ఆంధ్ర ప్రదేశ్ శీతాకాల సమావేశాలు ఇవాళ్టితో (మంగళవారం) ముగిశాయి. ఈ నేపథ్యంలో ఈ సమావేశాల్లో చర్చించిన ముఖ్యమైన అంశాలు, ప్రవేశపెట్టి ఆమోదింపబడిన బిల్లులు ఏమిటో తెలుసుకుందాం.
తొలి రోజు- డిసెంబరు 9, 2019
1) మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే... 21 రోజుల్లో మరణ శిక్ష పడుతుందనే భయం రావాలి. ఇందుకోసం విప్లవాత్మకమైన చట్టం తీసుకొస్తాం: ముఖ్యమంత్రి వైయస్ జగన్
2) ఏపీలో మాత్రమే ఉల్లి కిలో రూ. 25కే: ముఖ్యమంత్రి వైయస్ జగన్
undefined
రెండో రోజు- డిసెంబరు 10, 2019
1) రైతు పక్షపాత ప్రభుత్వం తమదని... రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, పంటలకు కనీస గిట్టుబాటు ధరలు కల్పిస్తాం. ప్రకటించిన రేటు కంటే రైతులు తక్కువకు అమ్ముకోవాల్సిన పనిలేదు: ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రకటన
2) నాణ్యమైన బియ్యమే ఇస్తాం, శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టు కొనసాగుతోంది, పేదల బియ్యాన్ని అమ్ముకోకుండా తినగలిగేలా ఇస్తున్నాం: ముఖ్యమంత్రి వైయస్ జగన్
మూడో రోజు- డిసెంబరు 11, 2019
1) గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో విప్లవాత్మక మార్పు, దేశంలో ఎక్కడా జరగని విధంగా నాలుగు నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు, ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 82.5 శాతం
సచివాలయ ఉద్యోగాల ద్వారా 1, 28,858మందికి అపాయింట్ మెంట్లు, ఇందులో 51.9 శాతం బీసీలు, వీటికి అనుబంధంగా 2.65 లక్షలకు పైగా వలంటీర్లు నియామకం
-11,158 గ్రామ, 3786 వార్డు సచివాలయాలు.. మొత్తం 15 వేలు ఏర్పాటు.
- ప్రతి 2 వేల మందికి ఒక గ్రామ సెక్రటేరియేట్.. ప్రతి 50 ఇళ్ళకు ఒక వలంటీర్లు
2) నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకేః ముఖ్యమంత్రి వైయస్ జగన్
సలహాదారులవి నామినేటెడ్ పోస్టులు కావు
కేబినెట్ లో 60 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే, 5 గురు ఉప ముఖ్యమంత్రులలో నలుగురు ఆ వర్గాల వారే..
3) 50 రోజుల్లో సీమ ప్రాజెక్టులు నిండేలా ప్రణాళికః ముఖ్యమంత్రి వైయస్ జగన్
4) అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటాంః హోం మంత్రి సుచరిత
రాష్ట్రంలో 11, 57,497 మంది డిపాజిటర్ల నుంచి రూ. 3,944.70 కోట్లు వసూలు చేసింది
అగ్రిగోల్డ్ స్థిర, చర ఆస్తుల విలువః రూ. 3,785 కోట్లు అంచనా
2019-20 బడ్జెట్ లో రూ. 1150 కోట్లు కేటాయించి... మొదటివిడతగా 3, 69,655 మందికి సుమారు రూ. 264 కోట్లు అందించాం
త్వరలో 20 వేలు అంతకంటే తక్కువ మొత్తం డిపాజిట్ చేసిన వారినీ ఆదుకుంటాం. దీనివల్ల 3.40 లక్షల మందికి మేలు జరుగుతుంది.
కేబినెట్ వివరాలుః
1)ఏపీ దిశ యాక్ట్ -2019ః మహిళలపై అత్యాచారం లాంటి క్రూరమైన నేరాలకు పాల్పడితే ఉరిశిక్షః కేబినెట్ ఆమోదం
- మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించి.. వారం రోజుల్లో దర్యాప్తు.. 14 రోజుల్లో విచారణ పూర్తి. మహిళలు, బాలికల భద్రత కోసం ఏపీ దిశ యాక్ట్.. ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం.
2) రాజధానిలో అసైన్డ్ ప్లాట్ల కేటాయింపులు రద్దు
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతంలో కొందరు నేతలు దళితుల నుంచి అసైన్డ్ భూములు కొని.. ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చి, అందుకు బదులుగా పొందిన రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్ల కేటాయింపుల రద్దుకు కేబినెట్ ఆమోదం.
4వ రోజు- డిసెంబరు 12, 2019
1) పేదల జీవితాల్లో మార్పు కోసమే ఇంగ్లీషు మీడియంః ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధనపై చర్చలో సీఎం జగన్
- ఇంగ్లీషు మీడియం మీ పిల్లలకేనే.. పేదలకు అక్కర్లేదా..
