టిడిపిని విలీనం చేయడానికే పొలిట్ బ్యూరో సమావేశం...: వైసిపి ఎమ్మెల్యే

By Arun Kumar PFirst Published Oct 17, 2019, 9:28 PM IST
Highlights

తెలుగు దేశం పార్టీపైనా, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై వెఎస్సార్‌సిపి ఎమ్మెల్యే సిదిరి అప్పల్రాజు విరుచుకుపడ్డాడు. టిడిపి ని ఏదైనా పార్టీలో వీలినం చేయాలని ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.  

అమరావతి: మాజీ స్పీకర్, టిడిపి నాయకులు కోడెల మృతికి ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు  నాయుడు వేధింపులే కారణంమని పలాస ఎంఎల్ఏ సిదిరి అప్పల్రాజు ఆరోపించారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం లో మీడియా సమావేశాన్ని నిర్వహించిన ఆయన చంద్రబాబునే టార్గెట్ గా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టాడు. 

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది చంద్రబాబేనని అన్నాడు. ఏపిని అవినీతి రాష్ట్రంగా మార్చింది కూడా ఆయనేనని ఆరోపించారు. ఆయన వల్లే రాష్ట్ర ప్రతిష్ట తగ్గిపోయిందని అన్నారు. 

చంద్రబాబు నిర్వాహకం వల్లే రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయని అన్నారు. పిపిఏలను సమీక్షిస్తే నీకు వచ్చిన నష్టం ఏంటి చంద్రబాబూ..? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. సోలార్, విండ్ పవర్ ను ఎందుకు అధిక ధరలకు కొనాల్సివచ్చిందో చంద్రబాబే ప్రజలకు చెప్పాలని అన్నారు.

అధికారంలో ఉండగా ప్రజలకు ఆయన  కేవలం గ్రాఫిక్స్ మాత్రమే చూపించారని ఎద్దేవా చేశారు. కోడెల దోపిడీ గురించి మీ పోలిట్ బ్యూరోలో చర్చించారా...?  అంటూ ఇవాళ (గురువారం) జరిగిన టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం గురించి ప్రశ్నించారు. 

జన్మభూమి కమిటీలతో దోపీడి సాగించిన ఆయనకు గ్రామసచివాలయాల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల సిఎంగా పనిచేశానని గొప్పలు చెప్పుకునే బాబు లక్ష ఉద్యోగాలు ఎప్పుడైనా భర్తీ చేశారా ...? అని ప్రశ్నించారు. 

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారన్నారు. మీడియాస్వేచ్చ గురించి చంద్రబాబు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు... కానీ రాష్ర్టంలో మీడియా స్వేఛ్చకు వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. 

ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు అబద్దాలు రాసే వారికి మాత్రమే ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు. ఇప్పటివరకు ఐఅండ్ పిఆర్ కమీషనర్ కు ఉండే అధికారాలు ఇతర శాఖల అదికారులకు ఇచ్చారు తప్పితే నూతనంగా ఎటువంటి నిభందనలు విధించలేదన్నారు. 

బిజేపికి చంద్రబాబు ప్రేమసందేశాలు పంపుతున్నారు. వారు ఆయన ప్రేమసందేశాలను తిరస్కరిస్తున్నా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. బిజేపి నేతలే టిడిపికి చంద్రబాబుకు తలుపులు మూసేశామని చెబుతున్నారని అన్నారు.

టిడిపిని ఏ పార్టీలో అయినా విలీనం చేసే అంశాన్ని పోలీట్ బ్యూరోలో చర్చించారా...? యూటర్న్ లకే గురువు చంద్రబాబు నేడు యూటర్న్ కే యూటర్న్  తీసుకున్నారు.  తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రజలకు చేసిన ద్రోహాలపై ,మోసాలపై ,దోపిడీలపై చర్చిస్తే బాగుండేదంటూ అప్పల్రాజు విరుచుకుపడ్డారు. 
 

click me!