సీఎం జగన్ ఎస్వీబీసీ ద్వారా సేవ చేసుకునే అవకాశాన్ని తనకు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఎస్వీబీసీని ప్రక్షాళన చేసి మరింతగా భక్తులకు చేరువ చేసేందుకు కృషి చేస్తానని పృధ్వీరాజ్ జగన్ కు స్పష్టం చేశారు.
అమరావతి: ఎస్వీబీసీ చైర్మన్ గా అవకాశం కల్పించిన సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటానన్నారు సినీనటుడు పృథ్వీరాజ్. ఎస్వీబీసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ ను కలిశారు.
తనను ఎస్వీబీసీ చైర్మన్ గా నియమించినందుకు జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎస్వీబీసీ చానల్ ను ప్రారంభించి భక్తులకు అనేక సేవలు అందించే అవకాశం కల్పించారన్నారు.
సీఎం జగన్ ఎస్వీబీసీ ద్వారా సేవ చేసుకునే అవకాశాన్ని తనకు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఎస్వీబీసీని ప్రక్షాళన చేసి మరింతగా భక్తులకు చేరువ చేసేందుకు కృషి చేస్తానని పృధ్వీరాజ్ జగన్ కు స్పష్టం చేశారు.
ఎలాంటి అవినీతికి తావులేకుండా చూడాలని సీఎం జగన్ పృథ్వీరాజ్ ను ఆదేశించారు. భక్తులకు మంచి ప్రచారాలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ను టీటీడీ అర్ఛకులు, పృథ్వీరాజ్ లు ఘనంగా సన్మానించారు.