-44 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే.. వాటిలో 66 శాతం స్కూళ్ళలో తెలుగు మీడియం ఉంది.
- కేవలం 34 శాతం స్కూళ్ళు మాత్రమే ఇంగ్లీషు మీడియంలో ఉన్నాయి.
-ప్రైవేటు స్కూళ్ళలో 95 శాతం ఇంగ్లీషు మీడియంలోనే బోధిస్తున్నారు.
- ప్రభుత్వ పాఠశాలల్లో చూస్తే 1 నుంచి 6వ తరగతి వరకు 28 శాతమే ఇంగ్లీషు మీడియంలో ఉన్నాయి.
-నాడు-నేడు కార్యక్రమం కింద రాష్ట్రంలోని 44 వేల స్కూళ్ళను బాగు చేస్తున్నాం
-తొలి దశలో 15,715 స్కూళ్ళు బాగు చేస్తున్నాం. అందుకోసం రూ. 3,600 కోట్లు కేటాయించాం.
-మంచినీరు, ప్రహరీ, లైట్లు, ఫ్యాన్లు, వంటి మొత్తం 9 రకాల సదుపాయాలు కల్పిస్తున్నాం.
-నాడు-నేడుతోపాటు ఇంగ్లీషు మీడియం, జనవరి 9న అమ్మ ఒడితో విప్లవాత్మక మార్పు రాబోతోంది.
- 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ సగటు నిరక్షరాస్యత 27 శాతం ఉంటే.. రాష్ట్రంలో అది 33 శాతంగా ఉంది.
- తెలుగుని తప్పనిసరి సబ్జెక్టు చేస్తాం..
5వ రోజు- డిసెంబరు 13, 2019
1) మృగాళ్ళకు ఇక మరణ శాసనమేః ఏపీ దిశ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం
-మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఉరిశిక్షే..
-దిశ చట్టం విప్లవాత్మకంః అత్యాచారం ఆలోచన వస్తే.. వెన్నులో వణుకు పుట్టాలిః ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్
-మీ ఇంట్లో ఒక తండ్రి, అన్నలా ఆలోచించి ఈ చట్టం తీసుకొచ్చానుః ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్
-21 పని దినాల్లో తీర్పు
-7 పని దినాల్లో దర్యాప్తు పూర్తి
-14 పని దినాల్లో న్యాయ విచారణ
-పిల్లలపై లైంగిక వేధింపులకు గరిష్టంగా జీవిత ఖైదు
-సోషల్ మీడియాలో మహిళల్ని వేధిస్తే 2 నుంచి 4 ఏళ్ళ జైలు
-ఇందుకోసం ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ లా చట్టం-1973ను రాష్ట్రానికి వర్తించేయడంతో పాటు అందులో అవసరమైన సవరణలు చేస్తూ రూపొందించిన ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం-క్రిమినల్ లా (సవరణ)
బిల్లు-2019ను శాసనసభ ఆమోదించింది.
2) మహిళలు, చిన్నారులపై దాడుల విచారణకు ప్రత్యేక కోర్టుల బిల్లు-2019కి ఆమోదం
- త్వరితగతిన విచారణకు జిల్లాకో ప్రత్యేక కోర్టు ఏర్పాటు
-అత్యాచారాలు వంటి నేరాలపై అప్పీలు గడువు 45 రోజులకు కుదింపు
- దేశంలోనే మొదటిసారిగా 13 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తున్నాంః ముఖ్యమంత్రి వైయస్ జగన్
- దిశ చట్టంపై దేశమంతా చర్చ జరిగి మిగతా రాష్ట్రాలూ ఆలోచిస్తాయిః ముఖ్యమంత్రి వైయస్ జగన్
- ఇప్పటివరకూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ మహిళలు, పిల్లలపై నేరాల సత్వర విచారణకు జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు లేవు. దేశ చరిత్రలో తొలిసారిగా మహిళలు, పిల్లలపై నేరాల విచారణకు.. త్వరితగతిన విచారణ
ప్రక్రియ ముగించేందుకు ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తున్నారు.
- ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం- మహిళలు, బాలికలపై నిర్దేశిత నేరాల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల బిల్లు-2019ను రాష్ట్ర శాసనసభ ఆమోదించింది.
- అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్ దాడులు, సోషల్ మీడియా ద్వారా వేధించటం వంటి నేరాలు, పోక్సో పరిధిలోకి వచ్చే నేరాల్ని ఈ ప్రత్యేక కోర్టులు విచారిస్తాయి. ఈ నేరాలపై దోషులు పై కోర్టుకు వెళ్ళి అప్పీలు చేసుకునే గడువు.. కేంద్ర ప్రభుత్వ చట్టంలో 6 నెలలుగా ఉండగా.. ఇప్పుడు మన రాష్ట్రం పరిధిలో కేవలం 45 రోజులకు తగ్గించారు.
