బాధ్యత గల వైసిసి ఎమ్మెల్యేలు బరితెగించి మహిళా నాయకురాళ్లపై పరుష పదజాలంతో దూషిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరు: ప్రభుత్వం చేసే తప్పులను విమర్శిస్తే వైసీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా దూషిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు. దిశా చట్టం తీసుకువచ్చాం, మహిళలపట్ల సానుకూలంగా స్పదింస్తాం, సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా పోస్టుల పెట్టితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసిపి ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని అనురాధ నిలదీశారు.
2000 ఎన్నికలల్లో విజయవాడలో టిడిపి మేయర్, ముగ్గురు ఎమ్మెల్యేలు గెలవడం జరిగిందని అనురాధ గుర్తుచేశారు. మల్లాది విష్ణు కార్పొరేట్‌గా పోటీ చేసి ఎంత దారుణంగా ఓడిపోయారో అందరికి తెలుసన్నారు. విష్ణు గురించి బీసెంట్ రోడ్డుల్లో, సీట్‌ను, ఉడా డిపాంట్‌మెంట్‌లో అడిగిన చెబుతారని అన్నారు.
చంద్రబాబునాయుడిని దిక్చూచిగా విజయవాడలో మేయర్‌గా తాను మంచి పేరు తెచ్చుకోవడం జరిగిందన్నారు. దిశా చట్టం తీసుకువచ్చామని గొప్పగా చెప్పిన సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు వైసిపి ఎమ్మెల్యేలు అసభ్యంగా మాట్లాడితే ఎక్కడ ఉన్నారని అనురాధ ప్రశ్నించారు.
read more జగన్ విశాఖ పర్యటనలో పెయిడ్ ఆర్టిస్టులు...: నాదెండ్ల
ఇదే విషయంపై మాజీ మంత్రి కెఎస్ జవహర్ మాట్లాడుతూ... భారత రాజ్యాంగం పట్ల మర్యాదగా ఉండాల్సిన బాధ్యత గల వైసిసి ఎమ్మెల్యేలు బరితెగించి పరుష పదజాలంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ పట్ల మల్లాది విష్ణు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జవహర్ తీవ్రంగా ఖండించారు.
రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ఎక్కడా లేని విధంగా దిశ చట్టం అమలు చేస్తామని గొప్పలు పలికిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మహిళలను ఏవిధంగా విమర్శిస్తున్నారో తెలుసుకోలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. అధికార పార్టీ అండతో వైసిపి నాయకులు మహిళలపై పరుష పదజాలంతో మాట్లాడిన పట్టించుకోని ప్రభుత్వం నిరుపయోగంగా ఉందన్నారు.
రాష్ట్రంలో దిశ చట్టాన్ని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే అదిరెడ్డి భవానీగా స్వీకరిస్తామని చెప్పిన ప్రభుత్వం రెండో కేసుగా పంచుమర్తి అనూరాధ కేసుగా నమోదుచేసి మల్లాది విష్ణు ని అరెస్టు చెయాలని సూచించారు. మహిళా హోంమంత్రి సుచరిత దీనిపై వెంటనే స్పందించాలని సూచించారు.
read more జగన్ ప్రధాని... విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రి: మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
రాజధాని తరలింపుపై రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఆందోళనలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.ఈ మీడియా సమావేశంలో టిడిపి సీనియర్ నాయకులు కరుటూరి సతీష్, ముళ్ళపూడి రాము, పోట్రూ సిద్దు, గారపాటి కృష్ణ,పిల్లి శ్రీనివాసరావు, ముత్యాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.