దేవాలయం పక్కనే బాత్ రూమ్స్... సీఆర్డీఏ అధికారుల చర్యలు

By Arun Kumar PFirst Published Oct 17, 2019, 2:54 PM IST
Highlights

తుళ్లూరు మండలంలో ఓ సామాజికవర్గానికి చెందిన దేవాలయం వద్ద అక్రమంగా నిర్మించిన కట్టడాలను సీఆర్డిఏ అధికారులు కూల్చేశారు. 

గుంటూరు:  తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం గ్రామంలో శివాలయం పక్కనే వున్న అక్రమ నిర్మాణాలపై సీఆర్డిఏ అధికారులు చర్యలు తీసుకున్నారు. పవిత్రమైన దేవాలయం వద్ద స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా అక్కడ బాత్ రూమ్స్ నిర్మించారు. దీంతో స్థానికుల నుండి ఫిర్యాదులు అందుకున్న సీఆర్డిఎ అధికారులు చర్యలు తీసుకున్నారు. 

దేవాలయం పక్కనున్న బాత్ రూమ్స్, క్యాంటీన్ వంటి కట్టడాలను సీఆర్డీఏ అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదనరావు ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుండి కూల్చివేస్తున్నారు. 10 మంది కార్మికులతో ఈకూల్చివేత పనులు జరుగుతున్నాయి. 

ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని     అధికారులు తెలిపారు. అలాంటి కట్టడాలపై సమాచారం అందిస్తే తప్పకుడా చర్యలు తీసుకుంటామని అన్నారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రార్థనా స్థలాలు కూడా కబ్జాకు గురవుతున్నట్లు తమ దృష్టికి వస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు సీఆర్డీఏ అధికారులు తెలిపారు. 
 

click me!