- మహిళలు, పిల్లలపై నేరాలు నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ రిజిస్ట్రీని కొనసాగిస్తోంది. అయితే జరిగిన నేరాలు, దాంతో సంబంధం ఉన్న వ్యక్తుల పేర్లు వంటి వివరాలను బహిర్గతం చేసే
అవకాశం లేదు. అలాంటి డిజిటల్ రిజిస్ట్రీని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా నేరాలకు సంబంధించిన వివరాలు ప్రజలందరికీ అందుబాటులో ఉంచడం ద్వారా నేరస్తుల వివరాలు బహిర్గతం చేయబోతున్నారు.
ఆరవ రోజు- డిసెంబరు 16, 2019
రాష్ట్ర శాసనసభలో కీలక బిల్లులకు ఆమోదంః ప్రతి అడుగు విప్లవాత్మకమే..
రాష్ట్ర శాసనసభలో ఒక్క రోజే 16 కీలక బిల్లులు.. మరో చారిత్రక ఘట్టానికి వేదికైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ
సోమవారం ఆమోదం పొందిన బిల్లులు.. వాటి ఉద్దేశాలు..
►ఇక ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులే
►ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం
►బిల్లు: ప్రభుత్వ సర్వీసుల్లోకి ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు
ఉద్దేశం: ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేయడం.. ఆ సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకునేలా ప్రత్యేకంగా ప్రజా రవాణా విభాగాన్ని ఏర్పాటు చేయడం.
►ఆర్టీసీకి చెందిన దాదాపు 52 వేల మంది దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేయడం.. వారిని ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకునేలా ప్రత్యేకంగా ప్రజా రవాణా విభాగాన్ని ఏర్పాటు చేయడం.
►జనవరి 1వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులే. ప్రతి ఉద్యోగీ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. ఈ చరిత్రాత్మక నిర్ణయం వల్ల, ఎప్పటి నుంచో ఉద్యోగులు కోరుకుంటున్న,
ఏ ప్రభుత్వం కూడా చేయడానికి ముందుకు రాని ఈ పని.. మా హయాంలో, మా ప్రభుత్వంలో జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది... అని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ అన్నారు.
- ఆర్టీసీ గురించి చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు.
- ప్రభుత్వరంగ సంస్థ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం కాకుండా చంద్రబాబు 1997లో చట్టం తెచ్చి.. ఆర్టీసీ విలీనం కాకుండా అడ్డుకున్నారు.
-అందుకే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ చారిత్రాత్మకమైన ఈ బిల్లును ప్రవేశపెట్టాం..
- ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ వయో పరిమితి 58 నుంచి 60కు పెంపు.
- ఆర్టీసీ ఉద్యోగుల జీతాల కోసం రూ. 3600 కోట్లు
►బిల్లు : ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్–1982 సవరణ
ఉద్దేశం: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యార్థులకు భోదన.. ధనిక, మధ్యతరగతి, పేద అనే తేడా లేకుండా అందరికీ నాణ్యమైన విద్యను అందించడం.. ఉన్నత
శిఖరాలను అధిరోహించడానికి దోహదం చేయడం.. అన్ని తరగతుల్లోనూ తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయడం.
►వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం- ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంలో భోదన
రాష్ట్రంలో 45 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 1 నుంచి 6వ తరగతి వరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం కాబోతున్నాయి. ఆ తర్వాత వరుస సంవత్సరాలలో 7, 8, 9, 10
తరగతులను ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తున్నాం. నాలుగేళ్లలో మన పిల్లలందరూ 10వ తరగతి బోర్డు పరీక్ష ఇంగ్లిష్‌లో రాసేలా ఈ బిల్లు మార్చబోతున్నది. ఇది ఒక చరిత్రాత్మక బిల్లు.
►పిల్లలందరికీ ఇంగ్లిష్ మీడియం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన.. ధనిక, పేద అనే తేడా లేకుండా విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య. అన్ని తరగతుల్లోనూ తెలుగు సబ్జెక్టు తప్పనిసరి.
-ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు భోదన
- ధనిక, మధ్యతరగతి పేద అనే తేడా లేకుండా విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య.
- ప్రతి పేదవాడికీ ఇక మీదట ఇంగ్లీషు మీడియం చదువుః ప్రతి పేదవాడికీ ఇంగ్లీషు మీడియం తన సొత్తు అవుతుందిః ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్
- రైట్ టు ఎడ్యుకేషన్.. రైట్ టు ఇంగ్లీషు ఎడ్యుకేషన్ కల నెరవేరబోతోందిః ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్
- ఇదో చారిత్రాత్మకంః ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్
---
►బిల్లు : ఎస్సీ కమిషన్
ఉద్దేశం: ఎస్సీ వర్గాల ప్రజల ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించడం.
ఇవాళ మేము మరో విప్లవాత్మక బిల్లును తెస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా రెండు కమిషన్లు తీసుకొస్తున్నాం. వారి అభివృద్ధి పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని, వారి సమస్యల మీద లోతుగా అధ్యయనం
చేయాలని, వారి సమస్యలకు సత్వర పరిష్కారం కనుగొనాలనే తపన, తాపత్రయంతో ఈ పని చేస్తున్నాం... అని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ చెప్పారు.
