సైకో నిర్ణయాలతో ప్రజాధనం వృధా... ఎవడబ్బ సొమ్మని...: జగన్ పై టిడిపి అనిత ఫైర్

By Arun Kumar PFirst Published Dec 18, 2019, 3:21 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో సీఎం జగన్ ఓ స్పష్టమైన ప్రకటన చేయకుండా గందరగోళాన్ని సృష్టిస్తున్నారని టిడిపి మాజీ ఎమ్మెల్యే అనిత పేర్కొన్నారు. ఆయన సైకో నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులపాలవుతున్నారని మండిపడ్డారు.  

అమరావతి: అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర రాజధానిపై చేసిన ప్రకటన అందరినీ గందరగోళలోకి నెట్టిందని టిడిపి మాజీ ఎమ్మెల్యే అనిత తెలిపారు. ఇప్పటివరకూ వైసిపిది తుగ్లక్ పాలన  అనుకుంటుంటే ఆ పరిధిని దాటి జగన్ తీరు ఉందన్నారు. భవిష్యత్తులో తుగ్లక్ కు బదులు జగన్ లా వ్యవహరిస్తున్నారు అనే నానుడి ప్రారంభం అవుతుందని ఎద్దేవా చేశారు.

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటున్నారని... అసలు ఆయనకు దాని అర్ధం తెలుసా అని ప్రశ్నించారు.  పాలనా పరమైన సౌలభ్యం కోసం 125ఎకరాలను కొంతమంది కొన్నారని...చాలా మంది వ్యాపారవేత్తలు కూడా అమరావతి ప్రాంతంలో భూములు కొన్నారని అన్నారు. వారందరినీ చంద్రబాబుతో ముడిపెట్టి మాట్లాడటం సమంజసం కాదన్నారు.

హెరిటేజ్ అనేది కూడా ఒక వ్యాపార సంస్థ... వాళ్లు భూములు కొనకూడదా అని ప్రశ్నించారు..14ఎకరాలను ఆ సంస్థ కొనుగోలు చేస్తే చంద్రబాబు కు ఆపాదించడం ఏంటని... ఆయన వ్యక్తిగత అవసరాలకు కొన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

read more చంద్రబాబు, లోకేశ్ మధ్య విబేధాలు... ఇదే నిదర్శనం: పేర్ని నాని

జగన్ ప్రభుత్వం శవ రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకుంటుందన్నారు. జగన్ నిర్ణయం చూసి ప్రజలు తమ దౌర్భాగ్యం అని మాట్లాడుతున్నారని అన్నారు. ఒక రాజధాని నిర్మాణం కోసం డబ్బులు లేవన్నారు కదా మరి మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని ఆమె ప్రశ్నించారు. 

వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు కుటుంబాల మద్య చిచ్చు పెడుతున్నారని... అంతేకాకుండా కులాలు, ప్రాంతాలు అంటూ‌ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చ గొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటే మనం అభివృద్ధి చెందడం కాదు.. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నారు. 

వైజాగ్ లో లూలు, అదానీ గ్రూపు లను వ్యాపారం చేసుకోనివ్వకుండా వెనక్కి పంపేశారని ఆరోపించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ లోని హైకోర్టుకు‌వెళ్లాలంటే అరవై లక్షలు ఖర్చు అవుతుందన్నారు....మరి విశాఖ నుంచి రాయలసీమకు వెళ్లాలంటే ఇంకెంత ఖర్చవుతుందో జగనే చెప్పాలన్నారు. ఎవడబ్బ సొమ్మని ఆయన ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడతారని మండిపడ్డారు. 

read more  కేసీఆర్, జగన్ లకు దొరకని మోడీ అపాయింట్ మెంట్: కారణం ఏమిటి...

విశాఖ కు కంపెనీలు తెచ్చి.. అప్పుడు రాజధానిగా ప్రకటించాలన్నారు. మూడు ప్రాంతాలకు వెళ్లి ప్రజలు పని‌చేయించుకోవడం ఎలా‌ సాధ్యం అవుతుందన్నారు. ఇటీవల తరచూ‌ విశాఖలో విజయసాయి రెడ్డి కనిపిస్తున్నారని...నిన్న జగన్ అసెంబ్లీలో ‌చేసిన ప్రకటన తర్వాత తత్వం తమకు బోధపడిందన్నారు. 

కమిటీ నివేదిక రాకుండా మూడు రాజధానులు ఏమో అని ఎలా చెబుతారని ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి విశాఖలో ఎప్పుడో ఇన్ సైడ్ ట్రేడింగ్ ప్రారంభించేశారని ఆరోపించారు.  అభివృద్ధిలో‌ దూసుకుపోతున్న దేశాలను ఆదర్శంగా తీసుకోవాలి గానీ జగన్ మాత్రం వెనుకబడిన దక్షిణాఫ్రికాను తీసుకోవడం ఏంటని అన్నారు. 

దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు వుండడాన్ని మండేలా‌ వంటి‌ మేధావులే వ్యతిరేకించారని... జగన్ మాత్రం సైకో విధానంతో దాన్ని ఫాలో అవుతున్నారని అన్నారు.  ప్రజలు కూడా జగన్ తీరుపై ధ్వజమెత్తాలని సూచించారు. 

 

click me!