సంక్రాంతికి కోడిపందాలు నిర్వహించి తీరతాం: వైసిపి ఎంపీ బహిరంగ ప్రకటన

By Arun Kumar P  |  First Published Dec 24, 2019, 2:37 PM IST

వైసిపి ఎంపీ రఘురామకృష్ణంరాజు సంక్రాంతి కోడిపందేలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్టిపరిస్థితుల్లో ఈ పందేలను నిర్వహించి తీరతామని బహిరంగంగానే ప్రకటించారు. 


నరసాపురం: ఆంధ్ర ప్రదేశ్ కు మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాలకు కోడి పందాలతో విడదీయరాని సంబంధం వుందని వైసిపి ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.     అందువల్లే అనాది కాలంగా సంక్రాంతికి పండగ సమయంలో ఈ పందేలు ఆడటం ఆనవాయితీగా వస్తుందని... ఇప్పుడు ఈ పందేలను ఆడకుండా చట్టవిరుద్దం అంటే ఎలాగని పోలీసులను, ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. 

జూదానికి, హింసకు తావు లేని కోడిపందాల వల్ల ఎలాంటి నష్టం లేదు కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో ఈ సంక్రాంతికి కూడా ఖచ్చితంగా జరుగుతాయన్నారు. కోడిపందాలు అనేవి ఎంతో ఆనందంగా జరుపుకునే సంక్రాంతి పండగలో ఒక  భాగమని...తెలుగు సంస్కృతి సాంప్రదాయలలో అంతర్భాగమన్నారు. సంక్రాంతిని, కోడి పందాలను   గోదావరి జిల్లాల్లో ఎవరూ విడదీయలేరని... ఎవరైనా విడదీయాలని చూస్తే వారి ఆలోచనలు దెబ్బతింటాయని ఎంపీ పేర్కొన్నారు. 

Latest Videos

ఒకవేళ ఈ పందేలు జరక్కుండా వుండాలంటే దిశ చట్టం మాదిరిగా ఓ కఠిన చట్టాన్ని తీసుకురావాలన్నారు. ఈ పందేల్లో పాల్గొన్న అందరినీ ఉరితీయాలన్నారు. లేదంటే కోటి రూపాయల వరకు జరిమానా విధించినా పరవాలేదు కాని ఎట్టి పరిస్థితుల్లో పందేలు జరుగుతాయని ఎంపీ  తెలిపారు. 

ఘోరం: కిడ్నాప్ చేసి బాలికపై అత్యాచారం

అమరావతి రాజధాని మార్పుపై  ఆ ప్రాంత రైతులకు ఆందోళన కలగడం సహజమేనని... వారి ఆందోళనను తప్పు పట్టడం న్యాయం కాదన్నారు. అమరావతి నుంచి రాజధాని పూర్తిగా తరలించడం లేదని....దానితో పాటు విశాఖ కూడా రాజధానిగా ఉంటుంది అని అన్నారు.

అమరావతి రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఇంకా రాజధాని పై పూర్తిగా క్లారిటి రాలేదని... క్యాబినెట్ ఆమోదం,  అసెంబ్లీ లో ఆమోదం జరిగితే కానీ రాజధాని మార్పుపై  స్పష్టత రాదన్నారు. 

అమరావతి రాజధాని రైతులకు అన్యాయం జరగదనే తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. కేబినెట్ ఆమోదం, అసెంబ్లీ ఆమోదం ఉన్నాయి కనుక తమకు న్యాయం చేయండని రాజధాని రైతులు కోరడం తప్పేంకాదని వ్యక్తిగత అభిప్రాయమన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయమే రాష్ట్రానికి మూడు రాజధానులని అన్నారు.

read more  'వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవి మిస్సింగ్'.. వెతికిపెట్టమంటున్న మహిళలు!

విశాఖ ఆల్రెడీ అభివృద్ధి చెందింది కాబట్టి  తాజా నిర్ణయంతో ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. అమరావతి అభివృద్ధి ఏ మాత్రం తగ్గదని... అమరావతిలో అనుకున్నట్టుగానే లేఔట్ ఇచ్చి అభివృద్ధి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ  చెప్పడం జరిగింది ఎంపీ గుర్తుచేశారు.  

click me!