మాజీ అధికారి నిర్వాకం: ఉద్యోగం ఇప్పిస్తానని మహిళపై అత్యాచారం

By telugu team  |  First Published Sep 14, 2019, 7:56 AM IST

ఓ మాజీ అటవీ శాఖ అధికారి ఉద్యోగం ఆశచూపి ఓ గిరిజన మహిళపై కార్యాలయంలోనే పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీసులకు బాధిత మహిళపై మోహన్ రావుపై ఫిర్యాదు చేసింది.


గుంటూరు: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి గుంటూరు జిల్లాకు చెందిన అటవీ శాఖ మాజీ అధికారి (డిఎఫ్ఓ) ఓ గిరిజన మహిళపై అత్యాచారం చేశాడు. తన నుంచి డబ్బులు తీసుకోవడమే కాకుండా, ఆఫీసులోనే తనపై అత్యాచారం చేశాడని మహిళ శుక్రవారం మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ప్రకాశం జిల్లా ఈపూరుపాలెం గ్రామానికి చెందిన వివాహిత (29) భర్తతో విడిపోయి తన తల్లి వద్ద ఉంటోంది. ఆమెకు ఓ కూతురు కూడా ఉంది. గుంటూరు అటవీ శాఖ కార్యాలయంలో ఉద్యోగం ఉందని తెలిసి, ఈ ఏడాది ఫిబ్రవరిలో వెళ్లింది. అప్పటి డిఎఫ్ఓను కలిసి దరఖాస్తు ఇచ్చానని బాధిత మహిళ తన ఫిర్యాదులో తెలిపింది.

Latest Videos

కొద్ది రోజుల తర్వాత అతని నుంచి తనకు ఫోన్ వచ్చిందని, దాంతో అక్కడికి వెళ్లానని తెలిపింది. క్లర్కు ఉద్యోగం ఉందని, రెండు లక్షల రూపాయలు ఇస్తే ఉద్యోగం ఇస్తానని మోహన్ రావు చెప్పాడని ఆమె చెప్పింది. తాను అప్పులు చేసి రెండు రూపాయలు ఇచ్చినట్లు తెలిపింది.

అది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఎవరూ లేని సమయంలో ఓ ఆదివారం తనను కార్యాలయానికి పిలిచి  కోరిక తీరిస్తే ఉద్యోగం ఇస్తానని చెప్పాడని, తాను అంగీకరించకపోవడంతో తనపై అత్యాచారం చేశాడని ఆమె ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత కూడా ఉద్యోగం తప్పకుండా ఇస్తానంటూ పలుమార్లు తనపై అత్యాచారం చేసినట్లు తెలిపింది.

click me!