---
►బిల్లు : ఎస్టీ కమిషన్
ఉద్దేశం: ఎస్టీ వర్గాల ప్రజల ప్రయోజనాలను సమర్థవంతంగా పరిరక్షించడం.
---
►బిల్లు : చిరుధాన్యాల(మిల్లెట్స్) బోర్డు ఏర్పాటు
ఉద్దేశం: చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం.. ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం.. పౌష్టికాహారాన్ని అందించడం.
---
►బిల్లు: పప్పుధాన్యాల(పల్సస్) బోర్డు ఏర్పాటు
ఉద్దేశం: పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించడం.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం.. ధరలు పెరగడకుండా నియంత్రించడం..
ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం.. పౌష్టికాహారాన్ని అందించడం.
---
►బిల్లు: ఆంధ్రప్రదేశ్ మద్యనిషేధ చట్టం–1995కు సవరణ
ఉద్దేశం: అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేయడం.. అలాంటి నేరానికి తొలిసారి పాల్పడితే రూ.రెండు లక్షల జరిమానా.. రెండోసారి నేరానికి పాల్పడితే రూ.5 లక్షల జరిమానా.
మద్యం ముట్టుకోవాలంటే షాక్ కొట్టాల్సిందేః ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్
- మేము అధికారంలోకి రాక ముందు 43 వేల బెల్టు షాపులుండేవి. వాటిలో ఒక్క బెల్టు షాపు కూడా లేకుండా చేశాం. పర్మిట్ రూమ్‌లను ఎత్తివేశాం. మద్యం దుకాణాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చాం.
అమ్మకాల సమయాన్ని కూడా కుదించాం. ముట్టుకుంటే షాక్ కొట్టేలా ధరలు సైతం పెంచాం... అని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ చెప్పారు.
►మద్యపాన నిషేధం దిశగా వేగంగా అడుగులు
అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేయడం.. అలాంటి నేరానికి తొలిసారి పాల్పడితే రూ.2 లక్షల జరిమానా.. రెండోసారి అయితే రూ.5 లక్షల జరిమానా.
►ఇప్పటికే దాదాపు 25 శాతం దుకాణాల తగ్గింపు.
► గతంలో 840 బార్లు ఉండగా వాటిని 487కి తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేశాం
►మద్యం అమ్మకాల సమయాన్ని కుదించాం. అంతకు ముందు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయాలని చెబుతూ రాత్రి 11, 12 గంటల వరకు కూడా విక్రయించేవారు. ఇవాళ ప్రభుత్వం
మద్యం షాపులను ఉదయం 11 నుంచి సాయంత్రం 8 గంటల వరకే తెరుస్తోంది.
►మద్యం, డ్రగ్స్ అనర్ధాలపై విద్యార్థులకు పాఠ్యాంశాలు
►అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు
►నాన్ బెయిలబుల్ కేసులు... రూ.లక్షల్లో జరిమానాలు బార్లలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే రెండు రెట్ల లైసెన్స్ ఫీజు వసూలు
►రెండోసారి నేరం చేస్తే నిర్మొహమాటంగా లైసెన్సుల రద్దు
►14 వేలకు పైగా మహిళా పోలీసులు గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్నారు. వాళ్లు గ్రామాల్లో పోలీసింగ్ చేస్తున్నారు.
► ప్రతి జిల్లాలో డీఅడిక్షన్ కేంద్రాల ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని 2019 సెప్టెంబరు 25న జీవో ఇచ్చాం.
► అసెంబ్లీలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 43 వేల బెల్టు షాపులుండేవి. గతంలో ప్రభుత్వ పాలసీ ఎలా ఉండేదంటే విక్రయాలు నెలకు 15 శాతం చొప్పున
పెరగాలని టార్గెట్ విధించేవారు. అలా విక్రయాలు పెంచితే ప్రోత్సాహకాలు కూడా ఇచ్చేవారు. సాక్షాత్తూ ప్రభుత్వమే అలా టార్గెట్లు పెట్టడంతో ఎక్సైజ్ శాఖపై ఒత్తిడి ఉండేది. షాపులు కూడా ప్రైవేట్ వ్యక్తుల
చేతుల్లో ఉండడంతో విక్రయాలు పెంచేందుకు యథేచ్ఛగా బడి, గుడి.. ఎక్కడబడితే అక్కడ కనీసం 10 బెల్టు షాపులు నడిపించే వారు. అలా రాష్ట్రంలో 43 వేల బెల్టుషాపులు నడిపారు. మద్యం అమ్మకాలను
గ్రామ స్థాయికి తీసుకెళ్లి ప్రతి మనిషిని తాగుబోతుగా చేయాలనే ఆలోచనతో జరిగిన ప్రక్రియ అది. మేం అధికారంలోకి వచ్చాక ఒక్క బెల్టు షాపు కూడా లేకుండా చేశామని చెప్పారు.
