వైసీపీ నేతల అరాచకాలు తట్టుకోలేకపోతున్నాం: బాబుతో పీసపాడు గ్రామస్తులు

Siva Kodati |  
Published : Oct 10, 2019, 11:46 AM ISTUpdated : Oct 10, 2019, 11:47 AM IST
వైసీపీ నేతల అరాచకాలు తట్టుకోలేకపోతున్నాం: బాబుతో పీసపాడు గ్రామస్తులు

సారాంశం

తమ గ్రామంలో వైసీపీ కార్యకర్తల దౌర్జన్యాలను తట్టుకోలేకపోతున్నామని గుంటూరు జిల్లా క్రోసూరు మండలం పీసపాడు గ్రామస్తులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారు.

తమ గ్రామంలో వైసీపీ కార్యకర్తల దౌర్జన్యాలను తట్టుకోలేకపోతున్నామని గుంటూరు జిల్లా క్రోసూరు మండలం పీసపాడు గ్రామస్తులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారు.

బుధవారం గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాబును కలిసిన వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వాటర్ ప్లాంట్ పైపులు పగులకొట్టారని, అంగన్ వాడి కార్యకర్తగా ఉన్న వారిని రాజీనామా చేయాలని బెదిరిస్తున్నారని వాపోయారు.

దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ వేడుకల్లో వైసిపి జెండాలతో బాంబులు పేల్చి గ్రామంలో భయోత్పాతం సృష్టించారని పేర్కొన్నారు. రేషన్ డిపో డీలర్ ను బెదిరిస్తున్నారని, వికలాంగులని కూడా  చూడకుండా పెన్షనీర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బాబు దృష్టికి తీసుకొచ్చారు.

రౌడీషీటర్ సాయి అరాచకాలు భరించలేక పోతున్నామని, ఎమ్మెల్యే అండ చూసుకుని అతను రెచ్చిపోతున్నాడని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన చంద్రబాబు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

రైల్వేకోడూరు: అభ్యర్ధిని మార్చిన జనసేన, భాస్కరరావు స్థానంలో శ్రీధర్
ఆటోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం: డ్రైవర్ల సమస్యలపై జనసేనాని ఆరా