ఏపీ రాష్ట్ర లోకాయుక్త చైర్మెన్ గా రిటైర్డ్ జస్టిస్ లక్ష్మణరెడ్డి ఆదివారం నాడు ప్రమాణం చేశారు.
హైదరాబాద్:ఏపీ లోకాయుక్తగా రిటైర్ట్ జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ఆదివారం నాడు ప్రమాణం చేశారు. ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ లక్ష్మణ్ రెడ్డి ప్రమాణం చేయించారు.ఏపీ లోకాయుక్తగా రిటైర్ట్ జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ప్రమాణ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ కూడ పాల్గొన్నారు.
ఐదు రోజుల క్రితం ఏపీ లోకాయుక్త ఛైర్మెన్ గా ప్రభుత్వం లక్ష్మణరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సర్కార్ లోకాయుక్త చట్టానికి సవరణలు చేసిన విషయం తెలిసిందే.
ఏపీ హైకోర్టుకు చెండిన రిటైర్డ్ న్యాయమూర్తి లేదా రిటైర్ట్ ప్రధాన న్యాయమూర్తిని కూడ నియమించుకోవచ్చని చట్ట సవరణ చేసింది. అయితే లోకాయుక్త చైర్మెన్ విషయంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాల్సి ఉంటుంది.