►ఐఎంఎల్, బీర్ల విక్రయాలపై ఇవీ వాస్తవాలు..
2018తో పోల్చితే 2019లో సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో మద్యం అమ్మకాలు తగ్గాయి. ఇండియన్ మేడ్ లిక్కర్ (ఐఎంఎల్) సెప్టెంబరు 2018లో 34.20 లక్షల కేసులు అమ్ముడు కాగా అవి
సెప్టెంబరు 2019 నాటికి 22.26 లక్షల కేసులకు పడిపోయాయి. అంటే ఐఎంఎల్ అమ్మకాలు 34.92 శాతం తగ్గాయి. అదే సమయంలో అంటే 2018 సెప్టెంబరులో బీర్లు 22.19 లక్షల కేసులు అమ్ముడు
పోగా 2019 సెప్టెంబరులో అవి 16.46 లక్షల కేసులకు పడిపోయాయి. అంటే బీర్ల అమ్మకాలు 34.84 శాతం తగ్గాయి.
► ఐఎంఎల్ అమ్మకాలు 2018 అక్టోబరులో 32.28 లక్షల కేసులు కాగా 2019 అక్టోబరులో అవి 24.18 లక్షల కేసులకు పడిపోయాయి. అంటే 25.11 శాతం అమ్మకాలు తగ్గాయి. 2018 అక్టోబరులో 23.86
లక్షల కేసుల బీరు అమ్ముడు పోగా 2019 అక్టోబరులో కేవలం 10.59 లక్షల కేసుల బీరు మాత్రమే అమ్ముడైంది. అంటే బీర్ల అమ్మకాలు 55.62 శాతం తగ్గాయి.
► 2018 నవంబరులో ఐఎంఎల్ 29.62 లక్షల కేసులు అమ్ముడుపోగా, 2019 నవంబరులో కేవలం 22.62 లక్షల కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే ఆ సమయంలో లిక్కర్ అమ్మకాలు 23.63
శాతం తగ్గాయి. ఇక బీర్ల అమ్మకాలు 2018 నవంబరులో 17.80 లక్షల కేసులు కాగా సరిగ్గా ఏడాది తర్వాత 2019 నవంబరులో కేవలం 8.15 లక్షల కేసుల బీరు మాత్రమే అమ్ముడు పోయింది. అంటే బీర్ల
అమ్మకాలు 54.22% తగ్గాయి.
----
►బిల్లు: ఆంధ్రప్రదేశ్ ఆబ్కారీ చట్టం–1968కు సవరణ
ఉద్దేశం: బార్‌లలో అక్రమ, సుంకం చెల్లించని మద్యం విక్రయం.. సరిహద్దుల నుంచి అక్రమ రవాణా.. ఇలాంటి నేరాలకు తొలిసారి పాల్పడితే హెచ్చరికతోపాటు లైసెన్స్ ఫీజుకు రెండు రెట్లు జరిమానా..
రెండోసారి పాల్పడితే బార్ లైసెన్స్ రద్దు, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు.
---
►బిల్లు: కర్నూలులో క్లస్టర్ యునివర్సిటీ ఏర్పాటు
ఉద్దేశం: కర్నూలులో సిల్వర్ జూబ్లీ కాలేజీ, కేవీఆర్ ప్రభుత్వ బాలికల డిగ్రీ కాలేజీలను విలీనం చేసి క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం.. విద్యార్థులకు ఉపాధి కల్పన సామర్థ్యాలు, నైపుణ్యాలను పెంచేలా
నాణ్యమైన విద్యను అందించడం.
---
►బిల్లు: జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, లలిత కళల విశ్వవిద్యాలయం చట్టం సవరణ
ఉద్దేశం: వైఎస్సార్ ఆర్కిటెక్చర్, లలిత కళల విశ్వవిద్యాలయం కడపలో ఏర్పాటు చేయడం.
---
►బిల్లు: ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల చట్టాల సవరణ బిల్లు
ఉద్దేశం: విశ్వవిద్యాలయాల పాలక మండళ్లలో ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్/ప్రతినిధి ఎక్స్–అఫీషియో సభ్యునిగా నియామకం.
---
►బిల్లు: ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల చట్టాల రెండో సవరణ బిల్లు
ఉద్దేశం: విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్‌లర్ (ఉప కులపతులు)ల నియామక నిబంధనల్లో మార్పులు
---
►బిల్లు: ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల రెండో సవరణ బిల్లు
ఉద్దేశం: సహకార సంఘాల పాలక మండలి ఎన్నికల్లో కుష్టు వ్యాధిగ్రస్తులు, మూగ, చెవిటి వారికి పోటీ చేసే అవకాశం కల్పించడం.
---
►ఏపీ వృత్తిదారులు, వ్యాపారులు, ఉద్యోగుల వృత్తిపన్ను చట్టం సవరణ బిల్లు–2019
---
►ఏపీ జీఎస్టీ సవరణ బిల్లు–2019
---
►ఏపీ మున్సిపల్ చట్టం సవరణ బిల్లు–2019
----------
►అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేకు రూ.100 కోట్లు: మంత్రి ధర్మాన కృష్ణదాస్
అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే కోసం రూ.100 కోట్లు కేటాయించామని రాష్ట్ర ఆర్అండ్‌బి శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేకు అవసరమైన మేరకు
మరిన్ని నిధులు కేటాయించేందుకు సిద్థంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.
