ఆ మంత్రిని తొలగించేలా జగన్ ప్రభుత్వానికి ఆదేశాలివ్వండి: సీఎస్ కు టిడిపి నేతల ఫిర్యాదు

By Arun Kumar PFirst Published Dec 20, 2019, 8:58 PM IST
Highlights

రాష్ట్ర ప్రభుత్వం పాలనను గాలికొదిలేసి తమ పార్టీకి ప్రచారాన్ని కల్పించుకునే పనిలో మునిగిపోయిందని టిడిపి నాయకులు వర్ల రామయ్య, అశోక్ బాబులు ఆరోపించారు. 

అమరావతి: రాష్ట్రమంత్రిగా ఉండి పచ్చి అబద్ధాలాడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యాలు సీఎస్ నీలం సాహ్నికి ఫిర్యాదు చేశారు. ఆయన్ని మంత్రివర్గం నుంచి తొలగించమని ప్రభుత్వాన్ని ఆదేశించాలని ప్రభుత్వప్రధాన కార్యదర్శికి విజ్ఞప్తిచేశారు. 

శుక్రవారం వీరిద్దరు కలిసి సచివాలయంలో సీఎస్‌ని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రప్రభుత్వం గుడ్డిగా అమలుచేస్తున్న రంగుల రాజకీయానికి కారణమైన రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రితో పాటు ఆశాఖ కమిషనర్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిద్దరి వ్యవహారశైలిపైనే సీఎస్ కు ఫిర్యాదు  చేశామన్నారు. 

ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులేయడం ఏంటని, దీనిపై ప్రభుత్వం ఆదేశాలేమైనా ఇచ్చిందా అని టీడీపీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మండలిలో ప్రశ్నించగా మంత్రి ఇచ్చిన సమాధానాన్ని ఆ సందర్భంగా వారు గుర్తుచేశారు. అటువంటిదేమీ లేదని, ఒక్క భవనానికి కూడా రంగులేయలేదని మంత్రి చెప్పారని... కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతోందని వర్లరామయ్య, అశోక్‌బాబు తెలియ చేశారు. 

Video: జాతీయ రహదారిపై బైఠాయించిన దేవినేని ఉమ

మండలిలో మంత్రి ఇచ్చిన సమాధానప్రతి, రాష్ట్రపంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ జారీచేసిన లెటర్‌ (నెం-751/సీపీఆర్‌ అండ్‌ ఆర్‌డీఎస్‌ 2019) ప్రతితో పాటు రాష్ట్రంలో రంగులువేసిన పంచాయతీభవనాలు, శ్మశానాలు, అన్నక్యాంటీన్ల, ఇతర కార్యాలయాల చిత్రాలను సీఎస్‌కు అందచేశారు. ఈ వ్యవహారం కోర్టులో కూడా ఉందని... హైకోర్టు ఇప్పటికే రంగులువేయడంపై ప్రభుత్వాన్ని హెచ్చరించిందని టీడీపీనేతలు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. రైతుభరోసా సొమ్ముని వైసీపీనేతలు కాజేశారన్నారు. 

అలానే ప్రకాశం జిల్లాలో కౌలు రైతుల ముసుగులో జరిగిన దోపిడీని ఎమ్మెల్సీ అశోక్‌బాబు సీఎస్‌కు తెలియచేశారు. కొందరు వైసీపీ నేతలు తప్పుడు గుర్తింపు కార్డులతో రైతు భరోసా సొమ్ముని కాజేశారని... సదరు నేతలపై వెంటనే చర్యలు తీసుకొవాలన్నారు. సొమ్ముని కోల్పోయిన కౌలురైతులను తక్షణమే ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు. ఇందకు సంబంధించిన వివరాలను అశోక్‌ బాబు సీఎస్‌కు ఇచ్చారు.       

read more విశాఖకు న్యాయం కాదు...అన్యాయం చేసిందే జగన్: కళా వెంకట్రావు

click me!