సొంత చెల్లెలే జగన్‌ని నమ్మడం లేదు... మేమెలా నమ్మాలి...: టిడిపి ఎమ్మెల్యే

By Arun Kumar P  |  First Published Jan 28, 2020, 10:09 PM IST

సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైతే గుండెపోటుతో మరణించారని చిత్రీకరించడానికి ఎందుకు ప్రయత్నించారని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. 


వివేకానందరెడ్డి హత్యపై ప్రతిపక్షంలో ఉన్నపుడు సీబీఐ విచారణ కోరిన జగన్‌ నేడు ముఖ్యమంత్రి అయి ఎనిమిది నెలలు దాటినా సీబీఐ విచారణ జరపకుండా సిట్‌లతో ఎందుకు కాలక్షేపం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ....వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత, ఆమెభర్త రాజశేఖర్‌రెడ్డి గార్లు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో అపిఢవిట్‌ దాఖలు చేశారని అందులో తమ తండ్రి హత్య కేసుపై సీబీఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించేలా హైకోర్టు ఆదేశించాలని కోరారని తెలిపారు. 

వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైతే గుండెపోటుతో మరణించారని చిత్రీకరించడానికి ఎందుకు ప్రయత్నించారని అన్నారు. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు హత్య జరిగిన ప్రదేశంలో బాత్రూమ్‌, బెడ్‌రూముల్లో రక్తపు  మరకలు ఎందుకు తుడిచివేశారని నిలదీశారు. రక్తపు మరకలున్న బెడ్‌షీట్‌ను ఎందుకు మార్చారు? హత్యకు గురై చనిపోయిన డెడ్‌ బాడీకి ఎందుకు కట్లుకట్టారు? అని ప్రశ్నించారు. 

Latest Videos

అఫిడవిట్‌ పేజీ 22లోని పేరా 20లో వై.యస్‌.భాస్కర్‌రెడ్డి (ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి, భారతి మేనమామ), వైయస్‌ మనోహర్‌రెడ్డి, వైయస్‌. అవినాష్‌రెడ్డి(ఎంపీ), ఈసీ సురేందర్‌రెడ్డి వంటి వారు సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్రయత్నించినట్లు వుందన్నారు. ఈ ఎవిడెన్స్‌ను  ఎందుకు రిమూవ్‌ చేయాలని ప్రయత్నించారని ప్రశ్నించారు. 11వ పేజీ 11వ పేరాలో సిట్‌ను ఎందుకు  డైల్యూట్‌ (బలహీనపర్చటం) చేస్తున్నారని అన్నారు.

read more  మండలిని రద్దు చేసిన జగన్ కృతజ్ఞతలు...: ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్స్

సిట్‌ టీం హెడ్‌ అడిషనల్‌ డీజీ అమిత్‌గార్గ్‌ ర్యాంకు నుంచి ఎస్పీ ర్యాంకుకు ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. సిట్‌ మెంబర్స్‌ని ఎందుకు పదే పదే మారుస్తున్నారని అడిగారు. పేరా 16లో ఎస్పీగా అన్బురాజన్‌ను నియమించాక ఇన్వెస్టిగేషన్‌ ఆలస్యమవుతోందన్నారని... మార్చటానికి కారణాలు డీజీ గాని, గవర్నమెంట్‌గాని తమకు గానీ, ప్రజలకు గానీ చెప్పటం లేదన్నారు. 

16వ పేజీ 18వ పేరాలో వైయస్‌ జగన్‌ ప్రతిపక్షనేతగా ఉన్నపుడు  సీబీఐ విచారణ జరిపించాలని హైకోర్టును కోరి నేడు అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినా ఇప్పటి ముఖ్యమంత్రి సీబీఐ విచారణ కావాలని కోరనందున తనకు అనుమానాలు కల్గుతున్నాయని జగన్‌ చెల్లెలు కోర్టుకు తెలిపిందన్నారు. రియల్‌గా మర్దర్‌ చేసినవారిని దాచిపెట్టి ఇన్నోసెంట్‌ పర్సన్స్‌ను కేసులో చేర్చి ఎందుకు కేసును పక్కదారి పట్టిస్తున్నారని అడిగారు. 

తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కావాలని స్వయంగా ముఖ్యమంత్రి చెల్లెలే డీజీకి లేఖ రాశారంటే ముఖ్యమంత్రిపై ఎంత విశ్వసనీయత ఉందో అర్ధమవుతుందన్నారు. అందరిని అక్కా, చెల్లి అని రాష్ట్రంలో తిరిగావు, నేడు నీ సొంత చెల్లే నమ్మకం లేదంటోందన్నారు. తన సొంత చెల్లే నాకు రక్షణ లేదంటోందన్నారు.

 సొంత చెల్లే నీ ప్రభుత్వం మీద, నీ పోలీసుల మీద విశ్వాసం లేదంటోందన్నారు.  చెల్లెలు, చిన్నమ్మకి నీపై నమ్మకం లేకపోతే తామెట్లా ఆయన్ని నమ్మాలి... రాష్ట్ర ప్రజలు ఎలా నమ్మాలి?అని ప్రశ్నించారు. అంత:పురంలోని హంతకుల్ని కాపాడి, అమాయకుల్ని  బలి చేసే కుట్రలను ప్రజలు సహించరన్నారు.

ఆంధ్రప్రదేశ్ యువతని వల్డ్ క్లాస్ స్కిల్ ఫోర్స్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం: గౌతమ్ రెడ్డి

వివేకానందరెడ్డి హంతకుల్ని రక్షించని ముఖ్యమంత్రివే అయితే సీబీఐ విచారణకు అప్పగించాలన్నారు. తన చెల్లెలు,  పిన్నమ్మ కుటుంబానికి రక్షణ కల్పించు అని జగన్‌ ఉద్దేశించి రామానాయుడు అన్నారు.

click me!