- ఈ హైవే కోసం భూమిని సేకరించాల్సి ఉందని చెప్పారు. దీని నిర్మాణం కోసం ఇప్పటికే భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చామని మంత్రి తెలిపారు.
- అటవీశాఖ నుంచి కూడా అనుమతులు తీసుకుంటున్నామని కృష్ణదాస్ గుర్తు చేశారు.
- ట్రాఫిక్ అవసరాలను బట్టి హైవే ఎన్ని లైన్లతో వుండాలనేది పరిగణలోకి తీసుకుంటున్నామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.
-------
రాజధానిలో..
►‘పీవోటీ’ని ఉల్లంఘించి థర్డ్ పార్టీలకు ప్లాట్లు: మంత్రి బొత్స
- రాజధాని అమరావతి భూ సమీకరణ ప్రక్రియలో పీవోటీ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్) చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ ఎస్సీలు, ఇతర బలహీన వర్గాలు సాగు చేసుకునేందుకు ఇచ్చిన వ్యవసాయ భూములకు
బదులుగా కొందరు థర్డ్ పార్టీ వ్యక్తులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు విచారణలో నిర్ధారణ అయిందని ‘రాజధాని అమరావతి’పై శాసనమండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి బొత్స సత్యనారాయణ
తెలిపారు.
- అసైన్డ్ భూమి కలిగి ఉన్న వ్యక్తులు తెల్ల కాగితంపై సంతకం చేసి ఇచ్చినా ప్రామాణికంగా తీసుకొని ఆ భూమికి బదులుగా థర్డ్ పార్టీ వ్యక్తులకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసేందుకు సీఆర్‌డీఏ అనుమతిచ్చిందని, ఇది
పూర్తిగా పీవోటీ చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు.
- 455 మంది అసైన్డ్ రైతులకు సంబంధించి 289 ఎకరాల భూమికి బదులుగా 1,68,300 చదరపు అడుగుల మేర ప్లాట్లు ధర్డ్ పార్టీ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఇప్పటివరకు జరిగిన విచారణలో
తేలిందన్నారు.
- సీఆర్‌డీఏ పరిధిలోని మొత్తం 2,600 ఎకరాల అసైన్డ్ భూములపై విచారణ కొనసాగుతుందని బొత్స స్పష్టం చేశారు.
- సీఆర్‌డీఏ పరిధిని మొదట 217 చదరపు కిలోమీటర్లగా నిర్ధారించి తర్వాత చంద్రబాబు.. వియ్యంకుడికి భూ కేటాయింపులపై గత ప్రభుత్వం జీవో విడుదల చేశాక వారికి ప్రయోజనం చేకూర్చేలా సీఆర్‌డీఏ
పరిధిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
- అమరావతిలో దురాక్రమణ, అవినీతి, దోపీడీ జరిగిందని మంత్రి బొత్స చెప్పారు.
- గత ప్రభుత్వం చట్టాలను విస్మరించి భూములు లాక్కుంది. చట్ట ప్రకారం అసైన్డ్ భూములు కొనుగోలు చేయకూడదు. మొదట్లో సీఆర్‌డీఏ పరిధి 217 కిలోమీటర్లుగా నిర్ణయించారు. అయితే చంద్రబాబు
బంధువు కోసం పరిధిని పెంచి 498 ఎకరాలు కేటాయించారు.
- ఎకరం రూ.లక్ష చొప్పున చంద్రబాబు తన బంధువుకు కేటాయించారు.
- ఇక తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం కోసం 102 అడుగులు పిల్లర్లు వేశారు. దీనివల్ల ఖర్చు పెరిగింది.
------
ఇళ్ళ నిర్మాణంలో రూ. 2,626 కోట్ల దోపిడీః మంత్రి బొత్స సత్యనారాయణ
-టిడ్కో ద్వారా 5 లక్షల ఇళ్ళ నిర్మాణానికి పరిపాలన అనుమతులిచ్చినా.. 3,09,432 ఇళ్ళకు టెండర్లు పిలిచి, చివరకు 77,371 గృహ నిర్మాణాలను చేపట్టారు. 90 శాతం పూర్తైన ఇళ్ళు 77,371 మాత్రమే.
-చంద్రబాబు హయాంలో కాంట్రాక్టు సంస్థలతో కుమ్మక్కై ఇళ్ళ నిర్మాణంలో రూ. 2,626 కోట్లు దోపిడీ చేశారు.
- గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై రివర్స్ టెండరింగ్ ద్వారా రెండు దఫాలుగా రూ. 1000 కోట్ల విలువైన ఇళ్ళ నిర్మాణానికి టెండర్లు పిలిచి రూ. 150 కోట్లు ఆదా.
