video: దారుణం... ఇసుక కొరతతో కార్మికుడి సెల్ఫీ సూసైడ్

By Arun Kumar P  |  First Published Oct 28, 2019, 10:33 AM IST

ఆంధ్ర ప్రదేశ్ లో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. ఇసుక కొరత కారణంగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.  


గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ నెలకొన్న ఇసుక కొరత మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఉపాధి అవకాశాలు లేకపోవడం, రోజురోజుకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవడంతో తట్టుకోలేకపోయిన ఓ గుంటూరు జిల్లావాసి ఆ దారుణానికి పాల్పడ్డాడు. చనిపోయేముందు తన సెల్ ఫోన్ లో సెల్పీ వీడియో తీసుకుని మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

గుంటూరుకు చెందిన పోలెపల్లి వెంకటేశ్ ప్లంబర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇటీవల నెలకొన్న ఇసుక కొరతతో అతడికి గతకొంతకాలంగా పని  దొరకడం లేదు. దీంతో కుటుంబాన్ని పోషణకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాడు. 

Latest Videos

undefined

అయితే ఇప్పటికే పని దొరక్క తీవ్ర ఒత్తిడిలో వున్న అతడికి ఆర్థిక కష్టాలు ఎక్కువవడంతో తట్టుకోలేకపోయాడు. దీంతో ఇక బ్రతకడం భారంగా భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందుకు  కొద్దిసేపటి ముందు తన సెల్ ఫోన్ లో ఓ సెల్పీ  వీడియోను తీసుకున్నాడు. అందులో తన ఆత్మహత్యకు కారణాలను వివరించడంతో పాటు తన గుండెల్లో దాగున్న బాధనంతా బయటపెట్టాడు. కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు.

read more కార్మికుల ఆత్మహత్యలపై చంద్రబాబు ఆవేదన... ప్రభుత్వంపై సీరియస్

ఈ ఆత్మహత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్మికుడు ఆత్మహత్య తర్వాత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ సెల్ఫీ వీడియో బయటకు రావడంతో పోలీసులు  కూడా చర్యలు ప్రారంభించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

ఇదే జిల్లాలో గతంలో ఇదే సమస్యకు ఓ తాపీమేస్త్రీని బలయ్యాడు. గుంటూరు, తెనాలి మండలం సంగం జాగర్లమూడిలో చింతం నాగ బ్రహ్మజీ (35) అనే తాపీమేస్త్రీ గత 5 నెలలుగా పనులు లేక, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. దీంతో అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు పనిలేకపోవడం చిన్నపిల్లల్ని వదిలేసి భార్య కూలీకి వెళ్లడంతో మనస్తాపం చెందిన బ్రహ్మాజీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 

read more video news : తాపీమేస్త్రీని బలితీసుకున్న ఇసుక కొరత

ఇలా ఇసుక కొరతతో ఉపాది కోల్పోయి ఇప్పటికే ఇద్దరు కార్మికులు బలవన్మరణానికి పాల్పడగా తాజాగా మరో ఘటన జోటుచేసుకుంది. ఈ ఆత్మహత్యలపై మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుఇదివరకే స్పందించారు.ఈ ఆత్మహత్యలకు వైఎస్సార్‌సిపి ప్రభుత్వమే కారణమంటూ చంద్రబాబు ట్విట్టర్ వేదికన విరుచుకుపడ్డారు. 

''జీవితం ఎంతో విలువైనది, పోరాడి సాధించాలే తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదు. ఇంకెవరూ తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంది. నేను ఉన్నాను. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరాడుదాం. ఇసుక అక్రమాలపై నిలదీద్దాం.'' అంటూ కార్మికులకు ఆయన ధైర్యాన్ని నూరిపోశారు.
 

వీడియో

click me!