ఎంపిగానే జగన్ అంతచేస్తే... సీఎంగా ఇంకెంత చేస్తారు..: సిబిఐ కోర్టుకు వర్ల రామయ్య

By Arun Kumar PFirst Published Oct 18, 2019, 6:23 PM IST
Highlights

సిబిఐ కోర్టులోతనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కోరడాన్ని టిడిపి నాయకులు  వర్ల రామయ్య తప్పుబట్టారు. ఈ విషయంలో సిబిఐ కోర్టు నిర్ణయం తీసుకునేటపుడు పలు విషయాలను పరిగణలోకి  తీసుకోవాలన్నారు.  

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాను సాకుగా చూపించి సిబిఐ  విచారణ నుండి తప్పించుకోవాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. అందువల్లే అతడి సిబిఐ కోర్టు వెసులుబాటు కల్పించవద్దని... ఇప్పటిలాగే వ్యక్తిగత విచారణకు అతడు హాజరయ్యేలా చూడాలంటూ రామయ్య కోరారు.

 సిబిఐ కోర్టులోనే జగన్ తరపు న్యాయవాది సిబిఐ న్యాయవాదిని  బెదిరించేలా మాట్లాడారన్నారు.  జగన్ కేవలం ఎంపీగా ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేశారు...ఇప్పుడాయన ముఖ్యమంత్రి... అధికారం మొత్తం చేతుల్లోవున్న ఆయన సాక్షులను బెదిరించరా..? అని  రామయ్య ప్రశ్నించారు. 

సీబీఐ కోర్ట్ జగన్ కు వ్యక్తిగత  విచారణ నుండి మినహాయింపు ఇవ్వకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు. సీఎం హోదాను చూసి కోర్ట్ జగన్ కి మినహాయింపు ఇస్తే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళతాయన్నారు.

విశాఖ భూకుంభకోణం...సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం: గంటా

ఆర్టికల్ 14 ప్రకారం ముఖ్యమంత్రి హోదా చూపించి మినహాయింపు అడగ కూడదన్నారు. కానీ జగన్ ఆ పని చేశారు. కాబట్టి దీన్ని దృష్టిలో వుంచుకుని సిబిఐ కోర్టు నిర్ణయం తీసుకోవాలన్నారు. 

. జగన్ పై సీబీఐ పెట్టిన కేసులు...ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలపై పెట్టిన కేసు లపై చర్చకు సిద్ధమా?  అని అధికారపార్టీని రామయ్య ప్రశ్నించారు. కావాలనే తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నట్లు ఆయన వైఎస్సార్‌సిపి ప్రభుత్వాన్ని విమర్శించారు.  

ఇక ఇసుక కొరతపై మరోమారు ఆందోళనకు టిడిపి సిద్దమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ఈ నెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరపనున్నట్లు తెలిపారు. ఆరోజు టిడిపి నేతలు చేపట్టే సామూహిక నిరహార దీక్షలకు అన్ని పార్టీలు , ప్రజా సంఘాలు మద్దతివ్వాలని కోరారు.

ఇసుక కొరత కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు న్యాయం జరిగే  వరకు పోరాటం చేస్తామన్నారు. వైఎస్సార్‌సిపి ప్రభుత్వం ఇసుక కొరతపై చర్యలు తీసుకునేవరకు తమ పోరాటం ఇలాగే కొనసాగుతుందని వర్ల రామయ్య స్పష్టం చేశారు. 

click me!