జగన్ సీఎం అయ్యాడని ఆనందించా... కానీ: మాజీ మంత్రి పితాని

By Arun Kumar PFirst Published Dec 24, 2019, 6:32 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ కు  ఓ యువ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడని తాను చాలా ఆనందించానని... ప్రజల నమ్మకం ఆయనపై వుందని అనుకున్నానని మాజీ మంత్రి పితాని సత్యానారాయణ పేర్కొన్నారు.  

అమరావతి
:  ఆంధ్ర ప్రదేశ్ లో నూతనంగా అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం మైండ్ గేమ్ లో భాగంగానే అమరావతిపై పిచ్చితనంగా స్టేట్మెంట్స్ ఇచ్చారని మొదట తాము నమ్మలేదని మాజీమంత్రి


, టిడిపి నాయకులు పితాని సత్య నారాయణ అన్నారు. అయితే తాజాగా భీమిలిలో రాజధాని వస్తుందని ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పడంతో సీరియస్ గానే రాజధాని విషయంలో చర్యలు తీసుకుంటున్నట్లు అర్థమయ్యిందని... ఇది ఎంతవరకు సమంజసమని పితాని అన్నారు. 

ఓ వైపు రాజధాని రైతులు రాజధాని విషయం ఏమవుతుందోనని ఆందోళన చెందుతుంటే ఇలా వైసిపి నాయకులు రోజుకో ప్రకటన చేయడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. స్పీకర్ స్థాయి వ్యక్తి అమరావతిని ఎడారిగా పోల్చడం భావ్యం కాదన్నారు. 

ప్రభుత్వ నిర్ణయాలు వ్యతిరేకిస్తే కేసులు పెట్టాలని చూస్తున్నారని...ఇలా పోలీసులను ఉపయోగించి మాట్లాడకుండా చేస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి ఒక యువకుడిగా జగన్ ముఖ్యమంత్రి అయ్యారంటే ప్రజలు ఆయన్నే కోరుకున్నారని ఆనందపడ్డానని అన్నారు. కానీ ఇప్పుడు ఆయన చర్యలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతుండటం చూసి బాధగా వుందన్నారు. 

read more  మూడు రాజధానుల ఏర్పాటు చేయవచ్చు... ఎప్పుడంటే: బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు

 సీఎం జగన్  డైరెక్షన్ లో వచ్చిన నివేదికే జీఎన్ రావు నివేదికని అందరికీ అర్థమవుతుందన్నారు. క్రిస్మస్ కానుకగా బుధవారం రాజధాని అమరావతే అని ముఖ్యమంత్రి  ప్రకటించి తన స్థాయిని నిలుపుకోవాలని పితాని సూచించారు. 

టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ...ఓ కుక్కను చంపాలంటే పిచ్చికుక్క అని ముద్ర వేసి చంపినట్లే అమరావతిపై కూడా ఓ చెడ్డ ముద్ర వేసి చంపాలని చూడటం తగదన్నారు. అమరావతి ముంపు ప్రాంతం అనేది పచ్చి అబద్ధమని...ఇక్కడ నిర్మాణానికయ్యే ఖర్చు ఎక్కువగా వుందన్నది కూడా తప్పుడు ప్రచారమేనని అన్నారు. 

అమరావతిని ఒకే సామాజిక వర్గానికి అపాదించడం కూడా అవాస్తవమన్నారు.. వైసిపి నాయకులు అంటున్నదే నిజమయితే అమరావతిలో జరిగిన ఇన్సైడ్ ట్రేడింగ్ అంశంపై సిట్టింగ్ జడ్జితో జ్యూడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని... అందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

read more  అమరావతి రైతుల వినూత్న నిరసన... ప్రధానికి ఆధార్ కార్డులతో కూడిన లేఖలు

రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ విశాఖ, కర్నూల్  ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలోనే అదాని, లులూ గ్రూప్స్ తెచ్చి విశాఖను  ఆర్ధిక రాజధానిగా తీర్చిదిద్దారన్నారు. ఇప్పుడు జగన్ కొత్తగా చేసేదేం లేదు..కేవలం ప్రజలను మోసం చేయడం తప్ప అని అన్నారు. 

రాష్ట్ర ప్రజలు ఒక నియంతతో పోరాడుతున్నారని.. ముఖ్యమంత్రితో కాదన్నారు. కాబట్టి ప్రజలు ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలని సూచించారు. వారికి టిడిపి పార్టీ అండగా వుంటుందని రామమానాయుడు హామీ ఇచ్చారు.  


 

click me!