- మా ప్రభుత్వం పేదలకు 300 చ. అడుగుల ఇళ్ళను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది.
ఏడవ రోజు- డిసెంబరు 17, 2019
రాజధానిపై చర్చః ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మా టల్లోనే..
- గత ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని డిసైడ్ చేశారు.. ఆయన లెక్క ప్రకారం 53వేల ఎకరాల్లో కట్టాలంటే.. ఎకరాకు మౌలిక సదుపాయాల కోసం రెండు కోట్ల రూపాయలు చొప్పున ఖర్చు అయితే.. మొత్తం లక్షా 9 వేల కోట్లు అని తేల్చాడు.
- అయితే గత 5 ఏళ్ళలో రూ. 5,800 కోట్లు మాత్రమే చంద్రబాబు ఖర్చు పెట్టాడు.- రాజధాని బాండ్స్ పేరుతో 10.35 శాతం వడ్డీకి అప్పులు తెచ్చారు. ఇప్పటి వరకూ రాజధాని పేరుతో తెచ్చిన అప్పులకు దాదాపు వడ్డీనే రూ. 700 కోట్లు ప్రతి ఏటా కట్టాలి
- రాజధానిలో ఇప్పటివరకూ 5 వేల కోట్లు ఖర్చు పెడితే.. మిగతా లక్ష కోట్ల డబ్బులు ఎక్కడ నుంచి తేవాలి. వాటికి వడ్డీ ఎంత అవుతుంది. వడ్డీ అయినా కట్టే పరిస్థితి ఉందా..
- నాకు కూడా కట్టాలనే ఉంది. కానీ, లక్ష కోట్లు ఎక్కడ నుంచి తేవాలి.. ఎక్కడ ఖర్చు పెట్టాలి అనే ఆలోచన ఉంది
- పోలవరం ప్రాజెక్టు నుంచి బొల్లాపల్లిలో రిజర్వాయర్ కట్టి.. దాని ద్వారా పులిచింతల నింపడం.. రాయలసీమలోని బనకచర్లకు నీళ్ళు తెచ్చే భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రూ. 55 వేల నుంచి 60 వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా.
- ఈరోడు భారీ వర్షాలు పడినా.. వరదలు వచ్చినా.. రాయలసీమలో డ్యామ్ లు నిండలేదు. రాయలసీమలో డ్యామ్ లు నింపాలంటే ప్రాజెక్టుల కోసం రూ. 23 వేల కోట్లు కావాలి.
- రాష్ట్రంలో తాగడానికి డ్రింకింగ్ వాటర్ లేని పరిస్థితి. గోదావరి జిల్లాల్లో కూడా కలుషితమైన నీరు తాగుతున్నారు.
- పోలవరం, ధవళేశ్వరం నుంచి తాగు నీటి ని తీసుకు రావాలంటే.. గోదావరిలోనే ఒక్కొక్క జిల్లాకు రూ. 4 వేల కోట్లు కావాలి.
- రాష్ట్రవ్యాప్తంగా తాగు నీటి కోసం రూ. 40 వేల కోట్లు కావాలి
- మరోవైపు నాడు- నేడు కార్యక్రమం కింద.. శిధిలావస్థలో ఉన్న స్కూళ్ళు, ఆసుపత్రులు అభివృద్ధి చేస్తున్నాం.
- స్కూళ్ళ బాగు కోసమే రూ. 14 వేల కోట్లు కావాలి
- ఆసుపత్రులు బాగు చేయడం కోసం రూ. 30 వేల కోట్లు కావాలి.
- రాజధానిలో కేవలం 20 కిలో మీటర్ల పరిధిలో.. లక్ష కోట్లో.. రూ. 3 లక్షల కోట్లో.. నాలుగు లక్షల కోట్లో ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది.
- భవిష్యత్తు కోసం.. మనం వేసే ప్రతి అడుగూ ఆలోచన చేసే వేయాలి
- సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు గారు చెప్పినట్టు.. డీ సెంట్రలైజ్ అనేది నిజమైన కాన్సెప్ట్.. సౌత్ ఆఫ్రికా లో మూడు క్యాపిటల్ లు ఉన్నాయి
-ఇందులో భాగంగనే..- విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావచ్చు , కర్నూలులో హైకోర్టు.. జ్యుడీషియల్ క్యాపిటల్ రావచ్చు, ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ కు బహుశా మూడు క్యాపిటల్ వస్తాయేమో. ..
- విశాఖలో మెట్రో రైలు వేస్తే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా సరిపోతుంది. ఇటువంటి ఆలోచనలు చేయడానికే కమిటీలు వేశాం. కొద్ది రోజుల్లో కమిటీ నివేదిక వస్తుంది.
- అధ్యయనం కోసం.. మొత్తం మూడు సంస్థలకు అప్పగించాం.
- ఆ సంస్థలు సుదీర్ఘంగా ఆలోచన చేసి.. నివేదిక ఇచ్చాక.. మంచి నిర్ణయం తీసుకుంటాం. మన పిల్లల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం తీసుకోవాలి.
