి రద్దు చేస్తాం... సెలెక్ట్ కమిటీ చెప్పేది వినబోం అంటే కుదరదని హెచ్చరించారు.
లులూ, ఆదానీ గ్రూప్ లను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టింది ఇదే వైసిపి ప్రభుత్వమని మండిపడ్డారు. దసపల్లా, వాల్తేరు క్లబ్ భూముల్ని కొట్టేయడానికి విజయసాయిరెడ్డి అనేక కుట్రలు చేశారని ఆరోపించారు. అందుకే విశాఖను రాజధానిగా చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోందని... అయితే ప్రస్తుతం ప్రభుత్వం కుడితో పడిన ఎలుకలా కొట్టుకుంటోందని దేవినేని ఉమ విమర్శించారు.