వైఎస్సార్ నవోదయం... ఎంఎస్ఎంఈల పునరుద్ధరణ కోసమే: బుగ్గన

By Arun Kumar PFirst Published Oct 17, 2019, 3:22 PM IST
Highlights

వైఎస్సార్ నవోదయం పథకానికి సంబంధించిన వివరాలను ఏపి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రాభివృద్దితో పాటు నిరుద్యోగ సమస్య తీరునున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 

అమరావతి: వైఎస్సార్ నవోదయ పథకం ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగితను మరింత తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన వెల్లడించారు. అందుకోసమే సీఎం జగన్ ప్రత్యేకంగా శ్రద్ద చూపించి ఈ పథకాన్ని ప్రారంభించారని అన్నారు. 

రాష్ట్ర ఆర్థిక బలోపేతం కోసమే ఈ  వైఎస్సార్ నవోదయ స్కీమ్ ను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. జిడిపిలో వాటా కలిగిన 8 శాతం ఎగుమతుల్లో దాదాపు  40శాతం ఎంఎస్ఎంఈ ద్వారానే  జరుగుతోందన్నారు.

రాష్ట్రంలో లక్షా ఆరువేల ఎంఎస్ఎంఈ లు ఉన్నాయని...వాటిల్లో 11లక్షల మంది  ఉపాధి పొందుతున్నట్లు పొందుతున్నట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈ లల్లో నైపుణ్యం కల ఉద్యోగుల కొరత వుందని... ఇందుకు తగ్గట్లుగా నిరుద్యోగ యువతను ప్రత్యేకంగా తీర్చిదిద్ది ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. 

మార్కెటింగ్ సమస్యతో ఎంఎస్ఎంఈ లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అన్నారు. కానీ రాష్ట్రంలో వ్యవసాయం తరువాత ఎక్కువ ఉపాధి పొందుతున్నట్లు మంత్రి  తెలిపారు.

 వైఎస్సార్ నవోదయం వల్ల ఎంఎస్ఎంఈలు బలోపేతం అవుతాయని అన్నారు. ప్రతి నెల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ లు నిర్వహించి 2లక్షల ఫీజు వరకు ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుందన్నారు.

పునరుద్ధరణలో భాగంగా ఓటీఆర్ లో ఉన్న వారికి ప్రోత్సాహకాలు అందుతుందన్నారు. దాదాపు 85,070 యూనిట్స్ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకున్నాయన్నారు. రూ.3,500 కోట్లు ఓటీఆర్ ద్వారా వైఎస్సార్ నవోదయం కింద బ్యాంకు ల అండతో ఎంఎస్ఎంఈ లకు అందించనున్నట్లు  ఆర్థిక మంత్రి బుగ్గన పేర్కొన్నారు. 

click me!