రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కమిటీ: విధి విధానాలు విడుదల చేసిన ఏపీ సర్కార్

By narsimha lode  |  First Published Oct 10, 2019, 7:43 AM IST

ఏపీ ప్రభుత్వం మరో కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ కమిటీ పనిచేయనుంది. ఈ కమిటీ పలువురితో సంప్రదింపులు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.


గుంటూరు: ఏపీ  రాజధాని అమరావతి,  రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్రణాళిక రూపకల్పన కోసం  నియమించిన నిపుణుల కమిటీ విధి విధానాలపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో రాష్ట్రంలో నిపుణుల కమిటీ పర్యటించనుంది.

ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని వర్గాలకు చెందిన ఉద్యోగుల నుండి ఈ కమిటీ సమాచారాన్ని సేకరించనుంది.ఈ మేరకు ఈ కమిటీకి ప్రభుత్వం అధికారాన్ని కట్టబెట్టింది. క్షేత్రస్థాయి పర్యటనలు, వివిధ వర్గాలతో సంప్రదింపులు జరపనుంది కమిటీ.

Latest Videos

ఈ కమిటీకి అవసరమైన సిబ్బందిని సీఆర్డీఏ అందించనుంది.  ప్రభుత్వంతో సంప్రదింపుల కోసం సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ విజయ కృష్ణన్ నోడల్ ఆఫీసర్ గా వ్యవహరించనున్నారు.  ఈ కమిటీ తొలి సమావేశం జరిగిన ఆరు వారాల్లోనే ప్రభుత్వానికి నివేదికను సమర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ ప్రభుత్వం అన్ని విభాగాల్లో సంస్కరణలు తీసుకొని రావాలని భావిస్తోంది.ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకొంది. 
 

click me!