జగన్! చంద్రబాబు వద్ద క్లాస్ తీసుకో!: పంచుమర్తి అనురాధ

వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మిషన్ బిల్డ్ అనేదానికి అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అనే పేరు పెడితే బాగుటుందని అనురాధ జగన్ పై సెటైర్లు వేశారు.


గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ మిషన్ బిల్డ్ పై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అది మిషన్ బిల్డ్ కాదు మరో క్విడ్ ప్రోకోకి తెర అని ఆమె వ్యాఖ్యానించారు. మిషన్ బిల్డ్ పేరుతో ఏపీ అమ్మకానికి పెట్టారని ఆమె వ్యాఖ్యానించారు.

జగన్ తప్ప ప్రభుత్వ భూములు, ఆస్తులు అమ్మే సీఎం రాష్ట్ర ప్రజలకు అవసరం లేదని ఆమె సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఏపీ మిషన్ బిల్డ్ అనే పేరుకి బదులు అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అని పెడితే  ప్రజలకు అర్ధం అవుతుందని వ్యాఖ్యానించారు. సంపద సృష్టించడం చాలా కష్టం అనేది ముఖ్యమంత్రి గ్రహించాలని అన్నారు. సంపద సృష్టించడం చేతగాని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు దగ్గర క్లాసులు తీసుకోవాలని అన్నారు. .

Latest Videos

విజయవాడ లో ప్రభుత్వ ఆస్తులు అమ్మితే సహించేది లేదని అన్నారు. సీఎం వెంటనే ఆస్తులు అమ్మే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అనురాధ డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని   నిర్మాణం కోసం చంద్రబాబు 2లక్షల కోట్ల సంపద సృష్టిస్తే జగన్ దానిని స్మశానం గా మార్చారని వ్యాఖ్యానించారు.

click me!