పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన డొక్కా మాణిక్య వరప్రసాద్...

By Arun Kumar PFirst Published Oct 17, 2019, 4:02 PM IST
Highlights

టిడిపి పాార్టీని వీడుతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి, టిడిపి నాయకులు డొక్కా మాణిక్య వరప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. తెలుగు దేశం పార్టీ నుండి ఆయన వైఎస్సార్‌సిపి  లోకి చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

గుంటూరు: కేబినెట్ నిర్ణయమంటూ రాష్ట్ర ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధించడం మంచి పద్ధతి కాదని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. మీడియా స్వేచ్ఛని హరించే హక్కు ఎవరికి లేదని తెలిపారు. నియంత్రణ ధోరణి మానుకోకపోతే ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. 

గుంటూరులోని టీడీపీ భవన్ లో డొక్కా మీడయా సమావేశం ఏర్పాటుచేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ... ప్రజాసామ్యంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు మాట్లాడే హక్కు లేదా..? మీ ఇష్టానుసారంగా  వ్యవహరిస్తుంటే  చూస్తూ ఉండాలా..? అని ప్రశ్నించారు. 

తాను వైఎస్సార్‌సిపిలోకి వెళ్తున్నానని  గురువారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. తాను టీడీపీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. ఈ పార్టీ  బలోపేతానికే ఇకపై కూడా తాను పనిచేయనున్నట్లు తెలిపారు. 

చేతులెత్తి మెుక్కినా వేధించడం దుర్మార్గం: మంత్రి కొడాలి నానికి డొక్కా కౌంటర్ ...

కొందరు ప్రత్యర్థులు కావాలని తనపై తప్పుగా మాట్లాడుతున్నారని అన్నారు. ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని... తాను అధికారపార్టీలో చేరడంలేదని డొక్కా మాణిక్యవరప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. 

ఇవాళ(గురువారం) ఉదయం ఓ వ్యక్తి తన వద్దకు వచ్చి ఫోటో దిగి వెళ్లాడని... అతడే తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నాడని తెలిసిందన్నారు. ఇప్పటికైతే తనకు పార్టీ మారాలనే ఆలోచనే ఏమాత్రం లేదని...ఒకవేళ మారాలి అనుకుంటే ముందుగా మీతో(మీడియాతో) చెప్పే మారతానని అన్నారు.  ఏ పార్టీలో చేరేది కూడా ముందుగా మీకే చెబుతానని...అప్పటివరకయితే పార్టీ మార్పుపై ఎలాంటి తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చినా నమ్మవద్దని డొక్కా సూచించారు.  

click me!