డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా ముస్లీం పుట్టుకే పుడితే...: టిడిపి మైనారిటీ నేతల ఘాటు విమర్శలు

By Arun Kumar P  |  First Published Jan 23, 2020, 9:50 PM IST

మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, అనిల్‌ కుమార్‌ యాదవ్ లు గూండాలుగా, వీధిరౌడీల్లా మారి శాసనమండలి ఛైర్మన్ ను కులం పేరుతో దూషించడంపై టిడిపి మైనారిటీ నేతలు ఫైర్ అయ్యారు.  ఈ  సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 


గుంటూరు: రాష్ట్రమంత్రులుగా ఉండి మండలి ఛైర్మన్‌ షరీఫ్‌పై భౌతికదాడికి యత్నించడం,  ఆయన్ని దుర్భాషలాడటం వంటి చర్యలతో సభ్యసమాజం సిగ్గుపడుతోందని టీడీపీ కార్యదర్శి, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ ఎం.డీ.హిదాయత్‌ మండిపడ్డారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలినాని, అనిల్‌కుమార్‌లు గూండాలుగా, వీధిరౌడీల్లా మారి శాసనమండలి ప్రతిష్టను  అవహేళన చేశారని ఆరోపించారు. 

గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. షరీఫ్‌పై వారుచేసిన దాడిని మొత్తం ముస్లిం సమాజంపై చేసిన దాడిగానే భావిస్తున్నామన్నారు. 40ఏళ్ల రాజకీయ అనుభవంతో నిబద్ధతతో బ్రతికిన వ్యక్తిని పట్టుకొని నోటితో చెప్పలేని విధంగా దుర్భాషలాడటం వైసీపీ మంత్రులకే చెల్లిందన్నారు. అలాంటి వ్యక్తుల్ని మంత్రుల్ని చేయడం ద్వారా జగన్‌ రాష్ట్రపరువు తీసేశాడన్నారు. 

Latest Videos

ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే వారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలన్నారు.  ముస్లిం వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన సదరు మంత్రులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హిదాయత్‌ తేల్చిచెప్పారు. మంత్రుల దాష్టీకంపై గుంటూరు అర్బన్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. 
బెయిల్‌పై బయటతిరుగుతున్న విజయసాయిరెడ్డి షరీఫ్‌ను బెదిరించాడని, ఆర్థికనేరాల్లో ఉన్నవ్యక్తి  దేవాలయంలాంటి మండలికి రావడం దారుణమన్నారు.  విజయసాయి బెయిల్‌ను తక్షణమే రద్దుచేసి ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. 

read more  ప్రజల్ని ఓడించడానికి ప్రజల సొమ్మే... ఇది జగన్ మార్కు న్యాయం: వర్ల రామయ్య

మండలిఛైర్మన్‌పై జరిగిన దాడికి మంత్రివర్గం, జగన్మోహన్‌రెడ్డే బాధ్యత వహించాలన్నారు ముస్లిం మతగురువులాంటి మనిషిన పట్టుకొని మతం పేరుతో దుర్భాషలాడిన మంత్రులపై చర్యలు తీసుకోకుంటే మొత్తం ముస్లిం సమాజానికే ముఖ్యమంత్రి ద్రోహం చేసినట్లుగా భావించాల్సి వస్తుందని హిదాయత్‌ స్పష్టంచేశారు.

నీతి, జాతిలేని కుక్క బొత్స : ఫిరోజ్‌

నీతి,జాతి లేకుండా సారాయి వ్యాపారం చేసుకునే బొత్స, పేకాటక్లబ్‌లు నడుపుతూ, క్రికెట్‌బెట్టింగ్‌లకు పాల్పడే అనిల్‌యాదవ్‌ లాంటివారు బజారువ్యక్తులకన్నా దారుణంగా ప్రవర్తించారని... మండలి ఛైర్మన్‌పై దూషణలకు పాల్పడటం ద్వారా చేయరాని తప్పుచేశారని మైనారిటీ నేత ఫిరోజ్‌ మండిపడ్డారు. నీతి, జాతిలేని కుక్క బొత్స అని, అలాంటి వ్యక్తి ముస్లిం సమాజానికి రోల్‌మోడల్‌ లాంటి షరీఫ్‌ను ఉద్దేశించి సాయిబుకే పుట్టావా అనడం, ''మా ఇంటికి మీఇల్లు ఎంతదూరమో.. మీ ఇంటికి మాఇల్లు అంతేదూరం'' అని బెదిరించడాన్ని తామంతా ఖండిస్తున్నామన్నారు. 

read more  సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లులెన్నో పాసయ్యాయి...: టిడిపి అధ్యక్షుడి వ్యాఖ్యలు

వైసీపీ ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, ఆ పార్టీలోని ఇతర ముస్లిం మైనారిటీ నేతలంతా తాము పుట్టింది ముస్లింపుట్టుక అయితే జగన్‌పై ఒత్తిడి తెచ్చి ఆ మంత్రులతో షరీఫ్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పించాలన్నారు. రాబోయేరోజుల్లో వైసీపీ అంతంచూసేవరకు ముస్లిం సమాజం నిద్రపోదని ఫిరోజ్‌ తీవ్రస్వరంతో హెచ్చరించారు.     

click me!