అసెంబ్లీ సాక్షిగా.. రాజధానిలో చంద్రబాబు ఇన్ సైడర్ ట్రేడింగ్ బట్టబయలు
- రాజధాని అమరావతిలో చంద్రబాబు నాయుడు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్లు ఆధారాలతో సహా ఆర్థిక మంత్రి శ్రీ బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి ప్రెజెంటేషన్ ద్వారా మంగళవారం అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారు.
చంద్రబాబు ఏ విధంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారంటే.. బుగ్గన మాటల్లోనే
- రాష్ట్ర విభజన జరిగినతర్వాత 10 ఏళ్ళు చాలా కీలకం. అటువంటిది విభజన తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు.. వరల్డ్ క్లాస్ రాజధాని కడతానని ప్రగల్భాలు పలికి జూన్ 1, 2014 నుంచి డిసెంబరు 31, 2014 మధ్య 4070 ఎకరాలు తన కుటుంబం, తన బినామీలు, టీడీపీ నేతల చేత ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేయించాడు.
- ఇది కచ్చితంగా చంద్రబాబు రాజ ధర్మాన్ని ఉల్లంఘించటమే.
- రాజధాని ప్రాంతంలో ఇంత భారీగా భూములు కొన్నవారిలో స్థానికులు ఎవరూ లేరు
- మొదట గుంటూరు.. ఆ తర్వాత నూజివీడు.. అని ప్రజలను తప్పు దారి పట్టించి.. చివరికి అమరావతిని చంద్రబాబు ప్రకటించారు.
- దళితులను బెదిరించి అసైన్డ్ భూములు లాక్కున్నారు. వాస్తవానికి అయితే ఆ విధంగా దళితుల భూములు లాక్కున్నవారిపై ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్ యాక్ట్ పెట్టాలి.
- లేని లంక భూములను ఉన్నట్టు సృష్టించి దోచేశారు.
- ప్రభుత్వ భూములను తమ భూములుగా చూపించి టీడీపీ నేతలు కోట్ల రూపాయలు కొట్టేశారు.
- శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పూర్తిగా పక్కన పెట్టేశారు.
- రాజధాని ప్రాంతం(సీఆర్డీఏ) సరిహద్దులను తమ ఇష్టారాజ్యంగా, తమకు నచ్చినప్పుడు మార్చుకున్నారు.
రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన పెద్దలు.. గద్దలు
హెరిటేజ్ః 14.22 ఎకరాలు
మాజీ మంత్రి నారాయణ, ఆయన బినామీలుః 55.27 ఎకరాలు
లింగమనేని రమేష్ః 351.25 ఎకరాలు
వేమూరి రవి కుమార్ః 62.77 ఎకరాలు
మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుః 38.84 ఎకరాలు
బాలకృష్ణ వియ్యంకుడుః 499 ఎకరాలు
రావెల కిషోర్ బాబుః 40.85 ఎకరాలు
జీవీ ఆంజనేయులుః 37.84 ఎకరాలు
పయ్యావుల కేశవ్ః 15.30 ఎకరాలు
పల్లె రఘునాథ రెడ్డిః 7.5 ఎకరాలు
కోడెల శివప్రసాదరావుః 17.3 ఎకరాలు
ధూళిపాళ్ళ నరేంద్రః13.50 ఎకరాలు
కొమ్మాలపాటి శ్రీధర్ః 68.60 ఎకరాలు
పుట్టా మహేష్ యాదవ్ః 7 ఎకరాలు
లోకేష్ బినామీలు, టీడీపీ నాయకులు, వారి బినామీలుః కొన్ని వందల ఎకరాలు కొనుగోలు చేశారు.
అవినీతి, లంచాలకు తావులేకుండా.. ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్‌ః ముఖ్యమంత్రి వైయస్ జగన్
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వీలైనంత వరకు ప్రయోజనం కలిగించడం, కోతలు లేకుండా వారి వేతనాలు పూర్తిగా చెల్లించడంతో పాటు, ఎక్కడా అవినీతి, లంచాలకు తావు లేకుండా ఉండడం కోసమే ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.
- ఔట్ సోర్సింగ్ పేరుతో చివరకు దేవాలయాల్లో క్లీనింగ్ చేసే శానిటేషన్ పనులు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో.. ఆయన బంధువు భాస్కరనాయుడుకు ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇచ్చి దోచేశారు.
అచ్చెన్నాయుడుపై ప్రివిలేజ్ మోషన్
- టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రివిలేజ్‌మోషన్ ప్రవేశపెట్టారు.
- అచ్చెన్నాయుడు తప్పుడు సమాచారంతో సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే ఆయనపై ప్రివిలైజ్ మోష్ మూవ్ చేస్తున్నామని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
- ఈ మోషన్‌ను ప్రివిలైజ్ కమిటీకి స్పీకర్ తమ్మినేని సీతారామ్ సిఫారసు చేశారు.