చంద్రబాబు, లోకేశ్ మధ్య విబేధాలు... ఇదే నిదర్శనం: పేర్ని నాని

By Arun Kumar PFirst Published Dec 18, 2019, 2:45 PM IST
Highlights

టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడికి ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ కి మధ్య విబేధాలు  మొదలయ్యాయంటూ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

అమరావతి: తెలుగు దేశం పార్టీలో అంతర్గత విభేదాలున్నాయని... మరీ ముఖ్యంగా అధినేత చంద్రబాబు నాయుడు, తనయుడు లోకేశ్ కి మధ్య అంతరం పెరిగినట్లు తెలుస్తోందని సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. శాసన సభలో తండ్రి చంద్రబాబు ఎస్ అంటే అదే విషయంపై శాసనమండలిలో లోకేష్ నో అంటున్నారని...దీన్ని బట్టే వీరిద్దరి మధ్యా విభేదాలు ఉన్నాయని భావిస్తున్నట్లు తెలిపారు. 

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై అసెంబ్లీలో గగ్గోలు పెట్టిన ఇదే టీడీపీ హయాంలో ఐదుసార్లు ఛార్జీలు పెంచిందని అన్నారు. ఆ విషయం కూడా ప్రజలకు ధైర్యంగా చెప్పి అప్పుడు నిరసన తెలిపితే బావుండేదన్నారు. సెస్సుల పేరిట ప్రజలనెత్తిన భారం మోపిన  చంద్రబాబే ఇప్పుడు  నీతులు చెప్పడం విడ్డూరంగా వుందన్నారు. 

కేవలం ఫోటోలు, వీడియోల్లో కనిపించడమే కాకుండా మీడియా దృష్టిని ఆకర్షించాలనే చంద్రబాబు బ్యాచ్ ఆర్టీసీ ఛార్జీలపై ఆందోళన చేసిందన్నారు. తాము సామాన్యులు,, నిరుపేదలను దృష్టిలో వుంచుకునే మొదటి పది కిలోమీటర్లకు చార్జీలు పెంచలేదన్నారు. దీంతో రోజువారి ప్రయాణాల్లో చాలా తక్కువ మందిపై ఈ  పెంపు భారం పడనుందని నాని వెల్లడించారు. 

read more  జగన్ ట్విస్ట్ ఇస్తాడని అప్పుడే చెప్పా, హైకోర్టు ఒకే కానీ..: బీజేపీ ఎంపీ కామెంట్స్

ఏడురోజుల పాటు సాగిన  శీతాకాల సమావేశాల్లో భాగంగా శాసనసభలో మొత్తం 22 బిల్లులు ప్రవేశ పెట్టి ఆమోదింపచేసుకున్నట్లు తెలిపారు.కౌన్సిల్ లో 20 బిల్లులు ఆమోదం  పొందాయన్నారు. దేశానికే మార్గ దర్శకంగా నిలిచిన అతి కీలకమైన దిశ చట్టాన్ని ఆమోదింపచేసుకున్నామని తెలిపారు. ఈ బిల్లు స్వరూపాన్ని, పొందుపర్చిన అంశాలను  తెలిజేయాలని వివిధ రాష్ట్రాలు తమను కోరుతున్నాయని మంత్రి తెలిపారు. 

పక్కరాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరిగిన ఘటనపై ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ స్పందించి వెంటనే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడం ఆయనకు మహిళా సంరక్షణపై వున్న నిబద్దతను తెలియజేస్తుంది. ఈ చట్టం చేసి దోషులను 21 రోజుల్లో శిక్షించేలా నిర్ణయం తీసుకున్నారు. 

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం కూడా ఊహించని పరిణామమని...దీనివల్ల కార్మికుల ఆశలు నెరవేరాయన్నారు. ఎక్సైజు చట్టంలోని మార్పు చేసి అక్రమాలకు చెక్ పెట్టామని పేర్కొన్నారు. 

read more ఏపి అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముగింపు ...ఏడురోజుల ముఖ్యాంశాలు-ఆమోదించిన బిల్లులు

ఎస్సి, ఎస్టీ కమిషన్ లు వేర్వేరుగా ఉండాలని తాము ప్రయత్నం చేస్తే ప్రతిపక్ష పార్టీలు కౌన్సిల్ లో కాలు అడ్డాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బోధన బిల్లును కూడా టీడీపీ కౌన్సిల్ లో ఆమోదం కానీయకుండా అడ్డుకుందన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు ఇది ఉదాహరణ అని అన్నారు. 


 

click me!